ఆరెస్సెస్, బీజేపీ- వారి అనుబంధ సంస్థల సభ్యులు ముందు అర్జంటుగా వెళ్లి లెక్కలు నేర్చుకోవాలి. ఎందుకంటే నెహ్రూ 1947 ఆగస్టు 15 నుంచి 1964 మే 27 వరకు 16 సంవత్సరాల 286 రోజులు ప్రధానిగా ఉన్నాడు, అంటే సుమారు 17 సంవత్సరాలు.
మరి మోడీ 2014 మే 26 నుంచి ఇప్పటి వరకు(అక్టోబర్, 2026) 12 సంవత్సరాలు మాత్రమే ఆ పదవిలో ఉన్నాడు.
ఇక నెహ్రూ రికార్డు బ్రేక్ అయ్యింది ఎక్కడ? నెహ్రూ 3,259 రోజులు జైల్లో ఉన్నాడు. మరి ఆ రికార్డు కూడా మోడీ బ్రేక్ చేస్తే చూద్దామని ఈ దేశ ప్రజలు సరదా పడుతున్నారు.
‘మనకు విద్యామంత్రి అక్కర లేదు, మంత్రులకే విద్య అవసరమౌతుంది’ అని ఓ పెద్దాయన అన్నాడు.
జవహర్లాల్ నెహ్రూది ఒక ధనిక కుటుంబం. ఆయన తన రెండు వందల కోట్ల ఆస్తిని ఈ జాతికి అంకితం చేశాడు.
మోడీ 35 ఏళ్ళు చాయ్ అమ్ముకుని, బిచ్చమెత్తుకుని బతికానని చెప్పుకుని తిరిగాడు. అందువల్ల పోలిక ఎలా సాధ్యం?
నెహ్రూ పాకిస్థాన్‌తో, చైనాతో ధైర్యంగా యుద్ధాలు చేశాడు. ఆ భారాన్ని తెచ్చి ప్రజల నెత్తిన గుమ్మరించలేదు.
మోడీ చైనా గురించి కనీసం మాట్లాడలేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి వల్ల పాకిస్థాన్ గురించి కూడా మాట్లాడలేడు. అందువల్ల పోలిక ఎలా సాధ్యం?
అభివృద్ధిలో నెహ్రూ పాత్ర
ఇస్రో, ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్‌లను రూపొందించిన దార్శనికుడు నెహ్రూ.
మోడీ తనదైన ఐటీ సెల్ ఏర్పరుచుకుని అబద్ధాల కథలు చెప్పుకుంటూ పదవిలో కొనసాగుతున్నవాడు. అందువల్ల పోలిక ఎలా సాధ్యం? నెహ్రూ విద్యారంగ ప్రాముఖ్యాన్ని గ్రహించినవాడు.
భారతీయ యువతీయువకులు ప్రపంచస్థాయి పౌరులుగా నిలవాలని కలలు గన్నవాడు. వాటిని సాకారం చేసుకున్నవాడు.
మోడీకి చదువులేదు. పైగా ఇతరులకు కూడా అవసరం లేదని అనుకునేవాడు. నిరుద్యోగుల్ని పకోడీలు చేసి అమ్ముకోమన్న శ్రేయోభిలాషి. అందువల్ల పోలిక ఎలా సాధ్యం? అసలు ఆ పోలికే అర్థంలేదు.
దేశం నెహ్రూ చేతికి వచ్చినపుడు బ్రిటీషు వారు అంతా దోచుకుపోగా, భారత భూభాగం, ప్రజలు మాత్రమే ఉన్నారు. అలాంటి దాన్ని ఒక గొప్ప దేశంగా నిర్మించిన ఆర్కిటెక్ట్ నెహ్రూ.
మోడీ ప్రధాని అయ్యేసరికే దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో రెండోదిగా ఉంది. దాన్ని ఇప్పుడు ఎంత దిగజార్చాడో- రూపాయి విలువ కోలుకోకుండా చేసింది ఎవరో అందరికీ తెలుసు. అందువల్ల పోలిక ఎలా సాధ్యం? అసలు ఆ పోలికే అసమంజసం.
