యంత్రాలతో ఉత్పత్తి ఆధారంగా నడుస్తున్న ఆధునిక పరిశ్రమ తయారీ కాలం నుంచి వారసత్వంగా వచ్చిన శ్రమ విభజనను తీవ్రంగా రూపాంతరం చేస్తుంది. సాధనాల తయారీలో స్వీయ అనుభవాన్ని అనుసరించడం, పనివాడి నైపుణ్యాలు, సామర్ధ్యానికి అనుగుణంగా ప్రక్రియ అనే సూత్రం స్థానంలో ఆధునిక పరిశ్రమలో మొత్తం ప్రక్రియయే నిష్పాక్షికంగా పరిశీలించబడుతుంది. అలా చెప్పాలంటే మనుషుల ద్వారా దానిని అమలు చేయవలసిన సమస్యతో సంబంధం లేకుండా దాని దశలనూ, ప్రతి సవివర ప్రక్రియను నిర్వహించాలనే సమస్యనూ విశ్లేషించడం, వాటిని మొత్తంగా బంధించడం ఎలా అన్న దాన్ని యంత్రాలు, కెమిస్ట్రీ తదితరాల సహాయంతో పరిష్కరించడం జరిగింది. అది ఆ విధంగా మానవజాతి చరిత్రలో గొప్ప ముందడుగు.
అయినా దాని పెట్టుబడిదారీ లక్షణం కారణంగా శ్రమను తగ్గించే, మరింత ఆసక్తికరంగా చేసే విధంగా అది పనిచేయదు. కానీ అందుకు పూర్తి వ్యతిరేకంగా పని చేస్తుంది.
కార్మికుని మార్పు లేని పనిలో కట్టివేసిన తయారీ శ్రమవిభజనను అది బలహీనపరచినా, సమాన సౌలభ్యంతో వివిధ రకాలైన విధులను నిర్వహించడం కార్మికునికి సాధ్యం చేసినా కూడా అది అతన్ని కేవలం యంత్రం అనుబంధంగా చేస్తుంది. పెట్టుబడిదారీ కర్మాగారం భద్రతా పరిస్థితులను నిర్లక్ష్యం చేయడం ద్వారా, శ్రమను తీవ్రతరం చేయడం ద్వారా ఉత్పత్తి సాధనాల పొదుపు చేస్తుంది.
పెట్టుబడిదారీ యంత్ర వినియోగం ప్రారంభంలో(ఏదో ఒక విధంగా హేతుబద్ధమైనదైన) పనిదినాన్ని కుదించడం కాకుండా పొడిగించడానికి దారితీస్తుంది. అది తరచుగా పదునైన సంక్షోభాలకు దారితీస్తున్నందున, నిరుద్యోగానికీ, పర్యావరణం విషయంలో శక్తి హీనులమయ్యామనే భావనకు అది దారితీస్తుంది.
ఆధునిక పరిశ్రమ దృక్పథం..
ఆధునిక పరిశ్రమలోని ఇతర వైరుధ్యాల జాబితాను ఎవరైనా ఇవ్వగలరు. కాని, కర్మాగార వ్యవస్థపై పెట్టుబడిదారీ క్షమాపణ వాదులపై మార్క్స్ కఠినమైన విమర్శల సారాన్ని ఇక్కడ తిరిగి ఇస్తే సరిపోతుంది. అందుచేత యంత్రాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే, అవి శ్రమను తగ్గిస్తాయి/ తేలికపరుస్తాయి. కావున పనిగంటలను తగ్గిస్తాయి. కానీ, మూలధనం ద్వారా వినియోగంలోకి వచ్చినప్పుడు శ్ర్తమ తీవ్రతను పెంచుతాయి. మూలధన సేవలో వాటిని పొడిగిస్తాయి; అదే ప్రకృతి శక్తులపై మానవ విజయం కానీ, మూలధనం చేతిలో అది మానవులను ఆ శక్తులకు బానిసలను చేస్తుంది; అదే ఉత్పత్తిదారులను సంపదను పెంచుతుంది. కానీ మూలధనం చేతిలో అది వారిని బికారులుగా మారుస్తుంది.
ఈ కారణాలు, ఇతరకారణాలు అన్నిటి వలనా పెట్టుబడిదారీ అర్ధశాస్త్రవేత్తలు.. ఈ వైరుధ్యాలన్నిటికీ వాస్తవ వైరుధ్యం కానీ సైద్ధాంతిక వైరుధ్యం కానీ ఉనికిలో లేదని చెబుతారు. మూలధనంతో తప్ప ఏ యంత్ర వినియోగమైనా అతనికి అసాధ్యం. అందుచేత యంత్రం చేత కార్మికుని దోపిడీ అతనికి కార్మికుడు యంత్రాన్ని ఉపయోగించటం వంటిదే.
పెట్టుబడిదారీ యంత్ర వినియోగ వైరుధ్య, అసంబద్ధ లక్షణాన్ని మార్క్స్ కనికరం లేకుండా బహిరంగ పరచడం ఏ విధంగానూ అతను దానిలోని ప్రగతిశీల అంశాలను తిరస్కరించడానికి గానీ లేదా హస్తకళా పద్దతులను(విమర్శలేని ప్రశంసలు, ఆమోదాలు) శాస్త్రీయేతర, శాస్త్రీయ పూర్వ పద్దతులను కళాత్మకంగా నివేదించడానికి గానీ దారితీయలేదు.
