అమెరికా ఒత్తిడి వల్లే ఇరాన్, వెనిజులా దేశాల నుంచి చమురు దిగుమతులను భారత్ నిలిపివేసిందని మాజీ విదేశాంగ కార్యదర్శి అంగీకరించారు.
అక్టోబరు ప్రారంభంలో ‘ఆసియా భౌగోళిక రాజకీయ భవిష్యత్తు’ అనే అంశంపై జరిగిన చర్చలో ప్రస్తుత బీజేపీ రాజ్యసభ సభ్యులు, మాజీ విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా మాట్లాడుతూ.. అమెరికా డిమాండ్లకు తలొగ్గి ఇరాన్, వెనిజులా దేశాల నుంచి చమురు కొనుగోలును భారత్ నిలిపివేసిందని తెలిపారు.
దీనిపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఆ తరువాత తనను తాను సమర్థించుకున్నారు. అయినప్పటికీ, తాను చేసిన వ్యాఖ్యలను మాత్రం ఎక్కడా ఖండించలేదు.
భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు రామ్ మాధవ్ అమెరికా పర్యటనలో మాట్లాడుతూ వాషింగ్టన్ ఒత్తిడి వల్లే ఇరాన్, వెనిజులా నుంచి ముడి చమురు దిగుమతులను భారత్ నిలిపివేసిందని తెలిపారు. అయితే దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆయన తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పి వాటిని వెనక్కి తీసుకున్నారు.
“వాషింగ్టన్లో జరిగిన హడ్సన్ ఇన్స్టిట్యూట్ కాన్ఫరెన్స్‌లో భారతదేశంపై అమెరికా ఆంక్షల కారణంగా రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు తగ్గించుకున్నదని నేను చెప్పిన విషయానికి క్షమాపణ చెప్తున్నాను” అని రామ్ మాధవ్ ఎక్స్ వేదికగా చెప్పారు.
“నేను ఇంతకుముందు మాట్లాడింది తప్పు. భారతదేశం అమెరికా ఆంక్షలకు తలొగ్గి రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించుకోలేదు. ప్యానెల్‌లోని ఇతర సభ్యులు మాట్లాడిన దానికి నేను సమాధానం మాత్రమే ఇచ్చాను. వాస్తవంగా అది తప్పు. నేను క్షమాపణ కోరుతున్నాను” అని ఆయన ఎక్స్‌లో రాశారు.
రాజ్యసభ సభ్యుడు, అమెరికాలో మాజీ భారత రాయబారి హర్షవర్ధన్ శ్రింగ్లా కూడా ఇటీవల జరిగిన ఒక బహిరంగ కార్యక్రమంలో సరిగ్గా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.
శ్రింగ్లా ఏమన్నారు?
అక్టోబరు 6న ‘ఆసియా సొసైటీ పాలసీ ఇన్స్టిట్యూట్'(ఏఎస్పీఐ) నిర్వహించిన చర్చాగోష్టిలో శ్రింగ్లా మాట్లాడుతూ.. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ హయాంలో భారతదేశాన్ని సందర్శించిన ఒక అమెరికన్ డిప్లొమాట్‌తో తాను మాట్లాడిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
అమెరికా ఒత్తిడి మేరకే ఇరాన్, వెనిజులా దేశాల నుంచి చమురు దిగుమతులు ఆపేయాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.
శ్రింగ్లా వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అక్టోబరు 28న ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.
తాను దేశ ఇంధన భద్రత కోసమే మాట్లాడానని, కాంగ్రెస్ పార్టీ దీనిపై తప్పుడు కథనాలు సృష్టిస్తోందని ఆరోపించారు. తన మాటలను సందర్భం లేకుండా వక్రీకరించారని శ్రింగ్లా అన్నారే తప్ప, తాను ఆ మాటలు అనలేదని ఖండించలేదు.
కాంగ్రెస్ విమర్శలు
అమెరికా ఒత్తిడి వల్ల భారత్ మొదట ఇరాన్, ఆ తర్వాత వెనిజులా, ఇప్పుడు రష్యా నుంచి చమురు కొనుగోలు చేయకుండా వెనక్కి తగ్గిందని శ్రింగ్లా చెప్పిన మాటలను కాంగ్రెస్ పార్టీ తప్పుబట్టింది.
