“డీసీపీ ఆదేశాల మేరకే” ఆర్ఏఎఫ్ రౌండ్లను కాల్చారు! ది హిందూ విశ్లేషించిన ఒక జనరల్ డైరీ ఎంట్రీ ఈ విషయాన్ని తెలియజేసింది.
అయితే పెల్లెట్ గన్నులను ఉపయోగించినట్లు వస్తున్న కథనాలన్నీ తప్పు అని ఢిల్లీ పోలీసులు వాదిస్తున్నారు.
న్యూఢిల్లీ: సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) దర్యాప్తు ఒక్క రోజు తర్వాత ఒక ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్(ఆర్ఏఎఫ్) జవాన్ తన పెల్లెట్ గన్నుతో కనీసం ఏడు రౌండ్లు కాల్చారు, శాంతియుత నిరసనకారులకు ఐదు రౌండ్లు తగిలాయి, పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో దాఖలైన ఒక జనరల్ డైరీ ఎంట్రీ చూపించిన దాని ప్రకారం డెప్యూటీ పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు అల్లర్లను అణచివేసే గన్ను నుంచి ఆర్ఏఎఫ్ రెండు రౌండ్లు కాల్చారు.
నిరసనకారులకు వ్యతిరేకంగా పోలీసులు పెల్లెట్ గన్నులను ఉపయోగించారని వస్తున్న కథనాలన్నీ తప్పు అని గత వారం నుంచి ఢిల్లీ పోలీస్ వాదిస్తుంది.
ఆయుధాల వినియోగంపై స్పష్టత..
ఈ ఎంట్రీ జూలై 20 మధ్యాహ్నం 1.24 గంటలకు నమోదయింది, “డీసీపీ ఆదేశాల మేరకు”, ఆర్ఏఎఫ్ డెప్యూటీ కమాండెంట్ 55 రౌండ్ల నాన్-ఎలక్ట్రికల్ షెల్స్, 15 రౌండ్ల ఎలక్ట్రికల్ షెల్స్, ఐదు బాష్పవాయు గ్రనేడ్లు, ప్లాస్టిక్ పెల్లెట్లతో ఉన్న అల్లర్లను అణచివేసే గన్నుతో రెండు రౌండ్ల బాలిస్టిక్ కార్ట్రిడ్జిలు కాల్చినట్లు, డైరీ ఎంట్రీ విశ్లేషణ తర్వాత ది హిందూ కథనం తెలియజేసింది.
కాక్రోచ్ జనతా పార్టీ ‘ఛలో సంసద్’..
ఆ సమయంలో కేంద్ర విద్యా శాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ ఇతర విద్యార్థి సంఘాలతో పాటు “ఛలో సంసద్”ను గత సోమవారం (జూలై 20)న దేశ రాజధానిలో నిర్వహించినప్పుడు సీఆర్పీఎఫ్ కింద ఉన్న ఆర్ఏఎఫ్ అల్లర్ల అణచివేత యూనిట్ మోహరించింది.
పోలీసుల ఖండన..
పెల్లెట్ గన్నుల ఉపయోగం గురించి మొదటగా కథనాలు జూలై 20న ప్రచారంలోకి వచ్చాయి, బాధితుడు షేక్ ఇర్షాద్ మన్సూరీ దృశ్యాన్ని చూపిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ కూడా ప్రచారం చేసింది, అతనిపై ది వైర్ కథనం ప్రచురించింది.
ఈ వాదనపై ఢిల్లీ పోలీస్ స్పందించింది, ఈ కథనాలన్నీ తప్పని కొట్టి పారేసింది. “శాంతియుత నిరసనకారులపై ఢిల్లీ పోలీసులు పెల్లెట్ గన్నులను ఉపయోగించారన్నది పూర్తిగా నిరాధారమైనవి, తప్పుదోవ పట్టించే కథనాలని,” న్యూఢిల్లీ పోలీస్ డెప్యూటీ కమిషనర్ ఎక్స్ (మునుపటి ట్విట్టర్) వేదికగా అన్నారు.
నిర్ధారించుకోలేని అంశాలను పంచుకోవడం లేదా చలామణి చేయరాదని ప్రజలకు డీసీపీ గట్టిగా సలహా ఇచ్చారు.
ఏదైనా సమాచారం పోస్టు పెట్టక ముందు లేదా పంపించక ముందు అధికార వర్గాల నుంచి వాస్తవాలు పరిశీలించాలని ఆయన కోరారు.
పెల్లెట్ గన్ బాధితులు..
ఢిల్లీలో జూలై 20 నిరసన తర్వాత పెల్లెట్ గన్ను గాయాల గురించి అనేక మంది పౌరులతో పాటు ఒక కంటి చూపును కోల్పోయే స్థితిలో ఉన్న 19 సంవత్సరాల ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి కూడా సమాచారం ఇచ్చారు.
తొలిసారిగా ఢిల్లీలో వినియోగం..
భారతీయ భద్రతా దళాలు ప్రత్యక్ష మందుగుండు సామగ్రికి ప్రత్యామ్నాయంగా “తక్కువ ప్రాణాంతకమైన” షాట్ గన్లను ఎప్పుడో ఒకసారి ఉపయోగిస్తారు, ముఖ్యంగా కశ్మీర్ వంటి ప్రాంతాల్లో ఉపయోగిస్తారు.
అయితే దేశ రాజధానిలో నిరాయుధులైన నిరసనకారులకు వ్యతిరేకంగా జూలై 20న మొదటిసారి మోహరింపజేశారు.
సుప్రీంకోర్టును ఆశ్రయించిన బాధితులు..
పెల్లెట్ గన్ గాయాలపై రకరకాల కథనాలు వెలుగు చూసిన నేపథ్యంలో, ఇద్దరు బాధితులు ప్రశాంత్ కుమార్ సింగ్, షేక్ ఇర్షాద్ మన్సూరీ పౌరులు గుమికూడటానికి వ్యతిరేకంగా గుంపును నియంత్రించడానికి తీసుకుంటున్న చర్యల కోసం “లోహ పెల్లెట్ గన్నులను” పాక్షికంగా లేదా పూర్తిగా ఉపయోగించడాన్ని నిషేధించాలని కోరుతూ సోమవారం (జూలై 27)న సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
