పేపర్ లీక్‌లపై వేలాది మంది జార్ఖండ్ అసెంబ్లీకి మార్చ్ చేస్తుండగా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చీఫ్‌ను జార్ఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
హైకోర్టు, సుప్రీంకోర్టుల ఆదేశాలు, పర్యవేక్షణలో నిర్వహించిన సీజీఎల్ పరీక్షను రద్దు చేసే లేదా సీబీఐకి అప్పగించే అధికారం తమకు లేదని, మిగిలిన అన్ని డిమాండ్లను ఆమోదించామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
న్యూఢిల్లీ: జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీలో రెండు వారాలుగా నిరసన తెలుపుతున్న వేలాది మంది విద్యార్థులు ఆగస్టు 10న ప్రభుత్వం ఏర్పాటు చేసిన కఠిన భద్రతా ఏర్పాట్లు, నిఘా డ్రోన్ల మధ్య జార్ఖండ్ అసెంబ్లీ వైపు మార్చ్ నిర్వహించారు.
పరీక్షల నిర్వహణలో, పరీక్షలను నిర్వహించడానికి రాష్ట్రంలో కాంట్రాక్టు పొందిన ఒక ‘బ్లాక్‌లిస్ట్’ చేయబడిన కంపెనీతో సహా జరిగిన అక్రమాలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ విచారణ జరిపించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
మాజీ ఛైర్మన్ అరెస్ట్..
బ్లాక్‌లిస్ట్ చేయబడిన కంపెనీ అయిన టీఎస్ఆర్ డేటా ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఏజెన్సీని ఉపయోగించినందుకు జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ ఛైర్మన్ ఎల్ ఖియాంగ్తేను రాష్ట్ర సీఐడీ అరెస్టు చేసింది. రాష్ట్ర సీఐడీ ఇప్పటికే ఈ అంశంపై విచారణ జరుపుతోంది.
విచారణకు ఈడీ రంగప్రవేశం..
అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో జూలై మధ్యలో విద్యార్థులను రోడ్లపైకి తెచ్చిన జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్(సీజీఎల్) పరీక్షతో సహా, రాష్ట్రంలో జరిగిన నియామక పరీక్షల్లో జరిగిన అక్రమాలపై కేంద్ర తనిఖీ సంస్థ అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా విచారణ జరుపుతుందని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం తెలిపింది.
పోలీసులతో విద్యార్థుల ఘర్షణ..
గత 9 రోజులుగా నిరాహార దీక్షలో ఉన్న దేవేంద్ర నాథ్ మహతో నేతృత్వంలో విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు.
సమావేశాలు జరుగుతున్న అసెంబ్లీకి విద్యార్థులు చేరుకోకుండా అడ్డుకోవడానికి ఏర్పాటు చేసిన అనేక బారికేడ్ల వద్ద ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణ పడ్డారు.
144వ సెక్షన్ విధింపు, లాఠీ ఛార్జ్..
ఒకే చోట నలుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడకుండా నిరోధించే భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్లను అసెంబ్లీ చుట్టూ 750 మీటర్ల పరిధిలో అమలు చేశారు.
ఈ నిరసన మార్చ్‌లో పాల్గొనడానికి జార్ఖండ్ నలుమూలల నుంచి విద్యార్థులు తరలివచ్చారు.
అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న వారిపై నీటి ఫిరంగులు, లాఠీ ఛార్జ్ ఉపయోగించినట్లు పీటీఐ వార్తా సంస్థ నివేదించింది.
ఈ నిరసన ఇకపై కేవలం రాజధాని, దాని పరిసరాలకే పరిమితం కాకుండా, బొకారో, ధన్‌బాద్, హజారీబాగ్ తదితర ఇతర జిల్లాలకు విస్తరించింది, అక్కడ వేలాది మంది వీధుల్లోకి వచ్చారు.
కొన్ని పరీక్షలు రద్దు చేసిన ప్రభుత్వం..
ఒక రోజు క్రితం, హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ప్రభుత్వం విద్యార్థులతో జరిపిన చర్చల్లో 14వ జేపీఎస్సీ ప్రిలిమినరీ పరీక్షను, 2023, 2025ల నాటి జేపీఎస్సీ బ్యాక్లాగ్ పరీక్షలను రద్దు చేయడానికి అంగీకరించింది. ముగ్గురు సభ్యుల జేపీఎస్సీ బోర్డు కూడా రాజీనామా చేసింది.
అయితే, సీజీఎల్ పరీక్షల అక్రమాలపై పారదర్శకమైన విచారణ జరుపుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినప్పటికీ, నిరసనకారులు అసెంబ్లీ మార్చ్‌ను రద్దు చేయడానికి నిరాకరించారు.
వాట్సాప్‌లో పేపర్ లీక్ ఆరోపణలు..
2024 సీజీఎల్ పరీక్ష పేపర్ వాట్సాప్‌లో లీక్ అయిందని, ఇది హజారీబాగ్, జంషెడ్పూర్, బీహార్, పశ్చిమ బెంగాల్, నేపాల్‌లోని అభ్యర్థులకు కూడా చేరిందని ఆరోపణలు ఉన్నాయి.
ఈ లీక్ కారణంగా కొందరు అభ్యర్థులు కోర్టులో కేసు కూడా వేశారు. ఈ లీక్‌పై విచారణ జరిపిన 2025 సీఐడీ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టి, ఒక కొత్త ‘ప్రత్యేక విచారణ బృందం’ (సిట్)ను ఆదేశించిందని, ఆ బృందం నివేదిక పేపర్ లీక్ ఆరోపణలను తోసిపుచ్చిందని ఎన్డీటీవీ నివేదించింది.
ఆ సంవత్సరంలో జేపీఎస్సీలో జరిగిన మరో పేపర్ లీక్ ప్రస్తుతం జరుగుతున్న ఈ విస్తృత నిరసనలకు దారితీసింది. 2023 సీజీఎల్ పరీక్ష కూడా లీక్ అయిందని ఆ నివేదిక పేర్కొంది.
మంత్రి హామీ, విద్యార్థుల డిమాండ్లు..
“విద్యార్థులు అద్భుతమైన సూచనలు చేశారు, సరైన ఆందోళనలను లేవనెత్తారు. వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మనం కాస్త వేచి ఉండి ఏం జరుగుతుందో చూడాలి” అని విద్యార్థులతో జరిగిన చర్చల్లో పాల్గొన్న జార్ఖండ్ మంత్రి దీపికా సింగ్ అన్నారు.
బ్లాక్‌లిస్ట్ చేయబడిన సంస్థకు సంబంధించిన అన్ని పరీక్షలను రద్దు చేయాలని జార్ఖండ్ లోక్ తాంత్రిక్ క్రాంతికారీ మోర్చా(జేఎల్కేఎం), మార్చ్ నిర్వహిస్తున్న విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
బ్లాక్‌లిస్ట్ సంస్థకే మళ్లీ కాంట్రాక్ట్..
న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక నివేదిక ప్రకారం, అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో టీడీపీఎల్ను రాష్ట్ర ప్రభుత్వం 2025 మేలో జేఎస్ఎస్సీ బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది. అయితే ఆ తర్వాత జేపీఎస్సీ పరీక్షల పనుల కోసం మళ్లీ ఎంపిక చేశారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