ప్రధాని మోడీ తీరుపై విమర్శలు
దార్శనికత, నైతికత, నిబద్ధత, త్యాగం, వైజ్ఞానిక స్పృహ, విదేశీ వ్యవహారాల దక్షత, ఆర్థిక విధానం వంటి వాటితో ప్రస్తుత ప్రధానిని పోలిస్తే, ఈ టెలిప్రాంప్టర్ రీడర్ ఎక్కడుంటాడు?
కోట్లు కోట్లు దుబారా చేస్తూ, ఫుల్ టైం విదేశాలు తిరుగుతూ, దేశానికి పార్ట్ టైం ప్రధానిగా కొనసాగుతూ ఉంటే, ఈ దేశ ప్రజలకు ఏం గుర్తుంటాడు? ఎవరో అన్నారు అదానీకి మేలు చేయడానికి తిరిగేవాడే ప్రధాని అని. అందువల్ల పోలిక ఎలా సాధ్యం?
తరాలు మారొచ్చు కానీ, అన్ని తరాల ప్రజలకు ప్రధాని స్థాయి ఏమిటో ఇక్కడ జరిగిన అభివృద్ధి తెలియజేస్తూనే ఉంటుంది. అన్ని రంగాలలో దేశం సాధిస్తూ వచ్చిన ప్రగతి వెనుక వెన్నెముకలాగా నెహ్రూయే ఉన్నాడని తెలుస్తూనే ఉంటుంది.
కోట్ల విలువైన సూట్లు వేసుకుని తిరిగినా ఏముంది? సూటు విలువ తగ్గాల్సిందే కానీ, వేసుకున్న మోడీ విలువ పెరిగిందెక్కడ?
దేశ ప్రజలకు ఏమైనా చేస్తే కదా విలువ పెరిగేది? దేశంలో ఒకరిద్దరు కార్పొరేట్లకూ, దేశం బయట ఒకరిద్దరు ప్రపంచ నాయకులకూ గులాంగిరీ చేయడం తప్ప దేశంలోని పేద ప్రజలకు ఆయన చేసిందేముంది?
ప్రశ్నకు భయపడి పారిపోయేవాడు ఎంత పెద్ద పదవిలో ఉంటే మాత్రం ప్రయోజనమేమిటి? సొంత రాష్ట్రం గుజరాత్లో ప్రభుత్వ పాఠశాలలన్నీ మూతబడుతూ ఉంటే నోరు మెదపని వాడి వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా?
విద్య లేకుండా, నైతికత లేకుండా కేవలం అబద్దపు ప్రచారాలతో చరిత్రలో మహోన్నతమైన స్థానం సంపాదించుకోగలడా?
మోడీ మోసాల గురించి, అక్రమ సంబంధాల గురించి వారి సొంత పార్లమెంట్ మెంబరు సుబ్రహ్మణ్యస్వామి బయట పెడుతూ ఉంటే, వాటికి మోడీ వివరణ ఇవ్వాలి కదా?
ఒకప్పుడు మోడీ మీద పుస్తకం రాసిన రచయిత్రి మధు పూర్ణిమ కిశ్వర్, ఆయన రహస్యాలన్నీ బహిరంగంగా చెపుతూ ఉంటే వ్యక్తిత్వం ఉన్న వారు ఎవరైనా వివరణ ఇచ్చుకుంటారు కాదా?
నోరు మూసుకుని ఉన్నాడంటే ఆయన దగ్గర సమాధానాలు లేవని అర్థం. ఈ సమాధానాలు కూడా ఎవరైనా టైప్ చేసి టెలిప్రాంప్టర్‌లో పెడితే అప్పుడు ‘మిత్రో’ అని చదువుతాడు కాబోలు.
