రెండు విషయాలను ఇక్కడ గుర్తుంచుకోవాలి. విలువకు సంబంధించినంత వరకు ఒక సజాతీయ లక్షణమున్న, అంటే సంగ్రహించిన సామాజిక శ్రమ భాగాలుగా, సాధారణ సామాజిక శ్రమ భాగాలుగా అన్నిరకాల శ్రమలనూ చూస్తారు. విలువ పరిమాణాన్ని సగటు సామాజిక శ్రమ పరంగా వ్యక్తపరచాలని, ‘సాధారణ ఉత్పత్తి పరిస్థితులలో, సగటు నైపుణ్య స్థాయితో ఆ సమయంలో ప్రబలంగా ఉన్న తీవ్రతతో, ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి అవసరమైన’ సమయం సామాజికంగా అవసరమైన సమయమని దీనిని అనుసరించి వస్తుంది.
రెండు సరుకుల పరస్పర మారకంలోని నిష్పత్తులను ఏది నిర్ణయిస్తుందన్నది ఇప్పటికీ జవాబు లేని ప్రశ్నే. మారకపు విలువకు సంబంధించిన ఈ ప్రశ్నకు జవాబుకై మనం విలువ సూచించిన భావనకు మళ్ళాము, చివరకు విలువ పరిణామాత్మక కొలతను అందించాము.
సాధారణ సమాధానం ఇవ్వడానికి ప్రారంభ ప్రశ్న తగినంత సరైనది కాదు. ఏ సమయంలోనైనా మార్కెట్లోని ధరలను ఎవరైనా మారకపు నిష్పత్తుల ద్వారా అర్ధం చేసుకుంటే(పెట్టుబడిదారీ అర్ధ శాస్త్రవేత్తలు చేసినట్లు) జవాబును చేరుకుంటారు/అందుకుంటారు. మార్కెట్ ధరల సమస్యకు భిన్నమైన సైద్ధాంతిక సంగ్రహణ స్థాయిలో విలువ అసాధారణ రూపంగా మారకపు విలువ సమస్యను మార్క్స్ లాగా ఎవరైనా గ్రహిస్తే, వారు పూర్తిగా భిన్నమైన అభిప్రాయానికి వస్తారు. ఈ క్రింది పరిశీలనలు కాకుండా ఈ సమయంలో ఈ అంశంపై విస్తృతమైన చర్చ అపరిపక్వమైనది.
సాంప్రదాయ అర్ధశాస్త్రవేత్తలు డేవిడ్ రికార్డో, ఆడంస్మిత్లు సరకుల మార్పిడి విలువల అంతర్లీన నిర్ణయాధికారి వాటిలో ఉన్న శ్రమ పరిమాణమనే వాదనను ముందుకు తెచ్చారు. ఏదైనా నిర్దిష్ట మార్కెట్లో, నిర్దిష్ట సమయంలో, సరుకుల మార్కెట్ ధరలను నిర్ణయించడంలో సరఫరా, డిమాండ్ల ప్రభావాన్ని వారు ఏ విధంగానూ విస్మరించలేదు. అందుకు బదులుగా సరుకుల మార్కెట్ ధరలు వాటి సహజ ధరల నుంచి దారిమళ్ళడానికి కారణం సరఫరా, డిమాండ్ల ప్రభావమన్నది వారి అభిప్రాయం. అంతేకాకుండా, ఈ దారితప్పడాన్ని వివరించడానికే సరఫరా, డిమాండ్ల శక్తులు సహాయపడతాయి. కానీ అంతర్లీనంగా ఇమిడి ఉన్న శ్రమ పరిమాణం ద్వారా నిష్పాక్షికంగా నిర్ణయించబడుతున్న సహజ ధర, దీని చుట్టూ మార్కెట్ ధరలు హెచ్చు తగ్గులకు లోనౌతున్నాయి.
సాంప్రదాయ సిద్ధాంతంలోని అంశాలను తీసుకొని శాస్త్రీయ సిద్ధాంతంపై విమర్శ ద్వారా తన స్వంత సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసిన మార్క్స్ ‘విలువ నియమం’పై(విలువను ఉత్పత్తి చేయడంలో అవసరమైన సామాజికంగా అవసరమైన శ్రమ పరిణామాత్మక కోణంలో ఇక్కడ అర్ధం చేసుకోబడింది.)
