కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్ద చేసి, ఇచ్చిన హమీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం వందలాది మంది కార్మికులు ధర్నా చేశారు. సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటి ఇచ్చిన 25,26 తేదీలలో రెండు రోజుల మల్టిపుల్ డేస్ మహా ధర్నా కార్యక్రమం నగరంలోని ఇందిరా పార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్‌లో ప్రారంభమైంది. సిఐటియు అనుబంధ సంఘాల నుంచి కార్మికులు, ఉద్యోగులు, ఉపాధాయులు, శ్రేయోభిలాషులు రాష్ట్ర నలుమూలల నుంచి ధర్నాలో పాల్గొన్నారు.
కనీస వేతనాన్ని రు.42 వేలకు పెంచి ఉద్యోగ, సాజిక భద్రతను కల్పించాలని,ప్రభుత్వం రంగ సంస్థలను పరిరక్షించాలని,పిఎఫ్, ఈఎస్ఐ,బోనస్, డిఏను అమలు చేయాలని, కూడా వారు డిమాండ్ చేశారు. దేశం, రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు కూడా పోరాటాన్ని కోనసాగించాలని ఈ సందర్భంగా ధర్నా నుద్దేశించి ప్రసంగించిన సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు.
సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు:
దేశంలో సుదీర్ఘ పోరాటాల ద్వారా కార్మిక వర్గం సాధించుకున్న హక్కులను ఈ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తు సంపదనంతా ప్రైవేటు శక్తులకు ధారాదత్తం చేస్తున్న విషయాన్ని గమనించాలని చుక్క రాములు కోరారు. దేశం,ప్రజలు,కార్మికులు, రైతుల, యువకులు, విద్యార్ధుల శ్రేయస్సు గురించి ఏ మాత్రం పట్టింపు లేకుండా అనుసరిస్తున్న ఇలాంటి ప్రమాదకరమైన విధానాలను ప్రశ్నిస్తు, ఎండగడుతున్న వారిని అణిచివేస్తు వారిపై దాడులు జరుపుతు జైళ్లలో నిర్భందిస్తున్న ప్రభుత్వ తీరు పై ధ్వజమెత్తారు.
సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడుతు,దేశానికి ఆర్ధిక స్వాలంభనను సాధించి పెట్టిన ప్రభుత్వ రంగ సంస్థలను ముక్కలు ముక్కలు చేస్తు ప్రైవేటుపరం చేస్తున్నాయని అన్నారు. షేర్ మార్కెట్ మాదిరిగా ప్రభుత్వ రంగాన్ని ముఖ్యంగా విద్యుత్ రంగాన్ని విద్యుత్ ఉత్పత్తికి కావల్సిన బొగ్గను షేర్ మార్కెట్‌గా మార్చేసి, రాష్ట్రంలో ఉన్న సింగరేణి బొగ్గు గనుల సంస్థను కూడా ప్రవేటు పరం చేయడానికి ,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రయత్నిస్తున్నాయని, భాస్కర్ చెప్పారు.
దేశాన్ని కాపాడుతన్న రక్షణ సంస్థలు అవి ఉత్పత్తి చేస్తున్న ఆయుధాల తయారిని, ఆర్&డి విభాగాలను సైతం ప్రైవేటు పరం చేస్తున్నాయని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుపరిస్తున్నఇలాంటి ప్రమాదకరమైన విధానాలకు వ్యతిరేకంగా డిసెంబర్ 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు మూడు రోజుల పాటు ఢిల్లీలో జరపతల పెట్టిన మహా ధర్నా కార్యక్రమంలో రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని,భాస్కర్ కోరారు.
ఆర్టిసి స్టాఫ్ & వర్కర్స్ ఫెడరేషన్ నాయకులు వీరాంజనేయులు , తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య పలువురు సిఐటియు రాష్ట్ర నాయకులు,అనేక సంఘాల ప్రతినిధులు కూడా ప్రసంగించిన వారిలో ఉన్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