దొంగ సర్టిఫికేట్లు పెట్టి, ఎలక్షన్ అఫిడవిట్ పూర్తి చేసిన నరేంద్ర దామోదర్ దాస్ మోడీ డిగ్రీ, పీజీ సర్టిఫికేట్లు పరిశీలించి, నిజాలు వెల్లడించాలని కొన్ని లక్షల మంది ప్రజలు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌కు ఉత్తరాలు రాశారు.
ప్రపంచ దేశాలలో ఏ ప్రధానిని గురించి ఏ దేశ ప్రజలూ ఇలా చర్యలు తీసుకోవాలంటూ కోర్టును ఆశ్రయించలేదు.
ఇది ఇక్కడే ఎందుకు జరిగిందీ అంటే, ఆరెస్సెస్-బీజేపీలు కలిసి దేశ ప్రజల్ని మోసగిస్తున్నాయని స్పష్టంగా తెలుస్తూ ఉంది.
ఆరెస్సెస్ ఒక రిజిస్టర్ కాని సంస్థ. అందుకే దాన్ని వెంటనే ‘బ్యాన్’ చెయ్యాలని కర్ణాటక రాష్ట్ర మంత్రి గట్టిగా పట్టుబట్టాడు.
బీజేపీ పాలనలో ఆర్థిక, సామాజిక పరిస్థితి
మోడీ 12 ఏళ్ళ ‘వికసిత్ భారత్’ ఇలా ఉంది: దేశానికి 191 లక్షల కోట్ల అప్పులు పెరిగాయి. 140 కోట్ల భారతీయుల తలలపై ఈ అప్పు భారం పడుతుంది. అప్పుడు ఒక్కొక్కరికి 1.80 లక్షల అప్పు మిగులుతుంది(ఒక్కొక్క అకౌంట్లో 15 లక్షల సంగతి మరిచిపోండి). అంటే ఆర్థిక వ్యవస్థ ఎంత ఛిన్నాభిన్నం అయ్యిందో తెలుస్తూ ఉంది కదా?
ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలేవీ లేవు మరిచిపోండి. నిరుద్యోగం 25 శాతం పెరిగి, ఈ విషయంలో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.
ఇక నిత్యావసర వస్తువులు చూస్తే అవి 300 శాతం పెరిగాయి. ఈ దేశంలో మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘనత మోడీ ప్రభుత్వానిదే, కనీసం మణిపూర్ వెళ్లి వారిని పరామర్శించి వద్దామన్న స్పృహ కూడా ఆయనకు లేదు.
సంవత్సరానికి 5 లక్షల మంది మహిళలపై లైంగిక దాడులు జరుగుతూ ఉంటే కిమ్మనడం లేదు. కారణం ఆయనదీ ఆయన సహచర సభ్యులదీ అదే సంస్కృతి కదా? ఇది మనం అంటున్న మాట కాదు. వారి పార్టీ సభ్యులే చెపుతున్న మాట.
గత 12 సంవత్సరాలలో 329 లక్షల కోట్ల అధిక పన్నులు వసూలు చేశారు. ప్రతి సంవత్సరం 12 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉంది.
హిందూ-ముస్లిం అంటూ జనాల మధ్య చిచ్చుపెట్టడం, విద్వేష ప్రసంగాలు చేయడం తప్ప, వీరి పనితనం మరి దేనిలోనూ కనిపించదు. మైనార్టీలు ఈ దేశ పౌరులు కానట్టు ఈసడించుకున్నారు.
ఊచకోత కోశారు. ఇకపోతే 12 ఏళ్ళలో లెక్కలేనన్ని పేపర్ లీకులు. చరిత్రను వక్రీకరించి పుస్తకాలు రాయించడం, సిలబస్‌లు మార్చి రాబోయే తరాల వారి భవిష్యత్తును అంధకారం చేయడం.. ఆరెస్సెస్-బీజేపీ పాలనలో జరిగిన అభివృద్ధి, ప్రజా సంక్షేమం గురించి ఎవరు మాత్రం ఏం చెప్పగలరు?
ఎవరిని కదిలించినా జరిగిన, జరుగుతున్న, జరగబోతున్న విధ్వంసం గురించి గంటల తరబడి చెప్పగలరు.