సరఫరా డిమాండ్ల పాత్రపై, పెట్టుబడి సంపుటిలో అద్భుతమైన చర్చను అందించారు. మార్క్స్ అభిప్రాయాన్ని (స్థితిని) ఈ విధంగా సమీక్షించవచ్చు: అయితే, సరకులను వాటి విలువకు అమ్ముతారనే వాదన ‘వాటి విలువ గరిమనాభి, దాని చుట్టూ ధరలు హెచ్చు తగ్గులకు గురౌతాయి. నిరంతరం హెచ్చు తగ్గులు వాటిని సమం చేస్తాయి’ అని కేవలం సూచిస్తుంది.
వాదన మరింత అభివృద్ధి చెందడంలో సరకులను వాటి విలువ వద్ద అమ్ముతారని మార్క్స్ ‘విలువ నియమం’ చెప్పడం లేదు. అందుకు బదులుగా సరకులు వాటి ఉత్పత్తి ధరల వద్ద మార్పిడి అవుతాయని చెబుతుంది. మనం చాలా తరువాత చర్చించవలసిన ఆ తరువాతి దానిని, పెట్టుబడిదారీ పోటీలో మూలధనంపై ఏకరీతి లాభాల రేటు వైపు వెళ్ళే ధోరణిని పరిగణనలోకి తీసుకోవడం వలన విలువలు సవరించబడినట్లు అర్ధం చేసుకోవచ్చు.
పెట్టుబడిదారులు పెరుగుతున్న వర్గంగా ఉన్న బ్రిటీష్ చారిత్రక కాలంలో రికార్డో తన విలువ సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశాడు. ఈ విలువ సిద్ధాంతం భూస్వామ్య వర్గానికి వ్యతిరేక ఆయుధం. ఏమైనప్పటికీ, ఆ తరువాత బ్రిటన్‌లో పెట్టుబడిదారీ వర్గ అధికారం గట్టిపడిన తరువాత రికార్డియన్ సోషలిస్టులని పిలువబడే వారిచే, విలువ శ్రమ సిద్ధాంతాన్ని విప్లవకరంగా ఉపయోగించబడింది. శ్రమ అన్ని విలువలను ఉత్పత్తి చేస్తున్నందున ఉత్పత్తి శ్రమకే చెందాలని వారు వాదించారు.
వేతనాలు మాత్రమే చట్టబద్ధమైన హక్కు, లాభాలు కాదు. ఇది పాలకవర్గానికి ప్రమాదకరం, పాలక భావజాలానికి ఇబ్బందికరం. స్పందన రావడానికి ఎక్కువ కాలం పట్టలేదు. శ్రమ ఆధారంగా విలువను నిర్ధారించే వస్తుగత నిర్ణయాన్ని పెట్టుబడిదారీ అర్ధ శాస్త్రం తిరస్కరించే రూపాన్ని అది తీసుకుంది.
19వ శతాబ్దం చివరలో, బ్రిటన్- యూరపు ఖండం రెండింటిలోనూ ఒక నూతన సంప్రదాయక అర్ధశాస్త్రవేత్తల చింతనా ధోరణి పుట్టుకొచ్చింది. సాంప్రదాయక అర్ధశాస్త్రవేత్తలతో వారికి ఉమ్మడిగా ఉన్నది చాలా తక్కువ. కావున, నూతన సాంప్రదాయక అర్ధశాస్త్రవేత్తలన్నది ఒక తప్పుడు పేరు. సరకుల వినియోగం నుంచి వినిమయదారుడు వ్యక్తిగతంగా పొందిన వస్తుగత సంతృప్తి చేత ధరలు నిర్ధారించబడతాయని నూతన సాంప్రదాయక వాదులు వాదించారు.
