Reading Time: 2 minutes
భారతదేశం ఆర్థికంగా బలహీనపడటం ప్రత్యేకించి పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడటం వలన తలెత్తే సామాజిక పరిణామాల గురించి రచయిత సరిగ్గానే గుర్తించారు. ‘‘భారతదేశం నిరుద్యోగం, శాశ్వత ఉద్యోగాలు లేకపోవటం వంటి సమస్యలు ఎదుర్కొంటోంది.(పే. 277) అంటూ వేగంగా పెరుగుతున్న జనాభా తగినన్ని విద్యాబుద్ధులు నేర్చుకోలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తారు:
(ఆరెస్సెస్ ముఖ్య నాయకుల్లో ఒకరైన రామ్ మాధవ్ రాసిన కొత్త పుస్తకం “ది న్యూవరల్డ్”ను విశ్లేషిస్తూ ప్రముఖ చరిత్రకారులుక్రిస్టోఫ్ జాఫ్రెలాట్ రాసిన సుదీర్ఘ వ్యాసాన్ని మూడు భాగాలుగా ఇస్తున్నాము. మొదటి రెండు భాగాలు ఇక్కడ చూడవచ్చు).
ఇక్కడున్న ప్రధాన సమస్యల్లా శీర్షికే :
‘‘భారతదేశంలో విద్యారంగ సదుపాయాలు ప్రత్యేకించి మేధో పరిశోధన, ఆవిష్కరణల కోణంలో నిరాశాజనకంగా ఉన్నాయి. ఏటా దేశంలో పదిహేను లక్షల మంది ఇంజనీర్లు తయారవుతున్నారు. అయితే మనకు కావల్సింది కేవలం ఇంజనీర్లే కాదు. వినూత్న ఆవిష్కరణలు చేయగలిగిన ఇంజనీర్లు.’’ (పే. 271- 272)
‘‘అనుకరణ ఆవిష్కరణ కాదు. కాపీ కొట్టడం సృజనాత్మకత కాదు’’ అంటూ రామ్ మాధవ్ ముగిస్తారు.(పే. 275).
రక్షణ రంగానికి వస్తే భారత పారిశ్రామిక రంగం ఆశించనంత స్థాయిలో పని చేయటం లేదు. వైమానిక దళానికి కావల్సిన 40 తేజస్ యుద్ధ విమానాలు ఇంకా అందలేదు. ఈ తరహా యుద్ధ విమానాల తయారీ 1984లో ప్రారంభమైంది. చైనా సాధించిన విజయాలతో పదేపదే భారత్‌ను పోల్చి రామ్ మాధవ్ ఆందోళన చెందుతూ ఉంటారు. భారతీయ నావికాదళం కూడా కేవలం రెండే యుద్ధ విమాన వాహక నౌకలు, 16 జలాంతర్గాములతో వెనకపట్టు పట్టింది. అదనంగా మరో 200 యుద్ధనౌకలు, 24 జలాంతర్గాములు కావాలి. ‘‘భారతదేశం అంతర్జాతీయంగా కీలక పాత్ర పోషించాలంటే ఈ సామర్ధ్యాలు సమకూర్చుకోవటం అనివార్యం’’ అంటారు రామ్ మాధవ్.
భారతదేశం ఆర్థికంగా బలహీనపడటం ప్రత్యేకించి పారిశ్రామిక అభివృద్ధి కుంటుపడటం వలన తలెత్తే సామాజిక పరిణామాల గురించి రచయిత సరిగ్గానే గుర్తించారు. ‘‘భారతదేశం నిరుద్యోగం, శాశ్వత ఉద్యోగాలు లేకపోవటం వంటి సమస్యలు ఎదుర్కొంటోంది.(పే. 277) అంటూ వేగంగా పెరుగుతున్న జనాభా తగినన్ని విద్యాబుద్ధులు నేర్చుకోలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తారు:‘‘భారతదేశం ఎదుర్కొంటున్న సమస్య నైపుణ్యరాహిత్యం, నామమాత్రపు నైపుణ్యం కలిగిన కార్మికులు ఉండటం. అత్యాధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వికసిస్తున్న తరుణంలో తగినంత ఆధునిక నైపుణ్యాలు లేని జనాభా దేశాన్ని పతానవస్థకు నెడుతోంది.’’(పే. 277).