ఆరెస్సెస్, బీజేపీల ద్వంద్వ వైఖరి
మీకు ఇక్కడ స్వాతంత్ర్య పోరాట కాలం నాటి ఒక చిన్న సంఘటన గుర్తుచేస్తాను. కాన్పూర్‌లో అజీజాన్ బాయి అనే వేశ్య ఉండేది.
1857 స్వాతంత్ర్య పోరాట కాలంలో ఆమె “మస్తానీ” అనే ఒక వేశ్యల సంఘాన్ని ఏర్పాటు చేసి వారినందరినీ స్వాతంత్ర్య పోరాటంలోకి రావల్సిందిగా ప్రోత్సహించింది. వారు తాము సంపాదించుకున్న సంపదను, వెండి బంగారు ఆభరణాల్ని నానాజీ పేష్వా అనే స్వాతంత్ర్య యోధుడి ద్వారా స్వాతంత్ర్య పోరాట యోధుల నిధికి పంపించారు. ఆ తర్వాత స్వయంగా పోరాటంలోకి దూకారు.
కొంత కాలానికి బ్రిటీషు వారి కాల్పులకు బలై, వారంతా దేశం కోసం అమరులయ్యారు. ఇప్పుడు చెప్పండి. మీకేమనిపిస్తోంది?
వేశ్యల వ్యక్తిత్వం-త్యాగం గొప్పదా? స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనకుండా బ్రిటీషు వారి బూట్లు శుభ్రం చేస్తూ గడిపిన సంఘ్ పరివార్ నాయకుల వ్యక్తిత్వం గొప్పదా?
ఈ దేశానికి ఎవరి వల్ల లాభం జరిగింది? ఆ బానిస మనస్తత్వాన్నే మోడీ ఇప్పటికీ కొనసాగిస్తున్నాడా లేదా? ఆలోచించి చూడండి.
అందువల్ల దేశవాసులారా, బండిని గాడిద లాగలేకపోతే, మీరేం చెయ్యాలి? గాడిదను మార్చాలి. కానీ మీరు అనవసరంగా చక్రాలు మారుస్తున్నారు. దానివల్ల ఫలితం ఉండదు. బరువు లాగలేని చేతగానితనం ఎవరిదో అది గుర్తించండి.
2026 జూన్ 16 మంగళవారం రోజు ఆరెస్సెస్, బీజేపీల అవినీతి మరొకటి బయటపడింది. అయోధ్య రామమందిరం ధర్మసేన అధిపతి సంతోష్ దూబే ఆలయ ట్రస్ట్ సభ్యులు 200 కోట్లు స్వాహా చేశారని కంప్లయింట్ ఫైల్ చేశాడు. అది 200 కోట్లు కాదు, 1400 కోట్ల దోపిడి అని యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ అంటున్నారు. దానిలో జ్ఞానేష్ కుమార్, యోగి ఆదిత్యనాథ్, మోడీల పాత్ర కూడా ఉందన్న వాదన బయటికొచ్చింది. మరి విచారణ జరిపించి వాస్తవాలు వెల్లడించే ధైర్యం ఈ ప్రభుత్వాలకు ఎందుకు లేదు?
ఈ ఆరెస్సెస్, బీజేపీలు రాజ్యాంగాన్ని తొలగించి మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని, దేశాన్ని ‘హిందూ రాష్ట్ర’గా మార్చాలనీ తెగ ఉబలాట పడుతున్నారు కదా? అంతకు ముందు వారు మరికొన్ని పనులు చేయాల్సి ఉంటుంది.
మనుధర్మ శాస్త్రం ప్రకారం అత్యున్నత స్థానంలో శూద్రుడు ఉండకూడదు కదా? 12 ఏళ్ళ క్రితమే ఒక బ్రాహ్మణుడిని ప్రధానిగా చేయాల్సింది. మోడీ బ్రాహ్మణుడు కాదు.
