ఏప్రిల్-జనవరి 2026 కాలంలో, ఎఫ్సీఎన్ఆర్(బ్యాంక్) లేదా ఎఫ్సీఎన్ఆర్(బీ) డిపాజిట్ల ప్రవాహం $0.94 బిలియన్లకు తగ్గింది. గత ఏడాది ఇదే కాలంలో ఇది $7.02 బిలియన్లుగా నమోదైంది.
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులు(ఎన్ఆర్ఐలు) డిపాజిట్ పథకాలలో పెట్టుబడిగా పెట్టే డబ్బు ఏప్రిల్-జనవరి 2026 మధ్యకాలంలో 25.86% క్షీణించి సుమారు $10.61 బిలియన్లకు తగ్గింది.
2025లో ఇదే కాలాన్ని పోలిస్తే ఈ తగ్గుదల నమోదైంది.
2025లో ఈ మొత్తం $14.31 బిలియన్లుగా ఉన్నట్టు భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) డేటా వెల్లడించినట్లు బిజినెస్ స్టాండర్డ్ కథనం తెలియజేసింది.
2026 జనవరి చివరి నాటికి మొత్తం ఎన్ఆర్ఐ డిపాజిట్ల నిల్వలు $165.78 బిలియన్లుగా ఉన్నాయి.
జనవరి 2025లో ఎన్ఆర్ఐ డిపాజిట్ల నిల్వలు $161.21 బిలియన్లు కాగా, 2025 డిసెంబరులో ఇవి $169.27 బిలియన్లుగా ఉన్నాయి.
ఎన్ఆర్ఐ డిపాజిట్ పథకాలను విదేశీ కరెన్సీ నాన్-రెసిడెంట్(ఎఫ్సీఎన్ఆర్) డిపాజిట్లు, నాన్-రెసిడెంట్ ఎక్స్టర్నల్ (ఎన్ఆర్ఈ) డిపాజిట్లు, అలాగే నాన్-రెసిడెంట్ ఆర్డినరీ (ఎన్ఆర్ఓ) డిపాజిట్లతో రూపొందిస్తారు.
ఏప్రిల్- జనవరి 2026 కాలంలో ఎఫ్సీఎన్ఆర్(బ్యాంక్) లేదా ఎఫ్సీఎన్ఆర్(బీ) డిపాజిట్ల ప్రవాహం $0.94 బిలియన్లకు తగ్గిందని, గత ఏడాది ఇదే కాలంలో ఇది $7.02 బిలియన్లుగా నమోదైందని బిజినెస్ స్టాండర్డ్ కథనం పేర్కొంది.
జనవరి నాటికి ఎఫ్సీఎన్ఆర్(బీ) ఖాతాలలోని నిల్వలు $33.75 బిలియన్లకు పెరిగాయి.
ఒకటి నుంచి ఐదు సంవత్సరాల కాలపరిమితితో, స్వేచ్ఛగా మార్చుకోదగిన విదేశీ కరెన్సీలలో భారత్లో ఫిక్స్డ్ డిపాజిట్లను నిర్వహించడానికి ఒక ఎఫ్సిఎన్ఆర్(బీ) ఖాతా కస్టమర్లకు అనుమతిస్తుంది.
విదేశీ కరెన్సీలోనే ఈ ఖాతాను నిర్వహిస్తున్నందున, డిపాజిట్ గడువు కాలంలో కరెన్సీ విలువలో వచ్చే హెచ్చుతగ్గుల నుంచి ఇది నిధులను భద్రపరుస్తుంది. 2025 జనవరిలో ఈ నిల్వలు $32.75 బిలియన్లుగా ఉన్నాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