ఈ పరిస్థితుల్లో విశాల జనాభా శక్తి సామర్ధ్యాలు దేశాభివృద్ధిలో ఇముడ్చుకోవటం కోసం జరిగే ప్రయత్నాలు సుదీర్ఘ ప్రయాణాలే తప్ప తక్షణ ఫలితాలు కాదు.
ముగింపు: పెరుగుతున్న జనాభా సమస్యను భారతదేశం సున్నితంగా పరిష్కరించుకోవల్సిన అవసరం ఉంది.
ఈ పరిస్థితుల్లో ఓ ప్రశ్న తలెత్తక మానదు: మరి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ప్రభుత్వం ఏమి చేస్తోంది? ఇంత మహత్తర ప్రశ్నలకు సమాధానాలు వెతకే ప్రయత్నంలో రామ్ మాధవ్ తిరిగి మరో కాంగ్రెస్ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రినే ఉటంకించాల్సి వచ్చింది.
‘‘1964లో శాస్త్రి ఎర్రకోట నుండి ఇచ్చిన తొలి స్వాతంత్య్రదినోత్సవ ప్రసంగంలో చెప్పిన మాటలు దేశ అంతరాత్మను కుదిపి లేపాయి”:
‘‘అంతర్గతంగా మన దేశం బలోపేతమై, పేదరికాన్నీ, నిరుద్యోగాన్ని దేశం నుండి పారదోలినప్పుడే మన దేశం గౌరవం సంతరించుకోగలదు. వీటన్నిటినీ మించి దేశం ఐక్యంగా ఉండాలి. మతోన్మాద, ప్రాంతీయ, భాషోన్మాద ఉద్యమాలు దేశాన్ని బలహీనం చేస్తున్నాయి.’’ (పే. 317).
అంటే, ఈ వాక్యాల అర్థం ఏమిటి? మోడీ ప్రభుత్వం ఇప్పటి వరకూ అనుసరించిన మతోన్మాద రాజకీయాలను పునఃసమీక్షించాలని రామ్ మాధవ్ అభిప్రాయపడుతున్నారా?
స్థూలంగా చూసినప్పుడు ‘‘నవభారత నాయకత్వం దేశాన్ని అంతర్జాతీయ వేదికలపై ముఖ్యమైన పాత్రధారిగా తీర్చిదిద్దాలని చూస్తోంది’’(పే. 315). కానీ పదేళ్ల(నవభారత నాయకత్వం) పరిపాలన తర్వాత చూస్తే ఫలితాలు అంత ఆశాజనకంగా ఏమీ లేవు. ఈ విమర్శ చేస్తోంది ఎవరో కాదు. హిందూత్వ జాతీయవాద నాయకుల్లో కీలక స్థానంలో ఉన్న వ్యక్తి. ఇలాంది అనూహ్యం. (ప్రస్తుత ప్రభుత్వాన్ని నడిపిస్తున్న సంఘ్‌పరివార్‌లో) ఆయన బాధ్యతల రీత్యా చూస్తే దీన్ని ఆత్మ విమర్శ అని కూడా అనుకోవచ్చు.
ఈ మార్పు ఎంత దూరం వెళ్తుంది? ప్రభుత్వ విధి విధానాల్లో గుణాత్మకమైన మార్పును ఆశించవచ్చా? ఈ దిశగా కులగణన తొలి అడుగు కాబోతోందా? లేక కులగణన కేవలం వ్యూహాత్మక చర్య మాత్రమేనా? కాలం మాత్రమే సమాధానం చెప్పగలదు. కానీ మోడీ భారతంలో ‘‘ఎంతగా మార్పులు జరుగుతాయో, అంతగా నిస్తేజంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి’’ అన్న ముగింపు వాక్యాలున్న రామ్ మాధవ్ పుస్తకం మోడీ అనంతర భారతానికి దారులు వేస్తోందా? ఆరెస్సెస్ లక్ష్యాలు, వ్యూహాల్లో మోడి అనంతర భారతం ఓ కీలకమైన మైలురాయి.
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
