♦ దక్షిణ బీరుట్లో నివాస భవనాలపై ఇజ్రాయెల్ దాడి
♦ ఇద్దరు లెబనాన్ పౌరుల మృతి
కాల్పుల విరమణ విషయాన్ని అమెరికా పరిశీలిస్తున్నప్పటికీ- ఇరాన్, లెబనాన్‌లపై తమ దాడులను కొనసాగిస్తామని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నారు.
యుద్ధం ముగింపుపై ఇరాన్‌తో అమెరికా చర్చిస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే ఇజ్రాయెల్-అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ క్షిపణులు, డ్రోన్లు ఇజ్రాయెల్, గల్ఫ్ అరబ్ దేశాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేశాయి. దీంతో మధ్య టెల్ అవీవ్ నుంచి దట్టమైన పొగలు ఎగసిపడ్డాయి.
మరోవైపు అమెరికా-ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల వల్ల చిన్నపిల్లలు మొదలు మహిళలు, వృద్ధుల వరకు చాలామంది ఇరాన్, లెబనాన్ పౌరులు చంపబడ్డారు.
లెబనాన్‌లోని దక్షిణ బీరుట్లో నివాస భవనాలపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడులలో ఇద్దరు లెబనాన్ పౌరులు చనిపోయారు. పలువురు తీవ్ర గాయాలపాలయ్యారు.

గడువు పొడిగింపు – మార్కెట్లకు ఊరట
నౌకల రాకపోకల కోసం వ్యూహాత్మక హోర్ముజ్ జలసంధిని తెరవాలని, లేకుంటే వైమానిక దాడులతో విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తామని ఇరాన్‌కు విధించిన గడువును కూడా ట్రంప్ వాయిదా వేశారు. దీంతో చమురు ధరలు స్వల్పంగా దిగివచ్చి, స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