విలువ నిర్ధారణలో వస్తుగత ఆధారం(శ్రమ సమయం) వినియోగదారుడి వ్యక్తిగత మనోభావాలతో భర్తీ చేయబడింది. ఆవిధంగా ఈ సిద్ధాంతం విలువ ఆత్మాశ్రయ సిద్ధాంతమని పిలువబడింది. ఈ సిద్ధాంతమే, కొన్ని మార్పులతో(చాలా ముఖ్యంగా విలువ భావననే తొలగించడం ద్వారా) ఆధునిక ధర సిద్ధాంతంపై ఆధిపత్యం వహిస్తున్నది. ఈ సిద్ధాంతమని పిలవబడే దాని అనవసరంగా చెప్పిందే చెప్పే ధోరణి. అది సూచిస్తున్న పూర్తిగా చరిత్రపూర్వ దృక్పథమని నిలోలాయ్ బుఖారిన్, దొబ్మరి ఇతరులచే తగినంతగా బహిరంగంగా తెలిపారు.
ఒక క్రమ పద్దతిలో గుర్తు చేసుకుంటే మార్క్స్‌కి ‘నిర్దిష్టత అంటే నిర్దిష్టతే. అది అనేక నిర్ణయాల కేంద్రీకరణ, అందువల్ల భిన్నత్వ ఏకత్వం’. దానికనుగుణంగా, మార్కెట్ ధర అనేక నిర్ణాయకాల ఫలితం, వాటిలో ప్రాధమికమైనది ‘విలువ’.
‘విలువ’ అన్న పదాన్ని పరిమాణాత్మక- గుణాత్మక అంశాలలో ధరతో గందరగోళ పడకూడదు..
నిర్ణాయకాలు అంటే అర్ధం నిర్ణయించే అంశాల లేదా నిర్ణాయకాల సమూహం. ఆవిధంగా ‘విలువను’ మార్కెట్ ధర ప్రాథమిక నిర్ణయాధికారిగా పరిగణించవచ్చు. కానీ మార్కెట్ ధరను నిర్ణయించడంలో ప్రవేశించే ఇతర అంశాలు కూడా ఉన్నాయి. అవి భిన్నమైనవి ద్వితీయ ప్రాముఖ్యతగల అంశాలు. అందుకే, మార్పిడి నిష్పత్తుల పరిమాణాత్మక సమస్యను చేరుకోవడానికి కూడా ఎవరైనా విలువ పరిమాణంతో ప్రారంభించాలి.
సంక్లిష్ట నిర్ధారణలుగా తమకు తామే ఇచ్చే సంక్లిష్టతల, స్థాయిల విలువ, ఉత్పత్తి ఖర్చు, మూలధనం సజీవ కూర్పు, అదనపు విలువ నిష్పత్తి, మొదలైనవాటి సంగ్రహణమైన మార్కెట్ ధరలను మార్క్స్ ఎలా చేరుకున్నాడో మూడు సంపుటాల పెట్టుబడి చాలా దృఢమైన పద్దతిలో చూపింది. విలువ, సంగ్రహించిన శ్రమలపై చర్చకు తిరిగి వచ్చేముందు, ‘విలువ’ అన్న పదాన్ని పరిమాణాత్మక- గుణాత్మక అంశాలలో ధరతో గందరగోళ పడకూడదని చెప్పవలసిన అవసరం ఉంది. సిద్ధాంతపరంగా ఈ రెండు వర్గాలూ భిన్నమైన స్థాయిలో ఉన్నాయి.
సరకు విలువ- వినియోగవిలువ, రెండూ కూడాని మనం పైన ప్రారంభించాము. ‘విలువ’ అన్న పదం సరుకు సామాజిక లక్షణాన్ని అనగా దాని ఉత్పత్తిలో సమాజ మొత్తం శ్రమలో ఖర్చు పెట్టిన భాగాన్ని సూచిస్తుంది. కానీ సమాజ శ్రమను గురించి మాట్లాడేటప్పుడు సమాజంలో నిర్వహిస్తున్న నేత, లేతు మిషన్‌పై పనిచేయడం, లోహపు ముక్కను మెరుగు పెట్టడం వంటి వివిధ రకాల శ్రమల విశిష్టతను మనం తప్పనిసరిగా విస్మరిస్తున్నాము. వాటన్నిటిని ఏక రూప శ్రమగా, ఒకే రకమైన శ్రమగా, ‘సాధారణంగా మానవ శ్రమగా’ పరిగణిస్తున్నాము. చెప్పాలంటే మనం వాటి వ్యత్యాసాలను సంగ్రహిస్తున్నాము. ఆ విధంగా సరకు ఒక విలువ, దానిలో ‘సంగ్రహించిన శ్రమ’ ఇమిడి ఉందనే ప్రతిపాదనకు చేరుకున్నాము.
