భిన్నాభి ప్రాయాలపై ఆంక్షల నేపథ్యంలో భారతదేశంలో ప్రజాస్వామ్యానికి అవకాశం కుంచించుకు పోతోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అన్నారు.
స్పష్టంగా చట్టవిరుద్ధం కాని చర్యలకు నిరసనకారులు అరెస్టులు, భావప్రకటనా స్వేచ్ఛపై ఆంక్షలను ఎదుర్కొంటు న్నందున భారత దేశ ప్రజాస్వామ్య పరిధి కుంచించుకు పోతోందని జస్టిస్ భూయాన్ హెచ్చరించారు.
న్యూఢిల్లీ: భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యతిరేక గళం విప్పే అవకాశం తగ్గిపోతోందని సుప్రీం కోర్టు న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ అన్నారు. నిరసన తెలిపేందుకు, తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు ఉన్న ప్రాథమిక హక్కులను వినియోగించు కుంటున్న విద్యార్థులు, కార్యకర్తలు, సాధారణ పౌరులను నేరస్థులు గా పరిగణిస్తు న్నారని ఆయన అన్నట్లు లైవ్ లా నివేదించింది.
భోపాల్ లోని నేషనల్ లా ఇన్స్టి ట్యూట్ యూనివర్సిటీ (NLIU)లో జరిగిన 5వ జస్టిస్ జి.పి. సింగ్ మెమోరియల్ లెక్చర్ లో మాట్లాడుతూ, జస్టిస్ భూయాన్, శాంతియుత చర్చ, భిన్నాభి ప్రాయాలు ప్రజాస్వామ్యానికి సారాంశ మని, అయితే వాటిని అరెస్టులు, సుదీర్ఘ జైలు శిక్షలు, కఠినమైన బెయిల్ షరతులతో ఎక్కువగా ఎదుర్కొంటు న్నారని అన్నారు.
“సేవలో ఉన్న ఒక భారత సైనికాధి కారిని ‘ఉగ్రవాది కుమార్తె’ అని పిలిచిన మంత్రి ప్రవర్తనపై ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టినందుకు, అతనిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అతను ముందస్తు బెయిల్ కోరవలసి వచ్చింది. బెయిల్ మంజూరైంది. కానీ కోర్టు ఏం చేస్తుంది? అతను పారిపోయే ప్రమాదం కూడా లేనప్పుడు, అతని పాస్పోర్ట్ ను డిపాజిట్ చేయమని అడుగుతుంది. (ఆ తర్వాత ఫేస్బుక్ లో ఏమీ పోస్ట్ చేయవద్దు అని చెబుతుంది)” అని జస్టిస్ భూయాన్ అన్నట్లు లైవ్ లా పేర్కొంది.
క్యాంపస్ లలో నిరసన తెలుపుతున్న విద్యార్థులకు సుదీర్ఘకాలం పాటు బెయిల్ ను నిరాకరిస్తున్న ఉదంతా లను ఆయన ప్రశ్నించారు. భావప్రకటనా స్వేచ్ఛను అణచి వేసే బెయిల్ షరతులను విధిస్తున్నందుకు కోర్టులను విమర్శించారు. ఇఫ్తార్ కోసం గంగానదిలో పడవ పై గుమిగూడిన యువకుల కేసును ప్రస్తావిస్తూ, “గంగానది పై చికెన్ తినడాన్ని నిషేధించే చట్టం ఏదీ లేదు. సరిగ్గా అదే కారణంతో వారిని అరెస్టు చేసి, మూడు నెలల పాటు జైలులో ఉంచాల్సి వచ్చింది. ఇలాంటి చర్యకు పాల్పడి నందుకు ప్రజలను అరెస్టు చేసి, మూడు నెలల పాటు బెయిల్ నిరాకరించ వచ్చా అని నన్నే నేను ప్రశ్నించు కుంటున్నాను! పౌరులు గమనిస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు” అని ఆయన అన్నారు.
