తాజాగా ఏర్పడిన న్యాయవాదుల సంఘం ఏ రాజకీయ పార్టీకి అనుబంధ విభాగంగా కాకుండా నిష్పాక్షికమైన, స్వతంత్రమైన వేదికగా ఉంటుందని ప్రకటించింది.
వృత్తిలో ఉన్న న్యాయవాదులు, న్యాయ శాస్త్ర విద్యార్థులు, న్యాయ కళాశాల అధ్యాపకులు ఎవరైనా ఈ సంఘం లక్ష్యాలను అంగీకరిస్తే సంఘంలో చేరేందుకు అవకాశం ఉంటుందని ప్రకటించారు.
న్యూఢిల్లీ: రాజ్యాంగం కోసం న్యాయవాదుల సంఘం పేరుతో ఏర్పాటైన న్యాయవాదుల వేదిక తొలి సమావేశం ఢిల్లీలో జరిగింది.
లైవ్ లా కథనం ప్రకారం న్యాయవాదుల సంఘం ఏ రాజకీయ పార్టీకి అనుబంధ విభాగంగా కాకుండా నిష్పాక్షికమైన, స్వతంత్రమైన వేదికగా ఉంటుందని ప్రకటించింది.
వృత్తిలో ఉన్న న్యాయవాదులు, న్యాయ శాస్త్ర విద్యార్థులు, న్యాయ కళాశాల అధ్యాపకులు ఎవరైనా ఈ సంఘం లక్ష్యాలను అంగీకరిస్తే సంఘంలో చేరేందుకు అవకాశం ఉంటుందని ప్రకటించారు.
సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు..
ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖ న్యాయవాదులలో సీయూ సింగ్, అమిత్ ఆనంద్ తివారి, నందితారావు, షాదన్ ఫరాసత్, పట్నా హైకోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదిగా ఉన్న జస్టిస్ అంజనా ప్రకాష్, అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అమర్ సారన్లు ఉన్నారు.
ప్రారంభ సభలో వ్యక్తీకరణలు..
న్యాయవాదులు మధుసూదన్ దేవరుత్, సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్స్ అసోసియేషన్ అధ్యక్షులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రారంభ సభలో అనేక మంది న్యాయవాదులు కూడా తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
ప్రత్యేక లక్ష్యంతో నూతన వేదిక..
“బార్ అసోసియేషన్లు ప్రధానంగా నిర్దిష్ట న్యాయస్థానాల పరిధిలో ప్రత్యేక సమస్యల కోసం పనిచేస్తున్నాయి. వీటిలో కొన్నింటికి బహిరంగ రాజకీయ అనుబంధాలు కూడా ఉన్నాయి. కానీ రాజ్యాంగం కోసం, రాజ్యాంగంలో పొందుపరచబడిన పీఠిక గ్యారంటీ చేసే ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసం పనిచేసే ఎటువంటి న్యాయవాదుల వేదికా లేదు. ఈ ప్రత్యేక లక్ష్యాన్ని నెరవేర్చడం కోసమే లాయర్స్ అసోసియేషన్ ఏర్పాటయింది” అని ఆ సంస్థ వెబ్సైట్లో ప్రకటించారు.
బీసీఐ ఆదేశాలపై వ్యతిరేకత..
హైదరాబాద్ నల్సార్‌లో పట్టాలు పొందిన విద్యార్థులను బార్ కౌన్సిళ్లలో నమోదు కానీయకుండా ఆదేశాలిస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ మనన్ మిశ్రా అనూహ్యంగా జారీ చేసిన ఆదేశాల నేపథ్యంలో వివిధ ప్రాంతాలలో న్యాయవాదులు గళం విప్పుతున్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నల్సార్ హైదరాబాదులో జరిగే కాన్వకేషన్‌కు హాజరుకారాదు అంటూ కొంతమంది విద్యార్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పిటిషన్లు పెట్టారు.
ఈ నేపథ్యంలో 2026లో హైదరాబాద్ నల్సార్ కాన్వకేషన్‌లో పట్టాలు పొందిన న్యాయ విద్యార్థులు ఎవరినీ బార్ కౌన్సిల్లో నమోదు చేసుకోరాదు అంటూ మనన్ మిశ్రా ఆదేశాలు జారీ చేశారు.
అధికార దుర్వినియోగమంటూ విమర్శలు..
1961 నాటి అడ్వకేట్స్ యాక్ట్ పరిధిలో ఉన్న నియంత్రణ అధికారాలను దుర్వినియోగం చేసే చర్యే మనన్ మిశ్రా ఆదేశం అని ఈ సంఘం పేర్కొన్నది.
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు జారీచేసిన ఆదేశాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) స్ఫూర్తికి పూర్తి విరుద్ధమైనవని లాయర్స్ కలెక్టివ్ ఫర్ కాన్స్టిట్యూషన్ ఆరోపించింది. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు తక్షణమే రాజీనామా చేయాలని కూడా ఈ సంస్థ డిమాండ్ చేసింది.
యువ న్యాయవాదులకు తర్ఫీదు..
కొత్తగా ఏర్పడిన లాయర్స్ కలెక్టివ్ ఫర్ కాన్స్టిట్యూషన్ ప్రాథమిక హక్కులు, పౌరస్వేచ్ఛలకు సంబంధించిన విషయాలలో అవసరమైన కేసులు వేయడంతో పాటు, ఈ కేసుల విషయంలో విచారణ ఎదుర్కొంటున్న ముద్దాయిలకు అవసరమైన న్యాయపరమైన సహాయాలు అందించడానికి, రాజ్యాంగ సంబంధిత అంశాలలో అనుగుణంగా జోక్యం చేసుకోవడానికి, రాజ్యాంగ న్యాయ శాస్త్రానికి సంబంధించిన స్వతంత్ర పరిశోధనలు ప్రోత్సహించడానికి, ప్రజా ప్రయోజనాల కోసం న్యాయవాద వృత్తిలోకి ప్రవేశిస్తున్న యువ న్యాయవాదులకు తర్ఫీదు ఇవ్వడానికి తగిన చర్యలు తీసుకుంటుందని లాయర్స్ కలెక్టివ్ ఫర్ కాన్స్టిట్యూషన్ ప్రకటించింది.
ఒకే వేదిక మీదికి న్యాయవాదులు..
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలు, న్యాయస్థానాలు, వివిధ రాజకీయ నేపథ్యాలతో ఉన్న న్యాయవాద వృత్తిలో ఉన్న వారందరినీ ఒక వేదిక మీదికి తీసుకురావడానికి చేస్తున్న ఈ ప్రయత్నం ఫలిస్తుందని ఎల్సీఎఫ్సీ ఆశాభావం వ్యక్తం చేసింది.
“ఈ సంఘంలో సభ్యులుగా ఉన్నవారు ప్రతి అంశం పైనా ఏకాభిప్రాయంతో ఉండాల్సిన అవసరం లేదు. రాజ్యాంగం గురించిన నిబద్ధత విషయంలో కనీస ప్రాథమిక అవగాహనకు లోబడి ఉండటం ఈ సంఘంలో పనిచేయడానికి ప్రాథమిక షరతుగా ఉంటుంది” అని తెలిపింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
