పరిపాలన, పోలీసులు కలిసి సెప్టెంబరు 24 నిరసనలకు సంబంధించిన “సాక్ష్యాలను తుడిచివేయడానికి” ప్రయత్నిస్తున్నారని పౌరసమాజ నేతలు ఆరోపించారు.
శ్రీనగర్: సెప్టెంబరు 24 నిరసనలకు సంబంధించిన “సాక్ష్యాలను తుడిచివేయడానికి” స్థానిక పోలీసులు, కేంద్ర ప్రాంతం పరిపాలన వ్యవస్థ ప్రయత్నిస్తుందని లద్దాఖ్ పౌర సమాజం నాయకులు ఆరోపించారు. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగులను కూడా వేధిస్తున్నారని తెలియజేశారు.
లద్దాఖ్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయన్న”భ్రమ నుంచి బయటకు రావాలని” కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు, కేంద్ర పాలిత పరిపాలనకు కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్(కేడీఏ) నేత అస్గర్ అలీ కర్బలై అన్నారు.
లేహ్‌లో జరిగిన సెప్టెంబరు 24 హింసపై కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా లద్దాఖ్వ్యాప్తంగా యువకులను, గ్రామ పెద్దలను వేధిస్తూ “సాక్ష్యాలను తుడిచివేయడానికి” ప్రయత్నిస్తున్నారని అలీ పేర్కొన్నారు. దీనిని గమనిస్తే “తుఫాను వచ్చే ముందు నిశ్శబ్దం”లా ప్రస్తుత పరిస్థితి ఉందని అభిర్ణించారు.
లద్దాఖ్ రాజధాని లేహ్‌లో సెప్టెంబరు 24న శాంతియుత నిరసన ఒక్కసారిగా హింసాత్మకంగా మారింది. ఈక్రమంలో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో నలుగురు పౌరులు చనిపోయారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మహిళను విమానం ద్వారా ఢీల్లీలోని ఏయిమ్స్‌కు తరలించారు. నిరసనకారులు, జర్నలిస్టులు ఈ మొత్తం ఘటనపై తీసిన చాలా దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
దర్యాప్తులో కీలకమైన దృశ్య సాక్ష్యాలు..
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న నిరసనకారులపై పోలీసులు, కేంద్ర పారామిలటరీ దళాలు దౌర్జన్యానికి పాల్పడ్డాయని లద్దాఖ్ పౌర సమాజ నాయకత్వం పేర్కొన్నది. హింసకు దారి తీసిన పరిస్థితులపై న్యాయవిచారణను కోరింది.
హింసాత్మక ఘటన తర్వాత విచారణాధికారులు నిరసనకారుల “ఫుటేజ్లపై ప్రత్యేక దృష్టి సారించారు”అని కొన్ని విశ్వసనీయవర్గాలు ది వైర్‌కు తెలియజేశాయి.
ఈ మొత్తం ఘటనపై వస్తున్న ఆరోపణలపై లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా, లద్దాఖ్ పోలీసుల నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.
పౌరుల హత్య అనంతరం మొదటిసారి లేహ్ అపెక్స్ బాడీ(ఎల్ఏబీ), కేడీఏ నాయకులు సంయుక్త విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. హింసపై సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి చేత న్యాయవిచారణ జరిపించాలని తమ డిమాండ్‌ను పునరుద్ఘాటించారు.
లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించి, ఆరవ షెడ్యూల్లో రాష్ట్రాన్ని చేర్చాలనే తమ డిమాండ్‌లో ఎలాంటి మార్పులేదని కేంద్రప్రభుత్వానికి తెలియజేశారు. దౌర్జన్యాలకు నిరసనగా నాయకులందరూ చేతికి నల్లబ్యాండ్లు ధరించారు.
కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 2023లో ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీతో చర్చలకు ముందు రాజ్యాంగ హక్కులకు భద్రత కల్పించడంతో; పాటు లద్దాఖ్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కేడిఏ– ఎల్ఏబీ సంయుక్తంగా కోరాయి.
సాధారణ పరిస్థితులు నెలకొనడానికి స్థానిక పరిపాలన, యూనియన్ ప్రభుత్వం బాధ్యత అని స్పష్టం చేశారు. అంతేకాకుండా, లేహ్‌లో లాబ్- కేడిఏ కోర్ గ్రూపు సమావేశం జరిగింది. దీంతోపాటు హోంమంత్రిత్వ శాఖ నేతృత్వంలొ చర్చలు పునర్ ప్రారంభం కావడానికి నాయకులు నాలుగు ముందస్తు షతులను విధించారు.
“లద్దాఖీలు భయపడరు, వారు ఒత్తిళ్లకు లోనుకాలేరు. జైళ్లు, చావు బెదిరింపులు, బుల్లెట్ల వంటి మాటలతో లాద్దాఖీల నోర్లు మూయించగలమన్న భ్రమలో ఉండరాదు. ఇప్పటికైనా మేల్కోని హోంమంత్రిత్వ శాఖ, యూటీ పరిపాలకులు వేధింపులు, దౌర్జన్యాలను నిలుపుదల చేయాలి”అని కోరారు.