“నరేంద్ర మోదీ ఎప్పుడూ అమెరికా ముందు మోకరిల్లుతూనే ఉన్నారు” అని కాంగ్రెస్ ప్రతినిధి సుప్రియా శ్రీనాతే విమర్శించారు.
గతంలోనూ అమెరికా ఒత్తిడి
త్వరలో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించాయి.
విద్యార్థులను నిర్బంధించడంలో మాత్రం చాలా కఠినంగా వ్యవహరించిన ప్రభుత్వం అమెరికా విషయంలో లొంగిపోయిందని దుయ్యబట్టాయి.
ఆస్ట్రేలియా మాజీ ప్రధాని కెవిన్ రడ్తో జరిగిన చర్చలో శ్రింగ్లా మాట్లాడుతూ తాను వాషింగ్టన్లో ఉన్నప్పుడు ‘ఇరాన్ ఆంక్షల’ నుంచి మినహాయింపు పొందడం గురించి అమెరికాతో చర్చలు జరిపినట్లు చెప్పారు.
ఇరాన్ ముడి చమురును భారతదేశంలో శుద్ధి చేయడానికి భారతదేశ రిఫైనరీలు చాలా అనువుగా ఉన్నాయని, అందువల్ల భారత్‌కు ఇరాన్ చమురు చాలా అవసరం అన్నారు. కాబట్టి కొన్ని దేశాలకు అమెరికా ఆంక్షల నుంచి మినహాయింపు ఉండేది. కానీ అకస్మాత్తుగా ఆ మినహాయింపులను అమెరికా రద్దు చేసింది.
రష్యా చమురు కొనుగోళ్లపై ప్రభావం
తాను విదేశాంగ కార్యదర్శిగా ఉన్న కాలంలో బైడెన్ హయాంలో ఢిల్లీకి వచ్చిన అమెరికా ప్రతినిధితో మాట్లాడిన విషయాన్ని శ్రింగ్లా గుర్తుచేస్తూ.. “మేము వాషింగ్టన్లో ఉన్నప్పుడు రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును తగ్గించాలని ఆయన చెప్పారు. మీ ఒత్తిడి మేరకే ఇరాన్ చమురును వదులుకున్నాము. ఆ సమయంలో చాలా కష్టపడి ఇరాన్ చమురు దిగుమతులు నిలిపివేశాము. నేడు మేము ఇరాన్ నుంచి అసలు చమురు కొనడం లేదు అని అమెరికన్ ప్రతినిధితో చెప్పినట్లు తెలిపారు. అదేవిధంగా, వెనిజులాలో మేము 6 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాము. ఇప్పుడు వెనిజులా నుంచి కూడా చమురు కొనొద్దంటే ఎలా? ఇప్పుడేమో రష్యా నుంచి చమురు కొనవద్దని చెప్తున్నారు. మాకు ఇప్పుడు 150 బిలియన్ బ్యారెల్స్ ఇంధనం అవసరం” అని చెప్తుండగా- ఆస్ట్రేలియన్ మాజీ ప్రధాని కెవిన్ రడ్ జోక్యం చేసుకొని “అది టెక్సాస్ ఆయిల్ కదా” అన్నారు.
“మీరు టెక్సాస్ ఆయిల్ గురించి ఆలోచిస్తున్నారా? అట్లయితే అది చాలా సురక్షితమైనది” అని రడ్ చెప్పారు. దీనికి మాజీ విదేశాంగ కార్యదర్శి శ్రింగ్లా స్పందిస్తూ “అవును, మీరు చెప్పింది సరైనదే. మేము అమెరికా నుంచి చమురు దిగుమతులను పెంచాం, అందులో ఎలాంటి సందేహం లేదు. అలాగే మా దిగుమతులను వివిధ రకాలుగా మార్చుకున్నాం. నైజీరియా, వెనిజులా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, గయానా లాంటి దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటున్నాం” అని శ్రింగ్లా చెప్పారు.
