Illustration: October 30 International Dockworkers Strike
మద్దతును తెలియజేసిన ట్రేడ్ యూనియన్ ఇంటర్నేషనల్ (ట్రాన్స్పోర్ట్, పోర్ట్స్, ఫిషరీస్, కమ్యూనికేషన్స్) WFTUవిభాగం.
2026 అక్టోబర్ 30 న, సామ్రాజ్యవాద యుద్ధాలు, దిగ్బంధనాలు, సైనికీకరణ, ఓడరేవుల ఆటోమేషన్‌కు వ్యతిరేకంగా అంతర్జాతీయ డాకర్ల (ఓడరేవు కార్మికుల) సమ్మెకు మద్దతు, సంఘీభావం తెలియజేయండి.
పాలస్తీనాలో జరుగుతున్న మారణహోమం కోసం ఉద్దేశించిన సైనిక పరికరాలను మోసుకెళ్లేం దుకు, రవాణా చేయడానికి నిరాకరిస్తూ వరుస సమ్మెల తర్వాత, WFTU యొక్క TUI TPFCకి అనుబంధంగా ఉన్న చాలా వరకు డాకర్ల సంఘాలు, మధ్యధరా సముద్ర తీరం వెంబడి ఉన్న 20కి పైగా ఓడరేవులలో ‘యుద్ధం కోసం డాకర్లు పని చేయరు!’ అనే నినాదంతో ఫిబ్రవరి 6 న ఏకకాలంలో సమ్మెను నిర్వహించాయి.
అక్టోబర్ 30 న జరగబోయే ఈ ఉద్యమం యొక్క భారీ విస్తరణను స్వాగతించింది. అనేక ఇతర డాకర్ల సంఘాలు కూడా ఈ సమ్మెలో పాల్గొనడం హర్షణీయం.
ఈ సమ్మెలో 4 ఖండాలలోని దాదాపు 100 ఓడరేవులలో జరగనుంది. ఇది నిజమైన అంతర్జాతీయ ఉద్యమంగా మారింది.
ఫ్రాన్స్, ఇటలీ, పోర్చుగల్, బెల్జియం, అల్బేనియా దేశాలలో జీవన వ్యయం విపరీతంగా పెరగడానికి వ్యతిరేకంగా, వేతనాలు, గృహ వసతి, ఆరోగ్యం, విద్య కోసం కార్మికులు, యువకులు చేస్తున్న భారీ ఆందోళనలకు ఈ సమ్మెకు సంబంధం ఉంది.
ఆర్థిక వ్యవస్థ సైనికీకరణకు వ్యతిరేకంగా చేసే పోరాటం, మన వేతనాలు, పని పరిస్థితులు, సామూహిక ఒప్పందాలు, విద్య, ఆరోగ్య రంగాల డిమాండ్లతో నేరుగా ముడిపడి ఉంది.
ఓడరేవు కార్మికుల (డాకర్ల) సంఘాలు మనకు ఒక దారి చూపుతున్నాయి. మాటలు, నినాదాలకు అతీతంగా, సరిహద్దులు దాటి ఐక్యంగా కార్మికులు కలిసికట్టుగా పోరాడి ఏకకాలంలో ఆర్థిక వ్యవస్థను స్తంభింపజేయ గలరని వారు నిరూపిస్తు న్నారు. ఈ విధంగా, వారు తమ పని పరిస్థితులను మెరుగు పరుచుకోవచ్చు. యుద్ధాలు, మారణహో మాలకు (ముఖ్యంగా పాలస్తీనా ప్రజల మారణహోమం) వ్యతిరేకంగా, అలాగే బాంబుల లాగా ఎంతో మంది ప్రాణాలను బలిగొంటున్న క్యూబాపై విధించిన నేరపూరితమైన, చట్టవిరుద్ధమైన దిగ్బంధనంతో సహా అన్ని సామ్రాజ్యవాద దిగ్బంధనాలకు వ్యతిరేకంగా గట్టి చర్యలు తీసుకోవచ్చు.
WFTU యొక్క TUI TPFC, అనుబంధ డాకర్ల సంఘాలన్నింటినీ ‘ఇస్తాంబుల్ డిక్లరేషన్’పై సంతకం చేయాలని, ఓడరేవులలో సమ్మెలు, ఆందోళనల ద్వారా అక్టోబర్ 30 ఉద్యమంలో పాల్గొనాలని, “డాకర్లు యుద్ధం కోసం పని చేయరు” అనే ఉద్యమాన్ని విస్తరించాలని పిలుపునిస్తోంది.
WFTU యొక్క TUI TPFC, రవాణా, మత్స్య మరియు సమాచార రంగాలలో ఉన్న తన అనుబంధ సంఘాలన్ని అక్టోబర్ 30 న జరిగే ఆందోళనల ద్వారా డాకర్లకు సంఘీభావాన్ని తెలియజేయాలి. రాబోయే కాలంలో వారి సొంత రంగాలలో కూడా ఇలాంటి కార్యక్రమాలను చేపట్టాలని పిలుపునిస్తోంది.
రవాణా, ఓడరేవులు, మత్స్య, సమాచార రంగాల కార్మికులు యుద్ధం కోసం పని చేయడానికి నిరాకరిస్తున్నారు. వారు సామ్రాజ్యవాద మృత్యు యంత్రానికి సేవ చేయడానికి నిరాకరిస్తున్నారు, ప్రజల మధ్య జీవితం కోసం, స్నేహం కోసం పని చేయాలనుకుంటున్నారు. సామ్రాజ్యవాదులు గోడలు నిర్మిస్తుంటే, మన పోరాటాల ద్వారా, అంతర్జాతీయ సంఘీభావం ద్వారా మనం ప్రజల మధ్య వంతెనలను నిర్మిస్తున్నాము!
యుద్ధ కాంక్షకు, సామ్రాజ్యవాద దిగ్బంధనాలకు, పెట్టుబడిదారీ దోపిడీకి వ్యతిరేకంగా, ప్రపంచ ప్రజల శాంతి, సహకారాల కోసం పోరాడే డాకర్లకు విప్లవాభినందనలు.
అంతర్జాతీయ సంఘీభావం వర్ధిల్లిాలి!
మాథ్యూ బోలెట్ రెడ్డాట్,
ప్రధాన కార్యదర్శి,
టి యు ఐ (ట్రాన్స్పోర్ట్, పోర్ట్స్, ఫిషరీస్ కమ్యూనికేషన్స్).
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
