మండుటెండను, ప్రభుత్వ కార్యాలయాల అలసత్వాన్ని ఎదుర్కొంటూ, ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాకు చెందిన ఒక గిరిజన మహిళ తన 90 ఏళ్ల అత్తగారిని వీపుపై వేసుకుని దాదాపు 4 కిలోమీటర్లు నడిచింది.
వృద్ధురాలైన ఆమె అత్తగారికి నెలకు వచ్చే ₹500 పెన్షన్ డబ్బులు అందడం కోసం బ్యాంక్ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి ఆమె ఈ కష్టానికి ఓర్చింది.
నిలిచిపోయిన పెన్షన్.. కదిలించిన వీడియో..
కేవైసీ ప్రక్రియ పెండింగ్‌లో ఉన్నందున బ్యాంక్ గత నాలుగు నెలలుగా ఇంటి వద్దకే పెన్షన్ అందించే సేవను నిలిపివేసింది.
50 ఏళ్లు పైబడిన ఆ మహిళ, తన నీరసించిపోయిన అత్తగారిని వీపుపై కట్టుకుని రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న ఒక వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కేవైసీ నిబంధనలతో ఆగిన చెల్లింపులు..
ఆ మహిళను జంగల్‌పారా గ్రామానికి చెందిన సుఖ్మనియాగా గుర్తించారు. అంతకుముందు ఒక ‘బ్యాంక్ మిత్ర’ ప్రతి నెలా ఇంటికే వచ్చి పెన్షన్ అందించేవారని, అయితే నాలుగు నెలల క్రితం కేవైసీ నిబంధనల కారణంగా చెల్లింపులు ఆగిపోయాయని సుఖ్మనియా తెలిపింది.
ఇక వేరే దారి లేకపోవడంతో, శుక్రవారం నాడు మైన్‌పాట్ పట్టణంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌కు వృద్ధురాలిని మోసుకుంటూ వెళ్లినట్లు చెబుతూ, మండుతున్న ఎండలో ఆమె కన్నీరు పెట్టుకుంది.
ఎట్టకేలకు అందిన పెన్షన్..
ఈ ఏడాది జనవరిలో చివరిసారిగా పెన్షన్‌ను ఆమె ఇంటి వద్దే అందించినట్లు అధికారులు తెలిపారు.
సుఖ్మనియా మే 22న బ్యాంకుకు చేరుకున్న తర్వాత, కేవైసీ ప్రక్రియ పూర్తి చేసి, గత నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న ₹2,000 పెన్షన్ మొత్తాన్ని విడుదల చేశారు.
టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక సౌజన్యంతో ఈ వ్యాసాన్ని అందిస్తున్నాము.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
