బెంగళూరు: అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) నూతన జాతీయ అధ్యక్షుడిగా ఎంపీ కె సుబ్బరాయన్, ప్రధాన కార్యదర్శిగా అమర్జీత్ కౌర్ ఎన్నికయ్యారు.
బెంగళూరులో ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు జరిగిన ఏఐటీయూసీ 43వ జాతీయ మహాసభల చివరి రోజు గురువారం మహాసభ నూతన ఆఫీస్ బేరర్లను ఎన్నుకుంది.
నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన కె సుబ్బరాయన్ తమిళనాడులోని తిరుప్పూర్ నియోజకవర్గం నుంచి సీపీఐ అభ్యర్థిగా లోక్సభకు ఎన్నికయ్యారు.
తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ కార్యదర్శులు
ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అమర్జీత్ కౌర్ తిరిగి ఎన్నికయ్యారు. వీరితో పాటు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయ కార్యదర్శులుగా ఎండీ యూసుఫ్ (తెలంగాణ), ఆర్ రవీంద్రనాథ్ (ఆంధ్రప్రదేశ్) ఎన్నికయ్యారు.
ఈ నెల 22వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు జరిగిన ఈ మహాసభలో దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రతినిధులు పాల్గొనగా, వారితో పాటు దాదాపు 16 దేశాల నుంచి సుమారు 44 మంది సౌహార్ద ప్రతినిధులుగా మహాసభలో పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేశారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
