స్టాఫింగ్ సంస్థ క్వెస్ కార్ప్ ఆగస్టు 19న విడుదల చేసిన ‘ఎఫ్వై26 పల్స్ రిపోర్ట్’ ప్రకారం, తరచుగా ఉద్యోగాలు మారడం వల్ల తాత్కాలిక ఉద్యోగాలు పెరుగుతున్నాయి.
అయిననప్పటికీ, భారతదేశ వ్యవస్థీకృత రంగంలో కొత్త వారికి ఉద్యోగ అవకాశాలు క్రమంగా కుంచించుకుపోతున్నాయి.
4 నుంచి 10 సంవత్సరాల అనుభవం ఉన్న నిపుణులకు యాజమాన్యాలు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని నివేదిక పేర్కొంది.
జీసీసీ విభాగంలో పడిపోయిన నియామకాలు..
గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్(జీసీసీ) విభాగంలో, కొత్త ఉద్యోగుల వాటా 2024లో 28 శాతం ఉండగా, 2025 నాటికి అది 15 శాతానికి పడిపోయింది.
కంపెనీలు ప్రత్యేక నైపుణ్యాలు, వెంటనే పనిలో చేరగలిగే(డిప్లాయ్మెంట్-రెడీ) ప్రతిభను కోరుకోవడమే దీనికి కారణం.
ఖాళీల భర్తీకే ప్రాధాన్యం..
సగటు కాలపరిమితి 24 నెలల కంటే తక్కువకు పడిపోవడంతో జెన్ జెడ్ ప్రతిభావంతులలో దాదాపు 40 శాతం నియామకాలు కేవలం ఖాళీలను భర్తీ చేయడానికే(రిప్లేస్మెంట్ హైరింగ్) జరుగుతున్నాయని, ఫలితంగా అత్యధిక యువ శక్తికి ఉపాధి లేకపోవడం ఒక సవాలుగా మిగిలిపోయిందని నివేదిక గుర్తించింది.
పెరిగిన ఐటీ, ఏఐ నియామకాల డిమాండ్..
జీసీసీ నియామకాలు పెరుగుతున్నప్పటికీ ఫ్రెషర్ల నియామకాలలో ఈ తగ్గుదల కనిపించింది. భారతదేశంలో 2,100 కంటే ఎక్కువ జీసీసీలు ఉన్నాయి.
2026 సంవత్సరం 3వ త్రైమాసికంలో 4-6 శాతంగా ఉన్న నియామకాలు 4వ త్రైమాసిక ప్రాతిపదికన 12-14 శాతానికి పెరిగాయి. 2024లో 15 శాతంగా ఉన్న మొత్తం భారతదేశ ఐటీ నియామకాల డిమాండ్లో జీసీసీలు 2025 నాటికి దాదాపు 27 శాతం ఉన్నట్లు నివేదిక తెలియజేసింది.
ప్రత్యేక నైపుణ్యాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ నియామకాల డిమాండ్ వార్షిక ప్రాతిపదికన (వై-ఓ-వై) 38-45 శాతం పెరిగింది.
మార్చి 2024-మార్చి 2025 మధ్య ఏఐ నియామకాలు 178 శాతం పెరిగాయి. ఏఐ నియామకాల డిమాండ్లో 4 నుంచి 10 సంవత్సరాల అనుభవం ఉన్న మిడ్-కెరీర్ నిపుణులు దాదాపు 65 శాతం మంది ఉద్యోగాలు పొందారు.
నియామకాల పునర్వ్యవస్థీకరణ (హైరింగ్ రీసెట్)..
జీసీసీ ఫ్రెషర్ నియామకాలు 2024లో 28 శాతం నుంచి 2025లో 15 శాతానికి పడిపోయాయి. 4-10 సంవత్సరాల అనుభవం ఉన్న వారికి ఏఐ నియామకాలలో 65 శాతం ఉద్యోగాలు లభించాయి.
సగటు కాలపరిమితి 24 నెలల కంటే తక్కువకు పడిపోవడంతో జెన్ జెడ్ నియామకాలలో రిప్లేస్మెంట్ నియామకాలు 40 శాతం ఆక్రమించాయి.
15-29 సంవత్సరాల వయస్సు గల కార్మికుల సగటు కాలపరిమితి 13 నెలలు కాగా, 30-60 సంవత్సరాల వయస్సు వారికి ఇది 20 నెలలుగా ఉంది.
