బీహార్ శాసనసభ ఎన్నికలతో పాటు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది.
బీహర్ ఎన్నికల నేపథ్యంలో గత కొన్ని నెలలుగా ఓటర్ల జాబితాతో పాటు అన్ని రకాలుగా రాజకీయ హడావిడి వాడివేడిగా కొనసాగుతుంది. బీహర్ ఎన్నికలు ఇటు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు అటు ఇండియా కూటమికి ప్రతిష్టాత్మకంగా మారాయి. “ఓటు చోరీ” తతంగం వెలుగులోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలు రెండు కూటములకు సవాల్‌గా ఉన్నాయి.
ఈ నేపథ్యంలో విడుదలైన అంతర్జాతీయ సంస్థ చేసిన సర్వే నివేదికలో దేశ రాజకీయ వ్యవస్థ, ప్రజాప్రతినిధులపై ప్రజలు తమ మనోగతాన్ని వినిపించారు.
“పీపుల్ అరౌండ్ ది వరల్డ్ వాంట్ పొలిటికల్ చేంజ్- బట్ మెనీ డౌట్ ఇట్కెన్ హ్యాపెన్” అనే శిర్షీకతో పీఈడబ్ల్యూ పరిశోధన సంస్థ ప్రపంచవ్యాప్తంగా 25 దేశాలలో సర్వేను నిర్వహించింది. “స్ప్రింగ్- 2025 గ్లోబల్ ఆటిట్యూడ్” తరఫున ఈ సర్వేను నిర్వహించడమైనది.
అవసరం ఎంతైనా ఉంది..
సర్వేలో భారత్, అమెరికాకు చెందిన ప్రజలు తమ దేశ రాజకీయ వ్యవస్థలు, ఎన్నుకున్న ప్రజాప్రతినిధులపై అభిప్రాయాలును వెల్లడించారు. వీటన్నింటిని క్రోడీకరించి పీఈడబ్ల్యూ పరిశోధన సంస్థ నివేదికను విడుదల చేసింది.
దేశ రాజకీయ వ్యవస్థలో భారీ మార్పులు అవసరమని మెజారిటీ భారతీయులు అభిప్రాయపడుతున్నట్టుగా నివేదిక తెలియచేసింది.
నివేదిక ప్రకారం, తాము ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు నిజాయితీపరులు, విద్యావంతులని మూడింట రెండు వంతుల మంది ప్రజలు విశ్వసిస్తున్నారు.
అయితే సర్వేలో పాల్గోన్న 70 శాతానికి పైగా ప్రజలు మాత్రం, దేశ రాజకీయ వ్యవస్థలో భారీ మార్పులు రావాలని కోరుకుంటున్నారు. మరో 34శాతం మంది వ్యవస్థలో సంస్కరణలను తీసుకురావాలని అనుకుంటున్నారు.
సర్వే నిర్వహించిన మిగితా 24 దేశాలలో కూడా 50శాతానికి మించి ప్రజలు, తమతమ దేశాల రాజకీయ వ్యవస్థలో సమూల మార్పులు రావాలని, లేదా పూర్తిగా సంస్కరించబడాలని అభిప్రాయపడుతున్నట్టుగా నివేదిక పేర్కొన్నది. దక్షిణ కొరియాలో 87 శాతానికి పైగా ప్రజలు రాజకీయ సంస్కరణలను కోరుకున్నారు. అయితే అందులో సగం మంది అసలు సంస్కరణలు జరుగుతాయానే అనుమానాన్ని వ్యక్తంచేశారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