ముంబైలో పాలస్తీనా అనుకూల ప్రదర్శనకు అనుమతి నిరాకరించ డాన్ని న్యాయమూర్తి మరింతగా విమర్శిస్తూ, విశ్వవిద్యా లయాలు విద్యార్థుల క్రియాశీలతను శిక్షించేవి గా కాకుండా, విమర్శనాత్మక ఆలోచన, చర్చలను ప్రోత్సహించే వేదికలుగా ఉండాలని అన్నారు.
“భారత్ పాలస్తీనా ను గుర్తించింది. భారతదేశంలో పాలస్తీనా రాయబార కార్యాలయం ఉంది. సంప్రదాయబద్ధంగా, భారత్ ఎల్లప్పుడూ పాలస్తీనా ను గుర్తిస్తూ నే వచ్చింది. అయినప్పటికీ అక్కడ జరుగుతున్న దానికి వ్యతిరేకంగా, అది ఒక జాతి నిర్మూలన అని ప్రకటించాలని కోరుతూ దక్షిణాఫ్రికా నే అంతర్జాతీయ న్యాయ స్థానాన్ని ఆశ్రయించింది. గాజా లోని హింసపై విచారణ జరిపేందుకు ఐక్యరాజ్య సమితి, ఒరిస్సా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మురళీధర్ ను నియమించింది. ప్రభుత్వం పిల్లలు, మహిళలు, వృద్ధులపై జరిపిన హింస గురించి ఆయన ఒక నివేదికను సమర్పించారు. దానిని ఐక్యరాజ్యసమితి ఆమోదించింది. అది ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంది,” అని జస్టిస్ భూయాన్ సభికులకు తెలిపారు.
గాజా విషయమై, భారతదేశం వెలుపల జరుగుతున్న సంఘటనలపై ప్రజలు ఎందుకు నిరసన తెలపాలని కోరుకుంటున్నారని ఒక న్యాయమూర్తి ప్రశ్నించడం తనకు “చాలా వినోదా త్మకంగా” అనిపించిందని ఆయన అన్నట్లు బార్ అండ్ బెంచ్ నివేదించింది.
అధికారాల విభజన సూత్రం గురించి ప్రస్తావిస్తూ, పదవీ విరమణ చేసిన న్యాయ మూర్తులు పదవి నుంచి వైదొలిగిన వెంటనే రాజకీయాల్లోకి ప్రవేశించడం పట్ల జస్టిస్ భూయాన్ హెచ్చరించారు. అటువంటి చర్యలు న్యాయవ్యవస్థ, కార్య నిర్వాహక వ్యవస్థ మధ్య ఉన్న రాజ్యాంగ పరమైన వ్యత్యాసాన్ని మసక బారుస్తాయని ఆయన అన్నారు. కాల పరీక్షకు నిలిచిన తీర్పుగా అభివర్ణిస్తూ, సుప్రీంకోర్టు చారిత్రాత్మక కేశవానంద భారతి తీర్పును ఆయన సమర్థించారు. అదే సమయంలో, దాని న్యాయశాస్త్ర పరమైన చట్ట బద్ధతను ప్రశ్నిస్తున్న బహిరంగ వ్యాఖ్యలను విమర్శించారు.
“ఒకే చోట రెండు కాళ్లు ఉంటే, బల్ల కూలిపోతుంది. ఇది ప్రాథమిక సూత్రం. అందువల్ల, న్యాయవ్యవస్థ, కార్య నిర్వాహక వ్యవస్థ మధ్య అంతరాన్ని పూడ్చేందుకు తాను రాజ్యసభకు వెళ్తున్నానని భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి చెప్పడం ప్రాథమికంగా తప్పు. ఇది అధికారాల విభజన సూత్రాలకు విరుద్ధం,” అని ఆయన అన్నట్లు బార్ అండ్ బెంచ్ నివేదించింది
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
