రెండు అతిపెద్ద భారతీయ సంస్థలు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్(ఆర్ఐఎల్) వరుసగా ఏడవ, ఎనిమిదవ స్థానాల నుంచి 11వ, 12వ స్థానాలకు పడిపోయాయి.
నెల రోజుల్లోనే అత్యంత భారీగా ఒక్కరోజులో భారత రూపాయి క్షీణించింది. డాలర్‌తో పోలిస్తే 77 పైసలు పడిపోయి 95.71కి చేరింది.
అదే సమయంలో డాలర్ ఇండెక్స్ కూడా 100.21కి పెరిగి, చివరకు 99.89 వద్ద స్థిరపడిందని ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది.
ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరంలో రూపాయి 6.5% క్షీణించింది. గత సంవత్సరం 10.4% క్షీణించింది.
ఇదిలా ఉండగా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరిగిన తాజా దాడుల నేపథ్యంలో సోమవారం చమురు ధరలు కూడా 4% పెరిగాయి.
అంతకుముందు, భారత రిజర్వ్ బ్యాంక్ జూన్ 5న, ప్రభుత్వ సెక్యూరిటీలలోకి విదేశీ పెట్టుబడులపై పన్ను కోతతో పాటు, పడిపోతున్న రూపాయికి మద్దతు ఇవ్వడానికి అనేక చర్యలను ప్రకటించింది.
గత సంవత్సరం నుంచి రూపాయి విలువ క్రమంగా క్షీణిస్తూ, డాలర్‌కు 100 మార్క్‌కు చేరువవుతోంది. పడిపోతున్న రూపాయిపై నిపుణులు, ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎంఎస్సీఐ ఇండెక్స్‌లో భారతీయ కంపెనీలకు నిరాశ..
మరోవైపు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్టాక్‌ల విజృంభణ కారణంగా, రెండు దశాబ్దాలకు పైగా కాలంలో తొలిసారిగా, విస్తృతంగా ట్రాక్ చేయబడే ఎంఎస్సీఐ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్‌లోని టాప్ 10 జాబితా నుంచి దేశీయ కంపెనీలు బయటకు నెట్టివేయబడ్డాయని బిజినెస్ స్టాండర్డ్ పేర్కొన్నది. ఇది భారతీయ కంపెనీలకు నిరాశాజనకమైన పరిణామం.
2000 సంవత్సరం తర్వాత ఇండెక్స్‌లోని టాప్ 10 స్టాక్స్‌లో ఏ భారతీయ కంపెనీ కూడా చోటు దక్కించుకోకపోవడం ఇదే మొదటిసారి అని బిజినెస్ స్టాండర్డ్ పేర్కొంది.
ఈ సూచిక, ప్రపంచవ్యాప్తంగా 700 బిలియన్ డాలర్లకు పైగా నిధులను నిర్వహిస్తున్న పాసివ్ ఫండ్స్‌కు ఒక బెంచ్‌మార్క్‌గా పనిచేస్తుంది.
యాక్టివ్‌గా నిర్వహించబడే ఈఎం ఫండ్స్ కూడా దీనిని నిశితంగా గమనిస్తూ ఉంటాయి.
ఏఐ బూమ్ దెబ్బకు దిగజారిన ర్యాంకులు..
ప్రస్తుతం, ఇండెక్స్‌లోని రెండు అతిపెద్ద భారతీయ సంస్థలైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మార్చిలో వరుసగా ఏడవ, ఎనిమిదవ స్థానాల నుంచి 11వ, 12వ స్థానాలకు పడిపోయాయి.
ఈ సంవత్సరం వాటి షేర్ ధరలలో బలహీనత తరువాత, సూచీలో వాటి వ్యక్తిగత వెయిటేజీలు కూడా 0.8% కంటే తక్కువకు పడిపోయాయి.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఆర్టీఎల్ షేర్లు వాటి గరిష్ట స్థాయిల నుంచి వరుసగా సుమారు 26%, 20% తగ్గినప్పటికీ, తైవాన్ సెమీకండక్టర్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ(టీఎస్ఎంసీ), శాంసంగ్ ఎలక్ట్రానిక్స్, ఎస్కే హైనిక్స్ వంటి ఏఐ (AI)-అనుబంధ దిగ్గజాలు అదే కాలంలో వరుసగా 48%, 147%, 194% పెరిగాయి.
ఏఐ బూమ్ స్టాక్స్‌తో ప్రస్తుతం తైవాన్, దక్షిణ కొరియా, చైనా కలిసి బెంచ్‌మార్క్‌లో సుమారు 70% వాటాను కలిగి ఉన్నాయి. అయితే ఏఐ లబ్ధిదారులైన టీఎస్ఎంసీ, శాంసంగ్ ఎలక్ట్రానిక్స్, ఎస్కే హైనిక్స్ సమిష్టిగా దాదాపు 30% వాటాను కలిగి ఉన్నాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