న్యాయవిచారణతో పాటు పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్‌చుక్ సహా సెప్టెంబరు 24న హింస అనంతరం– లద్దాఖ్ పోలీసులు అరెస్టు చేశారు. నిర్బంధించిన వీరందరిని బేషరతుగా విడుదల చేయాలని నేతలు డిమాండ్ చేశారు. హింసలో గాయపడిన, మృతి చెందిన వారికి తగిన పరిహారం చెల్లించాలని, రాష్ట్ర హోదా– ఆరవ షెడ్యూల్లో పొందుపర్చడంపైనే దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర హోదా కోసం ఆరవ షెడ్యూల్లో చేర్చాలన్న డిమాండ్‌ను పునరుద్ఘాటిస్తూ, సెప్టెంబరు 24 ఘటనలపై నిరసన తెలియజేస్తూ లద్దాఖ్ వ్యాప్తంగా మౌన ప్రదర్శనలు నిర్వహంచనున్నట్లు కర్బలై విలేకరులకు చెప్పారు.
నిరసన కార్యక్రమాల తేదీలను సరైన సమయంలో ప్రకటిస్తామని, మౌన ప్రదర్శన ఉదయం 10- 12 గంటల వరకు ఉంటుందని, ఆతర్వాత అదే రోజు సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు బ్లాకౌట్(అంధకారాన్ని) పాటిస్తామని కర్బలై వివరించారు.
“లద్దాఖీలకు న్యాయం, వారి రాజ్యాంగ హక్కులు లభించనంత వరకు– ముఖ్యంగా రాష్ట్ర హోదా, ఆరవ షెడ్యూల్లో రాష్ట్రాన్ని చేర్చనంత కాలం నిశ్శబ్దంగా ” ఉండబోమని లాబ్ సహ అధ్యక్షులు చేరింగ్ దోర్జె లఖ్రూక్ ఇతర నాయకులతో కలిసి కర్బలై తెలియజేశారు. కర్బలై మీడియాతో ఉర్దూలో మాట్లాడగా లఖ్రూక్ లద్దాఖీలో మాట్లాడారు.
“లద్దాఖీలు తమ పోరాటాన్ని కొనసాగిస్తారు. కష్టమైన వాతావరణంలో జీవించే లద్దాఖీలు కఠినమైన పోరాటయోధులు. మేము ఆశను వదులుకోలేదు” అని లఖ్రూక్ అన్నారు.
“ఈ నిశ్శబ్దం తుఫానుగా మారక ముందే” హోంమంత్రిత్వ శాఖ, లద్దాఖ్ పరిపాలకులు చర్యలు తీసుకోవాలని కేడిఏ నాయకులు కోరారు.
సెప్టెంబరు 24న హింస తర్వాత లద్దాఖ్‌లో ఏర్పడిన సున్నితమైన పరిస్థితిని హోంమంత్రిత్వశాఖ, యూటీ పరిపాలన గ్రహించి ఉండవచ్చని సంయుక్త నాయకత్వం భావిస్తుంది.
“ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజల చేత ప్రకటనలు చేయించాలనే విషయంలో ప్రభుత్వ ఉద్యోగులను వేధించడం, బెదిరించడం, ఒత్తిళ్లకు లోనుచేయడం, చివరకు ఉద్యోగులను నిర్బంధిస్తామని కూడా చెప్పుతున్న విషయాన్ని చూస్తున్నామని మా యువకులు, గోబస్లు నిశ్శబ్దంగా ఉండాలని బెదిరిస్తున్నారని, ఇలా చేయడం ఏ మాత్రం సహించబోమని” కర్బలై స్పష్టం చేశారు.
ఆందోళన చేస్తున్న నాయకుల ప్రకారం, సెప్టెంబరు 24 నిరసనల తర్వాత లద్దాఖ్‌లోని అనేక మంది గ్రామపెద్దలు, గోబస్లను పోలీసులు రప్పించి ప్రశ్నిస్తున్నారు..
నిరసనకారులకు వ్యతిరేకంగా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడాన్ని ప్రస్తావిస్తూ, లద్దాఖ్ మౌనంగా మారిందని హోంమంత్రిత్వ శాఖ యూటీ పరిపాలన భావించరాదని కర్బలై అన్నారు.
రాష్ట్ర హోదా, ఆరవ షెడ్యూల్లో చేర్చాలనే డిమాండ్‌పై గతంలో కూడా ఆందోళన శాంతియుతంగా జరిగాయని, భవిష్యత్తులో కూడా శాంతియుతంగానే కొనసాగుతాయి. “మేము గాంధీ పంథాలో నడుస్తాం”అని చెప్పారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
