అమిత్ షాకు మరింత చెడు వార్త ఎదురైంది. ఈసారి ఆయన సొంత కాషాయ వర్గం నుంచే. అందరికంటే ముఖ్యంగా, జంతర్ మంతర్ వద్ద ‘జెన్-జెడ్’ (యువత)పై అమిత్ షా భద్రతా బలగాలు ప్రయోగించిన శైలి, వైఖరి, వ్యూహాల నుంచి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్ బహిరంగంగా తప్పు పట్టారు.
పార్లమెంటు ఉభయ సభలు సమావేశమైన అర గంటలోనే విపక్షాల నిరసనల నడుమ శుక్రవారం ఉదయం వాయిదా పడ్డాయి. జులై 20న జంతర్ మంతర్ వద్ద ఢిల్లీ పోలీసులు జరిపిన క్రూరమైన దాడిపై వివరణ ఇవ్వాలని విపక్షాలు డిమాండ్ చేసినప్పటికీ, వర్షాకాల సమావేశాలకు గత వారం రోజులు గా అమిత్ షా సభకు రాకుండానే ముగిసిపోయాయి.
విపక్షాలకు ఒక్క అంగుళం కూడా అవకాశం ఇవ్వ కూడదనేది ఒక రాజకీయ నిర్ణయమా? ధర్మేంద్ర ప్రధాన్ ఉదాహరణను చూసి ప్రతిపక్షం మరింత రెచ్చి పోతుందేమోనన్న భయంతో అధికార పక్షం మొండిగా వ్యవహరిస్తుంటే అది అర్థం చేసుకోదగినదే. లేదా దేశంలో మారుతున్న ప్రజల మూడ్‌ను పసిగట్టి కేంద్ర హోంమంత్రి భయపడుతున్నారా? లేక ఒక బలమైన రాజకీయ నాయకుడి పతనాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తున్నామా? అనేది ఎవరి ఊహకు వారికే వదిలేయాలి.
పార్లమెంటరీ పోరాటానికి దూరంగా ఉండటం అమిత్ షా నైజం, ఆయన సంపాదించుకున్న పేరు ప్రతిష్ఠలకు పూర్తి విరుద్ధం. సుదీర్ఘకాల పరిశీలకుల ప్రకారం, నరేంద్ర మోదీలా కాకుండా, రాజకీయ పిరికితనం అంటే ఏంటో తెలియని వ్యక్తి అమిత్ షా. “మీ అందరికంటే నాకే ఎక్కువ తెలుసు” అనే అహంకారం ఆయన ఎడమ చేతి పై కనిపిస్తే, గ్రామీణ/పట్టణ ప్రాంత మనస్తత్వం ఇచ్చే ఆత్మవిశ్వాసం ఆయన కుడి చేతి పై కనిపిస్తుంది. తన అభిమానులు తనను ‘చాణక్యుడు’ అని పిలవడంలో తప్పులేదని ఆయన భావిస్తారు. పార్లమెంటులో తమను ఎదుర్కోలేక పారి పోతున్నారనే విపక్షాల ఆరోపణలపై ఆయన స్పందించకపోవడం ఆయన అసలు నైజానికే తగదు.
సభకు అమిత్ షా వ్యూహాత్మకంగా గైర్హాజరు కావడం వెనుక ఉన్న కారణాన్ని అధికార యంత్రాంగమంతా అంచనా వేయలేక పోతోంది. 2019లో కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి, శత్రువులపై శక్తిని, బలాత్కారాన్ని ఉపయోగించడంలో ‘ఫ్రంట్-ఫుట్’ వైఖరితో సీనియర్ ఐపీఎస్ అధికారులు, మన ‘శాంతిభద్రతలు’, ‘జాతీయ భద్రత’ పర్యవేక్షకులను ఆయన విశేషంగా ప్రభావితం చేశారు. నార్త్ బ్లాక్ (హోం శాఖ కార్యాలయం) లో వీరేందర్ సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీ కోసం బ్యాటింగ్ చేయడానికి వచ్చినట్లుగా ఉంది. అవతలి చివర ఉన్న బౌలర్ అంటే గౌరవం కానీ, భయం కానీ లేదు. ఎవరూ ఊహించక ముందే, అధికార పీఠంలో షా ‘నెం. 2’గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ లాంటి సీనియర్ సహచరులను రాజకీయ నిస్సహాయతలోకి నెట్టి వేశారు.