“మేము అమెరికా నుంచి దిగుమతులు పెంచుకోవడం వల్ల అమెరికాతో ఉన్న వాణిజ్య లోటు తగ్గింది. కానీ మా ఆందోళన అంతా 2023, 2024, 2025 సంవత్సరాలతో పాటు 2026లో కొన్ని నెలలు మా అవసరాల్లో దాదాపు 50 శాతం రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాం” అని శ్రింగ్లా చెప్పారు.
అమెరికాతో వ్యవహరించడం చాలా క్లిష్టమైన విషయం, అది కేవలం భారతదేశానికే కాదు, ఇతర దేశాలకు కూడా అదే పరిస్థితి ఉందని ఆస్ట్రేలియా మాజీ ప్రధాని రడ్ చెప్పారు.
“రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు ఇటీవల నెలల్లో బాగా తగ్గాయి. జులై-సెప్టెంబరు నెలల్లో అది 29 శాతం తగ్గింది. అంటే రోజుకు 2.57 మిలియన్ బ్యారెల్స్ నుంచి 1.82 మిలియన్ బ్యారెల్స్‌కు పడిపోయింది” అని శ్రింగ్లా చెప్పారు.
ప్రపంచ ఇంధన భద్రత ఆందోళనలు
ప్రస్తుతం ప్రపంచ దేశాలు రష్యా చమురు కొనుగోలు ఆపేయాలని చూస్తే, అది గ్లోబల్ ఎనర్జీ మార్కెట్‌ను తీవ్రంగా దెబ్బతీస్తుందని శ్రింగ్లా అభిప్రాయపడ్డారు.
భారత్ రోజువారీగా 2 మిలియన్ బ్యారెళ్ల కన్నా ఎక్కువ రష్యా చమురును కొనుగోలు చేస్తోందని, ఒకవేళ భారత్ కొనుగోలు ఆపేస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్నంటుతాయని, భారత్‌లో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అమెరికాతో వాణిజ్య సంబంధాలు
ట్రంప్ పరిపాలనలో రష్యా, ఇరాన్‌ల నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై 100% వరకు భారీ సుంకాలు విధించే చట్టాన్ని అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది.
“ఈ సుంకాలు అతిపెద్ద సమస్య” అని శ్రింగ్లా చెప్పారు. ఇది అన్ని వైపుల నుంచి కత్తులు దూసినట్టుగా ఉందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయినప్పటికీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి ‘రష్యన్ ఆంక్షల చట్టం’ నుంచి తాత్కాలిక మినహాయింపు ఇచ్చారు.
గ్రహం చట్టంలోని సెక్షన్ 115 ఏ ప్రకారం, భారతదేశం రష్యా ఇంధనం కొనుగోలుపై ఆంక్షలు తొలగిస్తున్నట్లు అధ్యక్షుడు డిక్రీ జారీ చేశారు.
అమెరికా ఒకవైపున టర్కీ, అజర్బైజాన్, హంగేరీ, స్లోవాక్ రిపబ్లిక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, కజకిస్తాన్, కిర్గిజ్స్థాన్లపై 100% సుంకాలు విధిస్తున్నా భారతదేశానికి మినహాయింపు ఇవ్వడం ఇదే మొదటిసారి. అయినప్పటికీ, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మాత్రం రష్యన్ చమురు దిగుమతులకు బదులుగా తేలికపాటి టెక్సాస్ ముడి చమురు లేదా భారమైన వెనిజులా చమురును కొనుగోలు చేయాలని భారత్‌పై ఒత్తిడి తెస్తున్నారు.
పూర్తి చర్చకు సంబంధించిన వీడియోను ‘ఆసియా సొసైటీ పాలసీ ఇన్స్టిట్యూట్’ తమ వెబ్సైట్లో ఉంచింది. కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాత్రం రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను తగ్గించాలని అమెరికా నుంచి ఎలాంటి ఒత్తిడి లేదని, తనకు ఎప్పుడూ అలాంటి ఒత్తిడి అనిపించలేదని ఒక బహిరంగ వేదికపై పేర్కొన్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
