చరిత్రహీనుల పరిపాలన నుంచి దేశాన్ని విముక్తి చేయడానికి ఎర్రజెండా పార్టీలు, ప్రజాస్వామ్య లౌకిక శక్తులు ఏకం కావాలని భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) నాయకులు పిలుపునిచ్చారు.
దేశ స్వాతంత్య్రోద్యమంలో లేదా హైదరాబాద్ సంస్థానం విముక్తి పోరాటంతో ఏ మాత్రం సంబంధం లేని వారు ఈ రోజు అత్యున్నత పదవిలో ఒకటైన ఉప రాష్ట్రపతి పదవిలో ఉన్న వారిని పిలిపించుకొని, ఆయన చేత కూడా అబద్ధాలు మాట్లాడిస్తున్న వైనం చూస్తే చరిత్రను వక్రీకరించడానికి ఏ స్థాయికి బరితెగిస్తున్నారో ఆలోచించాలని వారు కోరారు.
విలీన దినోత్సవం సందర్భంగా బహిరంగ సభ..
నాటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీన దినోత్సవాన్ని పాటిస్తూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని స్మరించుకుంటూ సీపీఐ గురువారం స్థానిక ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బహిరంగ సభను ఏర్పాటు చేసింది.
సభలో పాల్గొన్న సీపీఐ ముఖ్య నేతలు..
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో పార్టీ జాతీయ కార్యదర్శులు పల్లా వెంకట్ రెడ్డి, కే రామకృష్ణ, ఎమ్మెల్సీ నెల్లకంటి సత్యం, సీనియర్ నాయకులు అజీజ్ పాషా, కే నారాయణతో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, కార్యవర్గ సభ్యులు వేదికపై ఆసీనులయ్యారు. సభలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
