తానే వివిధ తయారీల కలయికకు హస్తకళల, తయారీల కలయిక దారితీస్తుంది. ఆదిమ తరహా ‘ఊర్ధ్వముఖ అనుసంధానం’గా ఉద్భవిస్తుంది. ఒక పెద్ద తయారీదారుడు అవసరమైన కొన్ని సాధనాలను తన స్వంత కర్మాగారంలో తయారు చేయడం ప్రారంభిస్తాడు. గ్లాసును కరిగించడానికి(గ్లాస్ బ్లోవింగ్) అవసరమైన కరిగించే మట్టి పాత్రలను ఇంగ్లీషు గాజు తయారీదారులు తయారు చేయడాన్ని మార్క్స్ ఉదాహరించాడు. మళ్ళీ ఇక్కడ కూడా తయారీ పరిమితమైన హస్తకళ ప్రాతిపదికకే అభివృద్ధి పరిమితమయ్యింది.
సామాజిక శ్రమ విభజన..
శ్రామికుని ఉత్పాదకత, ఆ విధంగా సాపేక్ష అదనపు విలువ ఉత్పత్తిపై తయారీ ప్రభావాన్ని సమీక్షించడానికి, చేతివృత్తుల వారిని చాలా సమర్ధవంతులైన సంపూర్ణ కార్మికునిగా మార్చిన, పనిముట్లలో కొంత మెరుగుదల తెచ్చిన శ్రమ విభజన ద్వారా తయారీ అధిక ఉత్పాదకతకు దారితీసిందని మనం గమనించాలి. ఈ విషయంలో దాని పరిమితులను మనం తరువాత విశ్లేషిస్తాము. ఇప్పుడు మనం తయారీలో శ్రమ విభజనకూ, సమాజంలో శ్రమ విభజనకూ మధ్య ఉన్న సంబంధాన్ని పరిశీలించడం వైపు మళ్ళుతాము.
తయారీలో శ్రమ విభజనకు లాగానే సమాజంలో కూడా దానికి రెండు విధాల మూలం ఉంది. ఒక వైపున తెగ లోపల వయస్సు, లింగ; అటువంటి వాటి ద్వారా ఉన్న సహజమైన లేదా మానసికమైన విభజన ఒక క్రమ పద్దతిలో సామాజిక శ్రమ విభజన అభివృద్ధి చెందుతుంది. మరొకవైపున సమూహాల మధ్య ఉత్పత్తి మార్పిడి సంబంధాలు క్రమంగా అభివృద్ధి చెందడం ఆధారంగా సామాజిక శ్రమ విభజన తలెత్తవచ్చు.
సమాజంలోని శ్రమ విభజనా, తయారీ పని స్థలంలో(వర్క్ షాప్) శ్రమ విభజనా రెండూ కొంత మేరకు ఉత్పత్తి శక్తుల అభివృద్ధిని ముందుగా ప్రతిపాదిస్తాయి. తయారీ కాలంలో వర్క్ షాప్ లోపల శ్రమ విభజన అభివృద్ధి కాగా వలస వ్యవస్థ, ప్రపంచ మార్కెట్ అభివృద్ధి(ఈ రెండూ తయారీ అభివృద్ధిని పెంచుతాయి) సమాజంలో శ్రమ విభజన అభివృద్ధిని వేగవంతం చేస్తాయనే ఆసక్తికరమైన చారిత్రక అంశాన్ని మార్క్స్ పేర్కొన్నాడు.
ఏమైనప్పటికీ అక్కడ రెంటి మధ్యా ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. మొదటగా ఉదాహరణకు చర్మకారుడి, షూ తయారీదారుడి ఉత్పత్తులు సరుకులనే వాస్తవం సమాజంలో శ్రమ విభజనకు ఆధారం. ప్రత్యేకించి, తయారీలో శ్రమ విభజన ‘సంపూర్ణ కార్మికుడు సరుకులను ఉత్పత్తి చేయని’ వాస్తవం నుంచి పుడుతుంది.
ఇంకా, ఉత్పత్తి వివిధ శాఖల ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాల ద్వారా శ్రమ సామాజిక విభజన సాధ్యమైంది. అయితే, తయారీలో అనేక మంది కార్మికులు తమ శ్రమ శక్తిని ఒకే పెట్టుబదిదారుడికి అమ్మడంతో జరుగుతుంది.
మొదటిది ఉత్పత్తి సాధనాలను వివిధ సరుకుల ఉత్పత్తిదారులకు పంపిణీ చేయడం లేదా విరజిమ్మడాన్ని ముందుగా ప్రతిపాదిస్తుందగా, వ్యక్తిగత పెట్టుబదిదారుడి చేతిలో ఉత్పత్తి సాధనాల కేంద్రీకరణ రెండవ దానిలో అవసరం. మూడవది వర్క్ షాప్‌లోని శ్రమ విభజనలో ఉన్న (ఊహా) కల్పిత ప్రణాళికకూ ఉత్పత్తి వివిధ శాఖలలోకి శ్రమ పంపిణీలో ఉన్న అరాచకత్వానికీ మధ్య వైరుధ్యం ఉంది.
మార్క్స్ చెప్పినదాని ప్రకారం, ‘ఒక ఊహా కల్పిత వ్యవస్థ ఆధారంగా వర్క్ షాప్ లోపల క్రమం తప్పకుండా నిర్వహించబడుతున్న శ్రమ విభజన సమాజంలోని శ్రమ విభజనలో ఉత్పత్తి దారుని చట్టవిరుద్ధమైన చపలచిత్తాన్ని, మార్కెట్ ధరలలోని బరోమెట్రిక్ హెచ్చుతగ్గులను నియంత్రించే, ప్రకృతి విధించిన అవసరం.’
