కేవలం ఇద్దరు సమాచార కమిషనర్లు మాత్రమే ఆగస్టులో మూడు విజ్ఞప్తులను పరిష్కరించగా, ఆర్టీఐ అప్పీల్స్‌పై మిగతా కమిషనర్లు ఒక్కటి కూడా పరిష్కరించలేదని సీఐసీ నెలవారీ నివేదిక వెల్లడించింది.
న్యూఢిల్లీ: కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) మంజూరైన పూర్తి స్థాయి సిబ్బందితో పనిచేస్తున్నప్పటికీ, ఆ సంస్థ వద్ద 40 వేలకు పైగా సమాచార హక్కు(ఆర్టీఐ) కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు సీఐసీ పోర్టల్ డేటా చూపిస్తోంది.
డిసెంబర్ 2025లో బాధ్యతలు చేపట్టిన ప్రధాన సమాచార కమిషనర్ రాజ్ కుమార్ గోయల్ నేతృత్వంలో సీఐసీ పనిచేస్తోంది, ఇందులో పది మంది సమాచార కమిషనర్లు ఉన్నారు.
సీఐసీ పోర్టల్ ప్రకారం ఆగస్టు 12వ తేదీ నాటికి సీఐసీ వద్ద 3,733 ఫిర్యాదులు; 36,350 అప్పీల్స్ కలిపి మొత్తం 40,083 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఈ మొత్తం బ్యాక్‌లాగ్‌లో గోయల్ వద్దనే 5,317 పెండింగ్ కేసులు ఉండగా- వాటిలో 522 ఫిర్యాదులు, 4,795 అప్పీల్స్ ఉన్నాయి.
ఆగస్టులో జీరో ప్రోగ్రెస్..
సీఐసీ నెలవారీ నివేదిక ప్రకారం, ఆగస్టులో మూడు విజ్ఞప్తులను కేవలం ఇద్దరు సమాచార కమిషనర్లు పరిష్కరించగా, ఆర్టీఐ అప్పీల్స్‌పై మిగతా కమిషనర్లు ఒక్కటిని కూడా పరిష్కరించలేదని సమాచారం.
సమాచార కమిషనర్లు వినోద్ కుమార్ తివారీ, స్వాగత్ దాస్ ఈ అప్పీల్స్‌ను పరిష్కరించారు. వారు వరుసగా ఒకటి, రెండు కేసులను పరిష్కరించారు.
నిరాశపరుస్తున్న కేసుల పరిష్కారం..
ఈ ఏడాది జనవరి నుంచి జులై మధ్యలో గోయల్ సగటున 46 శాతంతో 2,541 అప్పీల్స్‌ను విచారణకు స్వీకరించి 1,180 కేసులను పరిష్కరించారు.
జనవరిలో ఆయన 313 అప్పీల్స్‌లో 164ను పరిష్కరించగా, ఫిబ్రవరిలో 259కి గాను 167, మార్చిలో 358కి గాను 198, ఏప్రిల్‌లో 371కి గాను 154, మేలో 376కి గాను 162, జూన్‌లో 400కి గాను 189, జులైలో 464కి గాను 146 కేసులను పరిష్కరించారు.
ఆగస్టులో ఇంతవరకు గోయల్ ఒక్క అప్పీల్‌ను స్వీకరించడం, పరిష్కరించడం జరగలేదు.
ఆగస్టు మొదటి 12 రోజుల్లో మిగతా ఎనిమిది మంది సమాచార కమిషనర్లు ఆనంది రామలింగం, సురేంద్ర సింగ్ మీనా, అశుతోష్ చతుర్వేది, సుధారాణి రేలంగి, పీఆర్ రమేశ్, ఖుష్వంత్ సింగ్ సేథి, జయ వర్మ సిన్హా, సంజీవ్ కుమార్ జిందాల్ కూడా ఒక్క కేసును విచారణకు స్వీకరించలేదు, పరిష్కరించనూ లేదు.
పోర్టల్ ప్రకారం సీఐసీ ఈ ఏడాది ఆగస్టు నాటికి 20,163 విజ్ఞప్తులను స్వీకరించగా అందులోంచి కేవలం 11,903 మాత్రమే పరిష్కరించబడ్డాయి.
ఒక్కొక్క సమాచార కమిషనర్ 2026లో నెలవారీగా పరిష్కరించిన కేసుల సంఖ్య వివరాల పట్టిక:


సీఐసీలో పెండింగ్‌లకు సంబంధించి 2015లో ఒక ఘటనను పారదర్శకత కార్యకర్త కొమోడోర్ లోకేశ్ బాత్రా (రిటైర్డ్) ప్రస్తావిస్తూ, “ప్రస్తుతం ఇంత మంది కమిషనర్లు ఉద్దేశపూర్వకంగా నెమ్మదిగా వెళ్తూ ఆర్టీఐ వినియోగదారులను అసహనానికి గురిచేస్తూ, ఈ క్రమంలో సమాచారాన్ని తెలుసుకునే హక్కును చంపేస్తున్నారా?” అని ప్రశ్నించారు.
గతంలో 2015లో చీఫ్‌తో పాటు ముగ్గురు సమాచార కమిషనర్లు లేనప్పుడు కూడా సీఐసీలో ఉన్న దాదాపు 40 వేల బ్యాక్లాగ్ గురించి ఆయన ప్రస్తావించారు.
“సీఐసీలో భారీ మొత్తంలో పెండింగ్ కేసుల దృష్ట్యా, చీఫ్ శనివారం కూడా పనిచేసే విధంగా కమిషన్‌లో పెద్ద ఎత్తున సంస్కరణలు అవసరం ఉంది” అని బాత్రా అన్నారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