మరో విషయమేమంటే ఆరెస్సెస్, బీజేపీ, అనుబంధ సంస్థల వారి ఇళ్ళల్లో భర్తలు చనిపోయిన ఆడవాళ్ళు ఉన్నారేమో, వారిని ఇంకా ఎందుకు ఉంచారు?
ఈపాటికి అప్పుడే ‘సతీసహగమనం’ చేయించాల్సింది కదా? ముందు ఆ పని చేసి, తర్వాత మాట్లాడండి. మీరు మనుధర్మ శాస్త్రం అమలు చేయాలంటే ముందు మీరు చేసి చూపండి.
ఇకపోతే ఆరెస్సెస్-బీజేపీ-అనుబంధ సంస్థల వారు ముస్లింలను అల్లుళ్ళుగా ఎందుకు తెచ్చుకున్నారు? ముందు మీ కూతుళ్ళకు వారితో విడాకులిప్పించి, అల్లుళ్ళను పాకిస్థాన్ పంపించి అప్పుడు మాట్లాడండి.
విదేశాంగ మంత్రి జయశంకర్ భారతీయ సంప్రదాయానికి విరుద్ధంగా వెళ్లి ఒక జపాన్ మహిళను ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? అపచారం కదా?
ఆరెస్సెస్-బీజేపీ అనుబంధ సంస్థల వారు వారి సంతానాన్ని సరస్వతీ విద్యా మందిరాల్లో చదివించుకోకుండా విదేశాల్లో ఎందుకు చదివించారు? క్షమించరాని నేరం కదా? అంటే మీరు మాత్రం మీకు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తారు. సామాన్యులకు మాత్రం ఆంక్షలా?
సామాన్యుల పిల్లలు చదువుల్లేక, ఉద్యోగాల్లేక, ‘జై శ్రీరామ్’ అంటూ మీరు చెప్పిన నినాదాలిస్తూ జీవితాలు నాశనం చేసుకోవాలా? ముందు మీ అదానీ, అంబానీ కొడుకుల్ని, మనుమల్ని ‘జై శ్రీరామ్’ అంటూ రోడ్డెక్కమనండి.
ఆ తర్వాత, తర్వాతి సంగతి ఆలోచిద్దాం. మీరు చెప్పే సిద్ధాంతాలు మీకు కాదా? అమాయకులైన సామాన్యులకేనా? ఇదేం పద్ధతి?
ఉద్యమిస్తున్న యువత
అందుకే యువత తిరగబడుతూ ఉంది. ఇంకా మీ ఆటలు సాగవంటే సాగవు. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికెక్కగలదా అన్నట్టు మీకు నెహ్రూతో పోలిక కావల్సి వచ్చిందా? అని అనుకున్న నేటి తరం, ప్రశ్నను ప్రజాస్వామ్యాన్ని, వైజ్ఞానిక స్పృహను నిలబెడుతూ, పాలకుల జవాబుదారీతనాన్ని ఎండగడుతూ ఢిల్లీ జంతర్ మంతర్ నిరసనను విజయవంతం చేసుకుంది.
కేంద్ర విద్యామంత్రి రాజీనామా చేసే విధంగా ఒత్తిడి చేసి, విజయం సాధించింది.
‘ఓట్ చోరీ’ చేసి అధికారంలో కొనసాగుతున్న బీజేపీని ఇక ‘సర్-కస్’ చాలించమని మళ్ళీ ఇప్పుడు ఉద్యమిస్తోంది.
ప్రతిపక్ష పార్టీలు కూడా వీరి ఉద్యమాన్ని బలపరుస్తున్నాయి. జ్ఞానేష్ కుమార్ రాజీనామానే కాదు, మోడీ షాలు కూడా దిగిపోవాలని నినదిస్తున్నారు.
దేశ పౌరుల్లో ముఖ్యంగా యువతీ యువకుల్లో భయాన్ని పారద్రోలిన కాక్రోచ్ జనతా పార్టీ, అది అందించిన స్ఫూర్తి ఇప్పుడు దేశవ్యాప్తమైంది. ఇక మార్పు తప్పదు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