15-30 2024లో 15 శాతంగా ఉన్న ఐటీ నియామకాల డిమాండ్లో 2025లో జీసీసీల వాటా 27 శాతానికి చేరింది.
15-31 జెన్ ఏఐ నియామకాలు 178 శాతం పెరిగాయి. ఏఐ, డేటా నియామకాలు 38-45 శాతం పెరిగాయి.
పట్టణ యువత నిరుద్యోగం 14.1 శాతంగా ఉంది.
అయితే మొత్తం నిరుద్యోగం 9.9 శాతం. మహిళా యువత ఎల్ఎఫ్పీఆర్ 27.5 శాతం కాగా, పురుషులకు ఇది 64 శాతంగా ఉంది.
అధిక అట్రిషన్ – తక్కువ కాలపరిమితి..
క్వెస్ డేటా ప్రకారం 15-29 సంవత్సరాల వయస్సు గల కార్మికులు 13 నెలల సగటు కాలపరిమితిని కలిగి ఉన్నారని, 30-60 సంవత్సరాల వయస్సు గల కార్మికులలో ఇది 20 నెలలుగా ఉందని చూపించింది.
యువ కార్మికులు కూడా అధిక అట్రిషన్ను నమోదు చేశారు. “యువ కార్మికులు గణనీయంగా అధిక అట్రిషన్, తక్కువ ఉద్యోగ వ్యవధిని ప్రదర్శిస్తూనే ఉన్నారు. సగం మంది యువ కార్మికులు 13 నెలల లోపే ఉద్యోగాన్ని వదిలివేస్తున్నారు. అయితే పెద్ద వయస్సు ఉన్న వారు సాధారణంగా దాదాపు 20 నెలల వరకు ఉద్యోగంలో కొనసాగుతున్నారు. స్వల్ప-కాల ఉద్యోగాలు క్రమంగా ప్రాజెక్ట్ ఆధారిత స్టాఫింగ్, రుతుపవనాల డిమాండ్ సైకిల్స్, ఫ్రంట్ లైన్ శ్రామిక శక్తి మార్పులు, నిర్ణీత-కాల ఉద్యోగ నమూనాల ద్వారా నడపబడుతున్నాయి” అని నివేదిక పేర్కొంది.
శ్రామిక శక్తి భాగస్వామ్యంలో వ్యత్యాసాలు..
చదువు నుంచి ఉద్యోగానికి మారడంలో నిరంతర ఇబ్బందులను కూడా లేబర్ మార్కెట్ డేటా విశ్లేషణ తెలియజేస్తున్నది.
15-29 సంవత్సరాల వయస్సు గల వారిలో, శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు (ఎల్ఎఫ్పీఆర్)46 శాతంగా ఉంది. కార్మికుల జనాభా నిష్పత్తి 41.5 శాతంగా ఉంది.
పట్టణ యువత నిరుద్యోగిత రేటు 14.1 శాతంగా ఉంది. ఇది మొత్తం నిరుద్యోగిత రేటు 9.9 శాతం కంటే చాలా ఎక్కువ.
“యువత నిరుద్యోగం జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా ఉంది. పురుషుల 64 శాతంతో పోలిస్తే మహిళా యువత ఎల్ఎఫ్పీఆర్ 27.5 శాతంతో తక్కువగా ఉంది”అని తెలిపింది.
ఉద్యోగం, విద్యకు దూరంగా యువత..
విద్య, ఉద్యోగం లేదా శిక్షణలో లేని(నీట్) రేటు 25 శాతంగా ఉంది. మహిళల్లో నీట్ రేటు 42.2 శాతంగా ఉండగా, పురుషులలో ఇది కేవలం 8 శాతంగా ఉంది.
“భారతదేశ యువతలో నాల్గో వంతు మంది ఉద్యోగం, విద్య లేదా శిక్షణ లేకుండా ఉన్నారు. శ్రామిక శక్తి భాగస్వామ్యంలో మహిళా వ్యత్యాసాలు భారతదేశపు అతిపెద్ద నిర్మాణాత్మక శ్రామిక శక్తి సవాళ్లలో ఒకటిగా మిగిలిపోయాయి. యువ కార్మికులలో త్వరగా ఉద్యోగాలలోకి ప్రవేశించడానికి ఆర్థిక అవసరమే ప్రధాన కారణం” అని నివేదిక పేర్కొంది.
అనువాదం: ఆర్ లక్ష్మయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
