కాల్పుల విరమణను పొడిగించడానికి బదులుగా యుద్ధాన్ని ముగించాలన్న ఉద్దేశ్యంతో 30 రోజుల్లోగా ఇరు దేశాల మధ్య ఉన్న అంశాలను పరిష్కరించుకోవాలని, అమెరికాకు తాజాగా ఇరాన్ ప్రతిపాదించిందని ఇరాన్ ప్రభుత్వ సంబంధిత మీడియా తెలియజేసింది.
ఈ ప్రతిపాదనలను సమీక్షిస్తున్నట్లు, అయితే అది ఒప్పందానికి దారి తీయగలదా అన్న అనుమానాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తం చేశారు.
“గడచిన 47 సంవత్సరాలుగా ప్రపంచానికి, మానవత్వానికి చేసిన దానికి వారు ఇంకా పెద్ద మూల్యం చెల్లించుకోలేదు” అని సోషల్ మీడియాలో ట్రంప్ పేర్కొన్నారు.
శాంతి చర్చల ఆఫర్‌పై అమెరికా స్పందన..
శాంతి చర్చల కోసం చేసిన ఆఫర్‌పై అమెరికా స్పందనను స్వీకరించినట్లు ఇరాన్ తెలియజేసింది.
ఇరాన్ 14 సూత్రాల ప్రతిపాదనలపై పాకిస్థాన్ ద్వారా వాషింగ్టన్ తన స్పందన తెలియజేసిందని, వాటిని టెహ్రాన్ సమీక్షిస్తుందని మీడియా చెప్పింది.
అమెరికా స్పందనపై ఇస్లామాబాద్ లేదా వాషింగ్టన్ నుంచి ఇప్పటికిప్పుడే ఎలాంటి సమాచారం లేదు.
నౌకల దిగ్బంధం ఎత్తివేతపై ప్రతిపాదనలు..
ప్రస్తుత దశలో అణు అంశంపై సంప్రదింపులు లేవని; యుద్ధం ముగిసిన తర్వాత వరకు, గల్ఫ్ నౌకల రాకపోకలపై దిగ్బంధాన్ని ఎత్తివేయడానికి ఇరు పక్షాల అంగీకారం వంటి ప్రతిపాదనలు ఇరాన్ చేసిందని, ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బాఘై తెలిపినట్లు అధికార మీడియా వెల్లడించింది.
ఇరాన్ శాంతి ప్రతిపాదన కచ్చితమైన పదాలను ఇంకా సమీక్షించలేదని ట్రంప్ అన్నారు. అయితే దాన్ని తాను తిరస్కరించగలను అని తెలిపారు.
ఇరాన్‌కు వ్యతిరేకంగా నాలుగు వారాల కిందట అమెరికా, ఇజ్రాయెల్ బాంబు దాడులను నిలిపివేశాయి.
అమెరికా, ఇరాన్ అధికారులు ఒక దఫా చర్చలు జరిపారు. అయితే తదుపరి సమావేశాల కోసం జరుగుతున్న ప్రయత్నాలు ఇంతవరకు విఫలం అయ్యాయి.
అణు కార్యక్రమంపై తర్వాత చర్చిద్దామన్న ఇరాన్..
ఇరాన్ తన తాజా ప్రతిపాదనలను గురువారం అందజేసింది.
యుద్ధాన్ని ముగించే అంశంతో పాటు నౌకల రవాణా విషయంలో ఏర్పడిన స్తంభనపై ముందుగా చర్చిద్దామని, ఇరాన్ అణు కార్యక్రమం గురించి తర్వాత మాట్లాడుకుందామని ఇరాన్ నొక్కి చెప్పింది.
ఈ ప్రతిపాదనపై తనకు సంతృప్తి లేదని ట్రంప్ అన్నారు. వాటిని ఇంకా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. “ఒప్పందం గురించి వారు నాకు చెప్పారు. ఇప్పుడు వారు కచ్చితమైన అర్థాన్ని, పదాలను నాకు ఇవ్వనున్నారు” అని విలేకరులకు చెప్పారు.
ఇరాన్‌పై దాడులను తిరిగి మొదలు పెడతారా అని ప్రశ్నించగా “అది నేను చెప్పాలనుకోలేదు, దాని గురించి ఒక విలేకరికి చెప్పలేను” అని ట్రంప్ సమాధానం ఇచ్చారు.
“వారు అసభ్యంగా ప్రవర్తించినా, లేదా వారు ఏమైనా తప్పుడు పని చేసినా, ప్రస్తుతానికి చూద్దాం. అయితే అది జరగడానికి అవకాశాలున్నాయి” అని అన్నారు.
ఆంక్షలు, నిబంధనలపై అమెరికా డిమాండ్లు..
యుద్ధం ముగింపుకు ముందు అణు కార్యక్రమంపై తీవ్ర ఆంక్షలను ఇరాన్ అంగీకరించాల్సిందేనని వాషింగ్టన్ తన డిమాండ్‌ను పునరుద్ఘాటించింది.
దాంతో అణు అంశాలపై తదుపరి చర్చల కోసం వాయిదా వేయాలన్న ప్రతిపాదన కష్టతరంగా కనిపిస్తోంది.
టెహ్రాన్ ముందుగా తన వద్ద నిల్వ ఉంచిన 400 కేజీల అత్యంత విలువైన యురేనియంను వదులుకోవాలని వాషింగ్టన్ కోరుతోంది.
బాంబు తయారీకి అది ఉపయోగిస్తారని అమెరికా చెబుతోంది. తమ అణు కార్యక్రమం శాంతి కోసమేనని ఇరాన్ వాదిస్తోంది.
కొన్ని నిషేధాలపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, వాటికి బదులుగా కొన్ని ఆంక్షలను ఎత్తివేయాలని, 2015లో జరిగిన ఒప్పందంలో అంగీకరించబడిన వాటినే ట్రంప్ రద్దు చేశారని ఇరాన్ పేర్కొంది.
14 సూత్రాల ప్రతిపాదనల సారాంశం..
చుట్టూ ఉన్న ప్రాంతాల నుంచి అమెరికా దళాల ఉపసంహరణ, దిగ్బంధం తొలగింపు, స్తంభింపజేసిన ఆస్తుల విడుదల, నష్టపరిహారం చెల్లింపు, ఆంక్షల తొలగింపు, లెబనాన్‌తో సహా అన్ని మార్గాల నుంచి యుద్ధాన్ని ముగించడం, హార్ముజ్ జలసంధి కోసం కొత్త నియంత్రణ పద్ధతిని సృష్టించడం ఈ 14 సూత్రాల ప్రతిపాదనలో ఉన్నట్టు ఇరాన్ మీడియా తెలియజేసింది.
ఇరాన్ గార్డ్స్ హెచ్చరిక..
“అసాధ్యమైన మిలిటరీ ఆపరేషనా లేక చెడు ఒప్పందమా” ఈ రెండింటి మధ్య ఏదో ఒకదాన్ని అమెరికా ఎంచుకోవాలని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఆన్లైన్ పోస్ట్‌లో హెచ్చరించిన దాన్ని ప్రభుత్వ టీవీ ప్రసారం చేసింది.
వాషింగ్టన్ పట్ల ఐరోపా, రష్యా, చైనా నుంచి “వైఖరిలో మార్పు” రావడంతో నిర్ణయం తీసుకునే అమెరికా ద్వారం కుంచించుకుపోవడంతో పాటు నౌకల దిగ్బంధనంపై అమెరికాకు ఇరాన్ “డెడ్‌లైన్” విధించిందని ఇరాన్ గార్డ్స్ పేర్కొంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
