నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పదవి చేపట్టి 12 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా, ఆయన పుష్కర కాలం పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి, ప్రజల స్థితిగతులు తెలుసుకుంటున్నాం.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఈ 12 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఎంత మొత్తం తీసుకున్నది, అది యూపీఏ 10 సంవత్సరాల పాలనలో తీసుకున్న దానికంటే ఎంత ఎక్కువ అనే విషయాలను ఇంతకుముందు వ్యాసం ‘భారతదేశం: మోదీ పుష్కర పాలన.. దేశ ఆర్థిక స్థితి..-1’లో తెలియజేశాం.
డాలర్‌తో రూపాయి పతనం – దిగుమతులపై భారం..
ప్రస్తుతం రూపాయి విలువ అమెరికన్ డాలర్‌తో పోలిస్తే సంవత్సరాల వారీగా ఎలా పడిపోయింది(https://thewire.in/energy/full-text-subhash-garg-on-the-problem-with-the-modi-govts-short-term-economic-measures), ఫలితంగా మనం చేసుకున్న దిగుమతులపై సంవత్సరాల వారీగా అదనంగా భారతదేశం ఎన్ని లక్షల కోట్ల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది అనే విషయాల గురించి తెలుసుకుందాం.
2014 నాటికి అమెరికన్ డాలర్‌తో రూపాయి విలువ రూ 58గా ఉంది. నేడు అది రూ 96కి పడిపోయింది. అది ఇంకా రోజురోజుకు పడిపోతున్నది. త్వరలో వంద రూపాయలు కూడా దాటుతుందని అనేకమంది ఆర్థిక నిపుణులు తెలియజేస్తున్నారు.
ఆ విధంగా రూపాయి విలువ పడిపోవడంతో.. ఈ 12 సంవత్సరాల కాలంలో మనం చేసుకున్న దిగుమతులు 2013-14తో సమానంగా ఉన్నాయని ఊహించుకున్నా, దానిపై మనం అదనంగా చెల్లించిన మొత్తం 69 లక్షల 33 వేల 118 కోట్లు(రూ 69,33,118 కోట్లు).
వివరాలు కింద పట్టికలో చూడండి.

ఇతర దేశాల కరెన్సీలతో పోలిక
——————–
విచిత్రం ఏమిటంటే, ఒకవైపున భారత దేశ రూపాయి విలువ పడిపోతుంటే- మరికొన్ని దేశాల కరెన్సీ విలువ అమెరికన్ డాలర్‌తో పోల్చినప్పుడు క్రమంగా పెరుగుతున్నది, మరీ ముఖ్యంగా ఈ 2026 సంవత్సరంలో చాలా మార్పులు కనిపించాయి. ఆ వివరాలు కింద పట్టికలో చూడండి.



– ఆర్ లక్ష్మయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