ఈ అంశానికి సంబంధించి, బూర్జువా భావజాల పరస్పర విరుద్ధమైన, అసంబద్ధమైన పాత్ర ఇలా ఉత్తమంగా బయటకు తీసుకురాబడింది: వర్క్ షాప్‌లో శ్రమ విభజనను, పాక్షిక కార్యానికి కార్మికుడిని జీవితాంతం అనుసంధానం చేయడాన్ని, మూలధనానికి అతన్ని పూర్తిగా లొంగి ఉండేటట్లు చేయడాన్ని, దాని ఉత్పాదకతను పెంచే కార్మిక సంస్థను పొగిడే అదే బూర్జువా మనస్తత్వం, ఉత్పత్తి ప్రక్రియను సామాజికంగా నియంత్రించడానికి చేసే ప్రతి చైతన్యయుత ప్రయత్నాన్ని, ఆస్తి హక్కులు, స్వేచ్ఛ, వ్యక్తిగత పెట్టుబదిదారుడి అనియంత్రిత లొంగతీత వంటి పవిత్రమైన విషయాలలోకి చొరబాటుగా అదే తీవ్రతతో ఖండిస్తుంది.
అనేక సామాజిక నిర్మాణాల చారిత్రక అధ్యయనం నుంచి వెలువడే విషయం, వీటిలో చాలా వాటిలో శ్రమ విభజన సాధారణ విషయం కాగా; తయారీకే అసాధారణమైన(విశేషమైన) వర్క్ షాపులోని శ్రమ విభజన పెట్టుబడిదారీ ఉత్పత్తి విధాన నిర్దిష్ట ఉత్పత్తి.
శ్రమ విభజనను అభివృద్ధి చేసి, హస్తకళ- ఆధారిత శ్రమ ప్రక్రియను అనేక సవివరమైన కార్యకలాపాలుగా విభజించి, పెట్టుబడిదారీ పూర్వ హస్తకళా పొరను తయారీ నాశనం చేస్తుంది. ఏకపక్ష, వారి మొత్తం అభివృద్ధిలో లోపంతో, సమిష్టి కార్మికుడిగా కూడా ఈ చేతివృత్తుల వాడు పరిపూర్ణ కార్మికుడిగా, అంటే వర్క్ షాప్‌లోని కార్మికులందరినీ కలిపి తీసుకున్నామరింత సమర్ధవంతంగా, మరింత ఉత్పాదకంగా మారుతారు. తయారీ, దాని పరిణామ సమయంలో సాధారణ– సంక్లిష్ట శ్రమల కోసం దాని అవసరాలతో వివిధ స్థాయిలలో విద్య, శిక్షణ ఉన్న కార్మికుల అవసరాన్ని సృష్టిస్తుంది.
మార్క్స్ చెప్పినట్లు: ‘వేతనాల స్థాయికి తగినట్లు శ్రమ శక్తుల అధికార వర్గ శ్రేణిని తయారీ అభివృద్ధి చేస్తుంది.’
దాదాపు అన్ని తయారీ ప్రక్రియలకు సాధారణమైన, ఏ శిక్షణా అవసరం లేని కొన్ని సాధారణ కార్యకలాపాలు కూడా తయారీలో ఉంటాయి. (చేతి వృత్తుల) హస్తకళా పరిశ్రమలో లేని పెట్టుబడిదారీ తయారీ ప్రత్యేక సృష్టి అయిన, ఎటువంటి చదువు చదవని, నైపుణ్యంలేని కార్మికుల వర్గం ఒకటి అభివృద్ధి చెందడానికి ఇది దారితీస్తుంది.
తయారీ వర్గ లక్షణం..
ఈ రెండు పరిణామాల రాజకీయ, సైద్ధాంతిక చిక్కుముడులు(అంతరార్ధాలు)– కార్మిక శక్తుల అధికార శ్రేణి, నైపుణ్యవంతులైన కార్మికులకూ నైపుణ్యం లేని కార్మికులకూ మధ్య ఉన్న పదునైన విభజన– రెండూ నిజానికి చాలా ముఖ్యమైనవి, కార్మికోద్యమంలోని అవకాశవాద, సంస్కరణవాద పోకడల మూలాలను అర్ధం చేసుకోవడానికి ఎవరికైనా సహాయపడతాయి.
నైపుణ్యంలేని కార్మికవర్గం వృద్ధి చెందడం– కార్మిక శక్తి పునరుత్పత్తికి అయ్యే ఖర్చును(శిక్షణ కాల ఖర్చులను పొడుపు చేయడం ద్వారా) తగ్గించడం ద్వారా సాపేక్ష అదనపు విలువకు అదనంగా నేరుగా దోహదం చేస్తుంది.
పెద్ద ఎత్తున ఉత్పత్తిని తయారీ సాధ్యం చేస్తుంది, అంతేకాకుండా అవసరమైనదిగా మార్చుతుంది. ఆ విధంగా పెట్టుబడిదారుడు (శ్రమ విభజన కారణంగా) కార్మికులను ఎక్కువ సంఖ్యలో పనిలో పెట్టుకోవడానికి, ముడి సరుకులనూ సహాయక పదార్ధాలను(ఇప్పుడు కార్మికుల అధిక ఉత్పాదకత కారణంగా ఒక నిర్దిష్ట కాలంలో పెద్దమొత్తంలో వీటి వినియోగం అవుతుంది) కొనడానికీ రెండింటికీ కలిపి పెద్ద మొత్తంలో డబ్బులను వెచ్చించడం అవసరమవుతుంది.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 23వ భాగం, 22వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
