గాజు గోడకు అవతల చూస్తే
ఓ తెలీని ప్రపంచం
ఓ అద్భుతమైన ప్రపంచం
ఓ జ్ఞాపకం గా మారిన ప్రపంచం
చదరంగపు గడుల లాంటి జీవితం
నీ అదృష్టమవైపు అడుగు పడుతుందా
నీ గమ్యమే నీ కర్మ అవుతుందా
కర్మే మూలం
ప్రపంచానికి, మారుతానికి
తల్లకిందులైన ప్రపంచం
అద్భుతం అరాచకం
ఉగ్రం ఉద్విగ్నం
నల్ల పిల్లి నిన్ను దారి తప్పిస్తుందా
అపరిచితుడే నీకు ఆరాధ్యుడవుతాడా
జీవితం సహజమే
గమ్మత్తు అంతా రోజుల్లోనే ఉంది
నీ జీవితం ఒక శ్రేణిలో బందీ అవుతోంది
ముఖ్యమైన తేదీలు ఎదురు చూస్తాయి
కోయిల తొందరపడి కూస్తుంది
కంటి ముందు చీకటి ఆవిష్కృతం అవుతుంది
గంటలు మోగుతాయి
మన నీడలే
మన వెలుగులే
ఆ గాజు గోడకు ఆవల
లూయిస్ కారోల్ కవిత Through The Looking Glass కు స్వేచ్ఛానువాదం
కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
