వికసిత భారత్, మూడో ఆర్థిక శక్తిగా దూసుకుపోతున్న భారత్, విశ్వగురువులాంటి భుజకీర్తులు తగిలించుకొని భారీ ఎత్తున ప్రచారం చేసుకుంటున్న నేతలారా.. మన పయనం ముందుకా? వెనక్కా? ఒకసారి తిరిగి చూసుకుంటారా?
యూపీఏ పదేళ్లు vs ఎన్డీయే పుష్కర కాలం..
2014-15 నుంచి 2025-26 మధ్య మోదీ ప్రభుత్వం చేసిన అప్పులు మొత్తం రూ 138.52 లక్షల కోట్లు.
ఇదే యూపీఏ ఒకటి, రెండు ప్రభుత్వాల పది సంవత్సరాల కాలంలో చేసిన అప్పులు రూ 35.44 లక్షల కోట్లు. సంవత్సరాల వారీగా మోదీ పుష్కర పాలన కాలంలో చేసిన అప్పులు, యూపీఏ ప్రభుత్వ కాలంలో చేసిన అప్పులను కింది పట్టికలలో చూడండి.



ధరల మోత… అయినా ఖాళీ అవుతున్న ఖజానా..
ఒకవైపు ప్రజా ప్రయోజన పద్దులకు నిధుల కోత పెడుతున్నారు.
మరొకవైపు పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, వంటగ్యాస్ ధరలు ఇబ్బడిముబ్బడిగా పెంచి ప్రజల నడ్డి విరగ్గొడుతున్నారు.
అయినా ఖజానా ఖాళీ అవుతున్నది. అప్పులు మేరు పర్వతంలా పెరిగిపోతున్నాయి. ఏమవుతున్నది ఈ డబ్బంతా?
వడ్డీలకే లక్షల కోట్లు… సమాధానం ఏది?
ఈ పుష్కర కాలంలో అప్పుల మీద చెల్లించిన వడ్డీ ఏకంగా రూ 85,51,246 కోట్లు(85 లక్షల 51 వేల 246 కోట్లు). సాధారణ ప్రజల ఓట్లతో గద్దెనెక్కిన ప్రభుత్వం ప్రజలకు ఈ వాస్తవాలను తెలియజేయాల్సిన అవసరం ఉంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
