మొత్తంగా సామాజిక ఉత్పత్తి కోణం నుంచి చూస్తే, పంపిణీ రంగంలోని కార్మికులు ఏ విలువనూ సృష్టించరు. అందుచేత, ఉత్పాదక కార్మికులు ఉత్పత్తి చేసిన అదనపు విలువ నుంచి వారి వేతనాలు, జీతాలు చెల్లించబడతాయి. ఈ వాస్తవానికి అర్ధం పంపిణీ రంగంలోని(ఉదాహరణకు షాప్ అసిస్టెంట్లు, సేల్స్ క్లర్కులు, హోటలు కౌంటరులోని క్యాషియర్లు మొదలైన వారు) కార్మికులు తమ యజమానులకు అదనపు శ్రమ చేయడం లేదని కాదు. వారి వేతనాలు వారి శ్రమ శక్తి విలువపై(తేలికగా చెప్పాలంటే వారిని నిర్వహించడానికి అయ్యే ఖర్చుపై) ఆధారపడి ఉంటాయి. కాబట్టి, విలువ నియమాల ప్రకారం పనిదినంలో ఒక భాగం మాత్రమే, వాస్తవానికి వారు చేస్తారు. కొనుగోళ్ళు, అమ్మకాల కార్యకలాపాలలో తన శ్రమను పెట్టుబడిదారుల కొరకు వెచ్చిస్తాడో ఆ కార్మికుడు తనకయ్యే పంపిణీ ఖర్చును తప్పనిసరిగా అదనపు శ్రమ చేయడం ద్వారా తగ్గిస్తాడు.
కొనుగోలు, అమ్మకం వంటి చర్యలే కాకుండా ఖాతా నిర్వహణ ఖర్చులు కూడా ఉంటాయి. శ్రమ సమయం దేనికి ఖచ్చితంగా ఖర్చు అవుతుంది. పెట్టుబడిదారీ పరిస్థితులలో ఖచ్చితంగా అవసరమైన దానికన్నా ఎక్కువ సమయం దీనికి ఖర్చు అవుతుంది;
ఉదాహరణకు, పన్నులు ఎగవేయడానికి తప్పుడు లెక్కలు వ్రాయడానికి. కానీ ఖాతాల నిర్వహణలో వెచ్చించే సమయం అనుత్పాదకమే అయినప్పటికీ సాధారణంగా కొనుగోళ్ళు, అమ్మకాలులో అయిన ఖర్చులకంటే ముఖ్యమైన విధంగా భిన్నంగా ఉంటుంది. వ్యత్యాసమేమిటంటే, సామాజిక శ్రమ ఎలా ఖర్చు అవుతున్నదో తెలుసుకోవడానికి, సామర్ధ్యాన్ని ఎలా పెంచాలో తెలుసుకోవడానికి, ఖాతాల నిర్వహణ సోషలిస్టు సమాజంలో కూడా అవసరం.
ప్రక్రియ మరింత సామాజిక స్థాయిని పొంది, దాని వ్యక్తిగత పాత్రను ఎంతగా కోల్పోతే అంతగా ఖాతా నిర్వహణ ఒక నియంత్రణ, ఆదర్శ సంయోగం/ సంశ్లేషణ(ఉత్పాత్తి) ప్రక్రియ అవసరం ఎక్కువ అవుతుంది. అందుచేత చెల్లాచెదురు ఆర్ధిక వ్యవస్థయిన చేతి వృత్తుల, వ్యవసాయ ఆర్ధిక వ్యవస్థలోకన్నా పెట్టుబడిదారీ ఉత్పత్తి క్రమంలోనూ, పెట్టుబడిదారీ ఉత్పత్తి క్రమంలోకన్నా సమిష్టి ఉత్పత్తి క్రమంలోనూ చాలా ఎక్కువగా అవసరం అవుతుంది. కానీ ఉత్పత్తి కేంద్రీకృతమై, ఖాతా నిర్వహణ సామాజికమైనప్పుడు ఖాతా నిర్వహణ ఖర్చు తగ్గిపోతుంది.
