న్యూయార్క్ గవర్నర్ క్యాథీ హోచుల్(డెమోక్రాట్) ఇప్పుడు తన రాష్ట్రంలో చాలా అరుదుగా జరిగిన ఒక మంచి ఆర్థిక పనిని చెడగొట్టేశారు.
ఈ వేలకోట్ల డాలర్ల తప్పుకు ఇక పన్ను కట్టే జనమే డబ్బు చెల్లించాలి.
న్యూయార్క్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ ఖర్చు విపరీతంగా పెరిగిపోతుంటే, 2012లో అప్పటి గవర్నర్ ఆండ్రూ క్యూమో(డెమోక్రాట్) ఒక ఒప్పందం చేశారు.
దాని ప్రకారం రిటైర్మెంట్ వయసు పెంచారు.
ఉద్యోగులు కూడా తమ పెన్షన్ కోసం కొంచెం డబ్బులు కట్టాలని రూల్ పెట్టారు. ఈ రూల్ వచ్చిన తర్వాత చేరిన ఉద్యోగులకు మాత్రమే ఇది వర్తిస్తుంది.
ఈ ఒప్పందం వల్ల 30 ఏళ్లలో న్యూయార్క్ ప్రజలకు 80 బిలియన్ డాలర్లు మిగులుతాయని అంచనా వేశారు.
యూనియన్ల ఒత్తిడికి తలొగ్గిన ప్రస్తుత గవర్నర్..
కానీ ఇప్పుడు మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న హోచుల్, ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల ఒత్తిడికి లొంగిపోయారు. ఆ సంస్కరణల్ని, ఇంకా మిగతా మార్పుల్ని వెనక్కి తీసేశారు.
టీచర్ల రిటైర్మెంట్ వయసును 63 నుంచి 58 సంవత్సరాలకు తగ్గించడానికి ఒప్పుకున్నారు. ఉద్యోగులు కూడా తమ రిటైర్మెంట్ ప్లాన్‌కు ఇప్పుడు తక్కువ డబ్బులు కడితే చాలు.
ఈ గిఫ్ట్‌ల వల్ల రాష్ట్రానికి, స్థానిక ప్రభుత్వాలకు ఏడాదికి 557 మిలియన్ డాలర్లు అదనంగా ఖర్చవుతుంది. ఈ మార్పుల్ని ఇక మార్చలేము.
ఎందుకంటే న్యూయార్క్ రాష్ట్ర రాజ్యాంగంలో పెన్షన్ బెనిఫిట్స్‌ను ”తగ్గించకూడదు, పాడు చేయకూడదు” అని రాసి ఉంది.
‘పెన్షన్ స్పైకింగ్’ పరిమితుల సడలింపు..
హోచుల్ ఇంకో పని కూడా చేశారు. ”పెన్షన్ స్పైకింగ్” అనే దాని మీద ఉన్న పరిమితిని సడలించారు. పెన్షన్ స్పైకింగ్ అంటే ఏమిటంటే, ఉద్యోగులు రిటైర్ అవడానికి ముందు చివరి 3 సంవత్సరాల్లో బాగా ఓవర్‌టైమ్ చేస్తారు.
ఎందుకంటే ఆ చివరి మూడు ఏళ్ల జీతం ఆధారంగానే పెన్షన్ లెక్కిస్తారు. గవర్నర్ ఓవర్‌టైమ్ లిమిట్‌ను 22 వేల డాలర్ల నుంచి ఏడాదికి 30 వేల డాలర్లకు పెంచేశారు.
దీనివల్ల 2012 తర్వాత ఉద్యోగంలో చేరిన వాళ్లకు 22,000 డాలర్ల కంటే అదనంగా పెన్షన్ వస్తుంది.
శాసనసభ్యులకు లబ్ధి – బడ్జెట్‌పై అదనపు భారం..
ఈ గిఫ్టులన్నీ 268.5 బిలియన్ డాలర్ల బడ్జెట్లో భాగం. పోయిన ఏడాది బడ్జెట్ కంటే ఇది 14 బిలియన్లు ఎక్కువ. 2026 మే 21న దీనిమీద సంతకం పెట్టారు. ఈ పెన్షన్ మార్పుల వల్ల 213 మంది రాష్ట్ర శాసన సభ్యుల్లో 74 మందికి నేరుగా లాభం చేకూరుతుంది.
రూజ్వెల్ట్ హెచ్చరికలు నిజమయ్యాయి..
ఈ విషయం చూస్తేనే అర్థమవుతుంది.. పాత న్యూయార్క్ గవర్నర్ ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలను ఎందుకు వ్యతిరేకించారో. ఆ సంఘాలు ఎప్పుడూ సామాన్య ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగానే డిమాండ్ చేస్తాయని ఆయనకు తెలుసు. ఎన్నిక కాని ఆ సంఘాలు ప్రభుత్వ పాలసీలను శాసించకూడదు. కానీ ఈ వారం ఆల్బనీలో సరిగ్గా అదే జరిగింది.
స్వేచ్ఛానువాదం: ఏ.వి. రావు
వాల్ స్ట్రీట్ జర్నల్ సౌజన్యంతో ఈ వ్యాసాన్ని అందిస్తున్నాము.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