ఆయనతో మాట్లాడిన ప్రతి ఒక్కరూ – బ్యూరోక్రాట్లు, నిఘా వర్గాలు, డిజిపి లు, పోలీస్ కమిషనర్లు, పొలిటికల్ ఎడిటర్లు తదితరులు, సమస్య ఏదైనా, సందర్భం ఏదైనా ఆయనకున్న స్పష్టత, నిర్దాక్షిణ్యమైన ముక్కు సూటి తనం, దూకుడు ప్రదర్శించడానికే ప్రాధాన్యత ఇచ్చే వైఖరిని చూసి ఆశ్చర్యపోయారు, ప్రశంసించారు. మొదటి ఆప్షన్‌గానే లారీ (లాఠీ) వాడండి. ఆయన తనను తాను దేశానికి ‘ఠాణేదార్’ (ఎస్.హెచ్.ఓ)గా మలుచుకున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఎస్.హెచ్.ఓ కి కొత్త అధికార శక్తిని ఇచ్చారు. ఒక పోలీస్ రాజ్యంలో బ్యాక్ ఫుట్‌లో బ్యాటింగ్ చేయరు.
జులై 20న ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరు, స్పందించిన విధానం అంతా కూడా పొలిటికల్ లీడర్షిప్ నుండి వారి కఠినమైన వైఖరికి లభించిన నమ్మకం, మద్దతు వల్లే సాధ్యమైంది. అనుభవజ్ఞులైన ‘శాంతిభద్రతల’ నిపుణులు ఎటువంటి సంకోచం లేకుండా ఒక ముగింపు నకు వచ్చారు. ఢిల్లీ పోలీసులు నిర్భయంగా వ్యవహరించారు. ఈ ‘బొద్దింకలకు’ తగిన బుద్ధి చెప్పాలని రాజకీయ నాయకత్వం కోరుకుందని బహుశా పోలీస్ ఉన్నతాధికారులు భావించి ఉంటారు. రాతి నేలపై రక్తం చిందించనివ్వండి.
రాజకీయ పెద్దల నుండి ఈ విధమైన పూర్తి స్వేచ్ఛ లభించడం వల్ల, ఢిల్లీ పోలీస్ నాయకత్వం తమ బలగాలను సరిగ్గా మోహరించడంలో విఫలమైంది. సమూహాలను నియంత్రించడానికి ఉన్న ప్రామాణికమైన, నిరూపితమైన పద్ధతులను పక్కనబెట్టింది. ఈ లోపాలు, తప్పులన్నింటికీ చివరికి బాధ్యత వహించాల్సింది హోంమంత్రే. బాధ్యత వహించాలనే సూత్రాన్ని ధర్మేంద్ర ప్రధాన్ విషయంలో ఇప్పటికే అంగీకరించడం జరిగింది.
జంతర్ మంతర్ వద్ద జరిగిన ఈ దారుణ దృశ్యాన్ని నిశితంగా గమనించినవారు ఒక విషయాన్ని గుర్తించారు. అమిత్ షా ఎంచుకున్న సాధనాల వల్ల అత్యంత దారుణమైన పరిస్థితి తలెత్తి నప్పటికీ, ప్రజల ఆగ్రహం, నిరసన అంతా ప్రధాని నరేంద్ర మోదీ వైపే మళ్లింది. కొత్త తరం భారతీయులతో ఎలా సంభాషించాలి వంటి కొన్ని కొత్త విద్యలను నేర్చుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ప్రధానమంత్రికి ఏర్పడింది. కానీ హోంమంత్రి మాత్రం అజిత్ దోవల్ కు తిలక్ అవార్డు ఇచ్చి సత్కరించడంలో బిజీగా ఉన్నారు.