విలువ, సంగ్రహించిన శ్రమ ఈ రెండు వర్గాల అభిప్రాయాలను అర్ధం చేసుకోవడానికి, సంగ్రహించిన శ్రమ అన్న భావనను పరిశీలిద్దాము.
గమనించవలసిన మొదటి విషయం ఈ భావన చారిత్రక విశిష్టత. మార్క్స్ ఊహాగాన ఆవిష్కరణ ఏదీ లేదు. ఇది బాగా అభివృద్ధి చెందిన సరకుల ఉత్పత్తి ఉన్న సమాజంలో, వివిధ రకాల శ్రమల ఉత్పత్తులు నిరంతరం ఒకదానితో మరొకటి సమానం చేయబడతాయి. ఆవిధంగా వివిధ రకాల శ్రమలను కూడా తిరుగులేకుండా(తద్వారా గుణాత్మకంగా సజాతిగా) సమానం చేస్తుందన్నఒక నిర్దిష్ట సామాజిక వాస్తవికతను సూచిస్తుంది.
నేడు వివిధ రకాల శ్రమల ఉత్పత్తులను సమానం చేసే సామాజిక ప్రక్రియ, మార్కెట్ ద్వారా మార్పిడి జరుగుతున్న అటువంటి దృగ్విషయం మంజూరు చేయబడింది. కానీ, సరకుల ఉత్పత్తి విస్తృతంగా అభివృద్ధి చెందడానికి ముందు పరిస్థితి ఇది కాదు. సాంప్రదాయ రాజకీయ ఆర్థిక వ్యవస్థకు తక్షణ పూర్వగాములైన(ముందుగా సూచనలు ఇచ్చే దూతలు) ఫిజియోక్రాట్లు మానవ శ్రమను సంపద సృష్టించే చర్యగా చూసి కానీ ఈ లక్షణాన్ని వ్యవసాయక శ్రమకే పరిమితం చేసి, తామే ఆర్ధిక సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చారు.
మార్క్స్ వ్యాఖ్యానించినట్లు: ‘సంపదను సృష్టించే కార్యాచరణ – తయారీ లేదా వ్యాపార సంబంధమైన లేదా వ్యవసాయ శ్రమ మాత్రమే కాదు. కానీ, ఒకటి అలాగే ఇతరుల సాధారణ శ్రమ– ప్రతి చర్యనూ పరిమితం చేసే ప్రతి లక్షణాన్నీ విసిరేయడం ఆడంస్మిత్కు చాలా గొప్ప ముందడుగు’.
ఒక రకమైన శ్రమ నుంచి మరొక రకమైన శ్రమకు ప్రజలు కొంత సులభంగా మారగల సమాజంలో, ఆధునిక బూర్జువా సమాజంలో మాత్రమే సంగ్రహించిన శ్రమ వంటి భావన అభివృద్ధి చెందుతుంది.
మరొక మారు మార్క్స్‌ను చెప్పినదాన్ని ఉదహరిస్తే:‘నిర్దిష్ట శ్రమలపట్ల ఉదాసీనత వ్యక్తులు మరొకరికి సులభంగా బదిలీ అయ్యే, నిర్దిష్ట రకం వారికీ అవకాశమయ్యే సమాజ రూపానికి అనుగుణంగా ఉంటుంది. అందుకే ఉదాసీనత.’
ఒకరికి స్వంత శ్రమ సామర్ధ్యం ఉన్నప్పుడు అంటే శ్రమ శక్తి తానే సరకుగా మారినప్పుడు పరాయీకరించదగినదానిని ఏదో కొనవచ్చు, అమ్మవచ్చు. అది ఒక వ్యక్తీ వ్యక్తిగత ఆస్తి, ఇది స్పష్టమైన వ్యవహారం. సరకుల ఉత్పత్తి పూర్తి అభివృద్ధి, సంగ్రహించిన శ్రమ సామాజిక వాస్తవికత ఖచ్చితమైన ప్రతినిధిగా ఉండడం పెట్టుబడిదారీ సమాజంలోనే జరుగుతుంది.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధ శాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది ఎనిమిదవ భాగం, ఏడవ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
