ఏప్రిల్ 15న బహిర్గతమైన ఈ సర్వే నివేదిక ప్రకారం, రాష్ట్రంలో ఒక్కో కుటుంబానికి సగటున ఉన్న సాగునీటి(నీటిపారుదల) భూమి 0.7 ఎకరాలుగా ఉంది.
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణన ప్రకారం, రాష్ట్ర మొత్తం జనాభాలో 4.8 శాతంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గం 13.5 శాతం భూమిని కలిగి ఉంది.
ఆ తర్వాత 5.7 శాతం జనాభా ఉన్న యాదవ సామాజిక వర్గం 8.7 శాతం భూమిని కలిగి ఉంది.
ఏప్రిల్ 15న వెల్లడించిన సర్వే నివేదిక ప్రకారం, రాష్ట్రంలో ఒక్కో కుటుంబానికి సగటున 0.7 ఎకరాల సాగునీటి భూమి ఉంది.
బీసీ-బీ పెరిక, వెలమ, రెడ్డి కులాలు మినహా, మిగతా అన్ని కులాలు రాష్ట్ర సగటు కంటే తక్కువ సాగునీటి భూమిని కలిగి ఉండటం గమనించవచ్చు.
చారిత్రక నేపథ్యం – భూ పంపిణీలో అసమానతలు..
“అత్యున్నత స్థానంలో, వారి జనాభాతో పోలిస్తే రెడ్డి సామాజిక వర్గం అత్యధిక భూమిని కలిగి ఉంది. ఇది భూమిని కూడబెట్టుకోవడంలో వారికి ఉన్న చారిత్రక ప్రయోజనాలను(అనుకూలతలను) సూచిస్తుంది. ఆ తర్వాత వెలమలు, ఎస్టీ కోయలు ఉన్నారు. దీనికి విరుద్ధంగా, ఎస్సీ బేడలతోపాటు జనరల్ కేటగిరీ ముస్లింల వంటి వర్గాలు వారి జనాభా వాటాతో పోలిస్తే చాలా తక్కువ భూమిని కలిగి ఉన్నారు. ఇది భూ ఆస్తులకు సంబంధించి వారు చారిత్రకంగా ఎదుర్కొన్న వివక్షతను ప్రతిబింబిస్తోంది” అని నివేదిక పేర్కొంది.
వాహన యాజమాన్యం: అగ్రవర్ణాలు వర్సెస్ అట్టడుగు వర్గాలు..
ఓబీసీ కులాలతో పోలిస్తే జనరల్(ఓసీ) కులాల కుటుంబాల్లో కారు కలిగిన వారి శాతం మూడు రెట్లు ఎక్కువ అని, అలాగే షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీలు), షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీలు) కంటే ఇది ఐదు రెట్లు ఎక్కువ అని తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల(SEEEPC) సర్వే-2024 వెల్లడించింది.
కారు కలిగిన కుటుంబాల్లో అత్యధిక శాతం(16.4 శాతం) బ్రాహ్మణులే ఉన్నారు, ఇది రాష్ట్ర సగటు కంటే ఐదు రెట్లు ఎక్కువ.
ఇతర ఓసీ వర్గాలైన రాజులు, కమ్మ, కాపు, కోమటి, వెలమ, జైనులు కూడా అధిక స్థాయిలో కార్ల యాజమాన్యాన్ని నమోదు చేశారు.
ఇది వారి సాపేక్ష సంపద, ఆర్థిక భద్రతను సూచిస్తుందని సర్వే తెలిపింది.
దీనికి విరుద్ధంగా, అత్యంత అట్టడుగు వర్గాల్లో కారు యాజమాన్యం దాదాపుగా శూన్యం. ఎస్టీ కోలాంలలో ఈ సంఖ్య చాలా తక్కువగా కేవలం 0.2 శాతంగా నమోదు కాగా, ఎస్టీ గోండ్లు, ఎస్టీ కోయల వంటి ఇతర గిరిజన వర్గాలు కూడా సగటు స్థాయి కంటే గణనీయంగా వెనుకబడి ఉన్నాయి.
తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వే – ఒక సమగ్ర నివేదిక..
వాడుక భాషలో ‘కులగణన’గా పిలువబడే ఈ తెలంగాణ సామాజిక-ఆర్థిక సర్వే- 3.55 కోట్ల మంది ప్రజల స్థితిగతులు, భావోద్వేగాలు, అనుభవాలు, ఆశల రికార్డు. ప్రతి వ్యక్తికి సంబంధించి 75 అంశాల ద్వారా సేకరించిన సమాచారం ‘తెలంగాణ సమాజపు ఆరోగ్య స్థితి’పై లోతైన అవగాహనను అందిస్తుంది.
ఆస్తులు, భూముల యాజమాన్యం – వెనుకబాటుతన సూచిక..
కులగణన నివేదికలను విశ్లేషించిన మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్ రెడ్డి నేతృత్వంలోని స్వతంత్ర నిపుణుల కార్యనిర్వాహక బృందం ప్రకారం- తెలంగాణలో భూమి, ఆస్తుల యాజమాన్యంలో వెలమ, రెడ్డి, కమ్మ, కోమటి(వైశ్య), కాపు, జైనుల వంటి అగ్రవర్ణాలు ముందు వరుసలో ఉన్నాయి.
అయితే వీరశైవ, మున్నూరుకాపు వంటి కొన్ని బీసీ కులాలు- అయ్యంగార్లు, రాజులు(క్షత్రియులు), బ్రాహ్మణుల వంటి కొన్ని కులాల కంటే మెరుగైన స్థితిలో ఉండి, తమ మెరుగైన ఆర్థిక స్థితిని సూచిస్తున్నాయి.
భూమి, ఆస్తుల యాజమాన్య వెనుకబాటుతన సూచికలో, వెలమ, రెడ్డి, కమ్మ, కోమటి, కాపు, జైనుల వంటి అగ్రవర్ణాలు అతి తక్కువ వెనుకబాటుతనాన్ని చూపుతున్నాయని ఆ బృందం పేర్కొంది.
ఈ కులాలు సాంప్రదాయకంగా బలమైన వ్యవసాయ, వాణిజ్య నేపథ్యాలను కలిగి ఉన్నాయని, తద్వారా వారు గణనీయమైన భూమి, ఆస్తుల యాజమాన్యాన్ని కలిగి ఉన్నారని బృందం స్పష్టం చేసింది.
బీసీ కేటగిరీకి చెందిన షేక్ ముస్లింలు, ఎస్సీ క్రైస్తవులు, చిప్పోలు(మేర), పిచ్చిగుంట్ల, ఆరెకటిక, దూదేకుల, ఎస్సీ మాదిగలు భూమి, ఆస్తుల యాజమాన్యంలో అత్యంత వెనుకబడిన వర్గాలలో ఉన్నారని నివేదిక వెల్లడించింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