తయారీ విధానంలో కన్నా కార్మికులు చెల్లాచెదురుగా ఉండడం వలన వారి ప్రతిఘటన శక్తి తగ్గిపోతున్నందున, పరాన్న జీవులందరూ(దళారీలు) తమకు తాముగా యజమానికీ కార్మికునికీ మధ్య చేరిపోవడం వలన(దేశీయ) గృహ పరిశ్రమ అని పిలవబడుతున్న దానిలో కార్మికుల దోపిడీ మరింత సిగ్గులేనిదిగా ఉన్న విషయాన్ని వాస్తవానికి అతను ఎత్తిచూపాడు. తయారీదారు జీవితాంతం కార్మికునిగా ఉంచడంతో పనివాడిని నిర్వీర్యపరుస్తాడు.
రెండవది ఆధునిక పెట్టుబడిదారీ పరిశ్రమలో, వేగవంతమైన సాంకేతిక మార్పులు, తరచుగా వచ్చే సంక్షోభాలు దాని ఉత్పత్తి నిర్మాణాన్ని(ఉత్పత్తి వివిధ శాఖల సాపేక్ష ప్రాముఖ్యత) మారుస్తాయి.
జీవితాంతం ఒకే విధమైన విసుగుపుట్టించే పనితో, వివిధ రకాల శ్రమలకు సరిపోయే, ఉత్పాదకతలో వచ్చిన ఏ మార్పులనైనా ఎదుర్కొనే సామర్ధ్యం గల, తానూ నిర్వహించే అనేక సామాజిక విధులకు అతని స్వీయశక్తికి సంపూర్ణ అవకాశాన్ని పొందే విధంగా సంపూర్ణంగా అభివృద్ధి చెందిన మానవుడిని కేవలం మనిషిలో ఒక భాగంగా మిగిల్చే విధంగా నేటి కార్మికుని కుంటుపరచేటట్లు, సమాజాన్ని బలవంతం చేస్తుంది.
కొంత శిక్షణ ద్వారా శాస్త్ర సాంకేతికతలతో శారీరక శ్రమను కలపడానికి ప్రయత్నించే విధంగా సాంకేతిక, వ్యవసాయ పాఠశాలల స్థాపనతో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని మార్క్స్ చెప్పాడు. ఈ ప్రక్రియ విప్లవాత్మక అంశం పెట్టుబడిదారీ సంబంధాలకు ప్రత్యక్షంగా వ్యతిరేకం. కానీ, ‘ఉత్పత్తి ఒక నిర్దిష్ట రూపంలో అంతర్లీనంగా ఉన్న వైరుధ్యాల చారిత్రక అభివృద్ధి మాత్రమే ఆ విధమైన ఉత్పత్తిని రద్దుచేసి, సరికొత్త (ఉత్పత్తి) స్థాపించగల ఏకైక మార్గం అనే మార్క్స్ ఆదేశాన్ని ఇది నొక్కి వక్కాణిస్తుంది.’
మూడవది, ఆధునిక పెట్టుబడిదారీ పరిశ్రమ మహిళా, బాల కార్మికులను దాని సాంప్రదాయ క్రూరత్వంతో కర్మాగారంలో దోపిడీ చేస్తూ ఉండగా, ఇంటి పరిధి వెలుపల ఉత్పత్తి ప్రక్రియలో ఒక ముఖ్యమైన భాగాన్ని మహిళలకూ, యువకులకూ, బాలబాలికలకూ కేటాయించడం ద్వారా(అది) ఒక ఉన్నత రూపంలోని కుటుంబానికి, స్త్రీ పురుష సంబంధాలకు ఆర్ధికపునాదిని వేస్తుంది. సామూహికంగా పనిచేసే సమూహం స్త్రీ పురుషులతోనూ అన్ని వయస్సుల వారితోనూ కూడి ఉన్నదనే వాస్తవం అనుకూల పరిస్థితులలో తప్పనిసరిగా మానవాభివృద్ధికి మూలంగా మారుతుంది.
అదేవిధంగా వ్యవసాయంపై ఆధునిక పరిశ్రమ ప్రభావం, ఒకే సమయంలో విధ్వంసక, ప్రగతిశీల స్వభావం గల రెండు విధాలుగా ఉంటుంది. దాని వేగవంతమైన, అరాచక పట్టణీకరణతో నేలకూ మనిషికీ మధ్య పదార్ధాల ప్రసరణకు అంటే, మనిషి తినే ఆహారం– వినియోగించే బట్టలు వంటివి మూలకాలు తిరిగి భూమిని చేరడానికి భంగం కలిగిస్తుంది.అందువలన భూసార పరిరక్షణకు అవసరమైన నియమాలను ఉల్లంఘిస్తుంది.
ఇంకా పరిశ్రమలోలానే పెట్టుబడిదారీ వ్యవసాయంలో కూడా వచ్చిన ప్రగతి విధ్వంసకరమైన, తీవ్ర దోపిడీ ద్వారా సంభవిస్తుంది. ఆవిధంగా సంపద మొత్తానికీ అసలు మూలమైన శ్రమకూ, భూమికీ ఉన్న సంబంధాన్ని బలహీనపరచడానికి దోహదం చేస్తుంది.
అదే సమయంలో పెద్ద కేంద్రాలలో జనాభాను కేంద్రీకరించడం వలన కార్మికవర్గ సంస్థను నిర్మించడాన్ని, సామాజిక విప్లవం ద్వారా మానవజాతి, భూమి ఆరోగ్యాన్ని పునరుద్ధరించడాన్ని, తత్ఫలితంగా మానవ జాతి సంపూర్ణ అభివృద్ధికి తగినవిధంగా నూతన సమాజ పుట్టుకను అది సాధ్యం చేస్తుంది.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 28వ భాగం, 27వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