జంతర్ మంతర్ వద్ద ‘జెన్-జెడ్’ (యువత)పై అమిత్ షా భద్రతా బలగాలు ప్రయోగించిన శైలి, వ్యూహాల పై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అధినేత మోహన్ భగవత్ బహిరంగంగా తప్పు పట్టారు. నాగపూర్ వర్గానికి అలవాటైన పాతకాలపు చాతుర్యం అని అనుకున్నా, లేదా మోదీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ మాతృక ఓటు బ్యాంకును తీవ్రంగా ఆగ్రహానికి గురిచేసిందని గ్రహించడం అని అనుకున్నా, భగవత్ చేసిన వ్యాఖ్యలు బీజేపీలోని షా వ్యతిరేకులకు ఉత్సాహాన్ని ఇచ్చాయి. జంతర్ మంతర్ వద్ద గుమి గూడిన, దూషించిన వారిలో అత్యధికులు హిందువులే. బీజేపీ నాయకులు, ప్రసిద్ధ కార్యకర్తలతో వ్యవహరించేటప్పుడు ‘నెం. 2’ చూపిస్తున్న అతిపెద్ద అహంకారంపై ఇప్పటికే తీవ్ర అసంతృప్తి ఉంది.
జంతర్ మంతర్ వివాదాన్ని నిర్వహించిన తీరు విషయంలో భగవత్, ఆయన తీవ్ర విమర్శకుడు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇద్దరూ ఒకే బాటలో పయనిస్తున్నట్లు కనిపించడం అమిత్ షాకు ఎంతమాత్రం ఊరట నిచ్చే అంశం కాదు. ఆ ఇద్దరి లక్ష్యం లోనూ అమిత్ షా ఉన్నట్లు కనిపిస్తోంది. భగవత్, లోక్‌సభ ప్రతిపక్ష నేత ఇద్దరినీ సంతృప్తి పరచడానికి ఒక ‘మేకపిల్ల’ను బలి ఇవ్వాల్సిన అవసరం ఉందని ప్రధాని గ్రహించే రోజు వస్తుందా?
హోంమంత్రి తన పదవిని నిలబెట్టు కోగలిగి నప్పటికీ, ఆయన రాజకీయంగా బలహీనపడ్డారు. ‘సర్దార్ పటేల్ III’గా ఆయన కున్న పేరుప్రతిష్ఠలు ముక్కలై పోయాయి. సభకు ఒక వారం రోజులు గైర్హాజరు కావడం అనేది పట్టుదలతో ఉన్న విపక్షాన్ని ఎదుర్కొనే సత్తా లేకపోవడంగా మారింది. అతి ఆత్మవిశ్వాసం, అతి తెలివి తేటలు, అతి మేధస్సు, అతి కఠినత్వం లతో జాగ్రత్తగా నిర్మించుకున్న ఒక వ్యక్తిత్వం కరికి పోవడం ప్రారంభమైంది. ఒకప్పుడు ఆయనను చూసి భయపడినవారు ఇప్పుడు ఆయన అసలు రూపాన్ని చూసేశారు. ఆ ప్రభావం పోయింది.
నెల రోజుల క్రితం, అమిత్ షా ఉప ప్రధానిగా ఎదుగుతారని ఆయన మద్దతు దారులు గుసగుసలాడారు. ఆ అలలు ఇప్పుడు వెనక్కి తగ్గాయి. ప్రధానికి ఆయన అత్యంత అవసరం అనే నమ్మకం ఇకపై బలంగా లేనట్లే కనిపిస్తోంది. ఇప్పుడు, దానికి భిన్నంగా, ఒక రాజకీయ పతనం ముంగిట ఉన్నట్లు కనిపిస్తోంది.
రచయిత: హరీష్ ఖారే, ది వైర్ ఇంగ్లీష్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