అప్పుడు అక్కడ అమ్మకాలు, కొనుగోళ్ళ– రవాణా ప్రక్రియలో చిరిగిపోయే ధన నిల్వ ఖర్చులు ఉంటాయి. వివరాలలోకి వెళ్ళకుండా, తద్వారా రవాణాలో ఖర్చు అయిన శ్రమ సమయం విలువను సృష్టించే విధంగా, రవాణా మాత్రమే ఉత్పాదక చర్యగా ఉండడాన్ని మనం సులభంగా గుర్తించవచ్చు. రవాణా విలువను సృష్టించేదానిగా పరిగణించడానికి గల కారణాలను ఏదైనా విడిగా(వ్యక్తిగతంగా) జరుగుతున్న ఉత్పత్తి క్రమంలో కనుగొనాలి. దాదాపు అన్ని పారిశ్రామిక ప్రక్రియలలోనూ ఫ్యాక్టరీ లోపల ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి పదార్ధాలను తరచుగా రవాణా చేస్తూ ఉండాలి. ఉదాహరణకు కారుల తయారీ ఫ్యాక్టరీలో వివిధ విభాగాలలో తయారైన విడి భాగాలను కార్ల కూర్పు విభాగానికి (అసెంబ్లింగ్ వర్క షాప్‌కు) తీసుకువస్తారు.
మార్క్స్ ఎత్తిచూపినట్లు: ‘ఒక స్వతంత్ర ఉత్పత్తి స్థలం నుంచి పూర్తయిన వస్తువులను దూరంగా ఉన్న మరొక ప్రాంతానికి తరలించినప్పుడు అదే దృగ్విషయాన్ని మరింత పెద్ద ఎత్తున చూపుతుంది. మూలధనం చలామణి(టర్నోవర్) : స్థిర– పంపిణీలో ఉన్న మూలధనం.
మార్క్స్ టర్నోవర్ నిర్వచనం..
ఒక విడి చర్య కాని, ఆవర్తన(నియత కాలిక) ప్రక్రియ అన్న అర్ధం కలిగి ఉన్న మూలధనం పూర్తిచేసిన ఒక సర్క్యూట్‌ని టర్నోవర్(వ్యాపారం మొత్తంలో చలామణి అయ్యే ధనం) అంటారు. ఉత్పత్తి, పంపిణీలు తీసుకున్న సమయం మొత్తం కలిసి టర్నోవర్ వ్యవధిని నిర్ణయిస్తాయి. ఈ సమయం మొత్తం మూలధనన టర్నోవర్ సమయం.
ఉత్పాదక మూలధనం ఉత్పత్తి సాధనాలనూ శ్రమశక్తినీ లేదా స్థిర– అస్థిర పెట్టుబడులను వరుసగా కలిగి ఉన్నదని ఇంతకుముందు మనం చూశాము. విలువ, అదనపు విలువలను ఉత్పత్తి చేయడంలో ఈ రెండు భాగాలూ పోషించిన పాత్రల ఆధారంగా ఇక్కడ ఉత్పాదక మూలధనాన్ని రెండు భాగాలుగా విభజించడం జరిగింది. ఎంత వేగంగా దాని మూలకాల టర్నోవర్ జరుగుతున్నదన్నమరొక ప్రాతిపదికన కూడా ఉత్పాదక మూలధనాన్ని విభజించవచ్చు. స్థిర మూలధనానికీ, పంపిణీలో ఉన్న మూలధనానికీ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మనం ప్రత్యేకంగా గుర్తించవచ్చు. దీనిని చూడడానికి మనం ఉత్పత్తి సాధనాలను పరిగణనలోకి తీసుకుందాము.
ఇవి పాక్షికంగా యంత్రాలూ, శ్రమ సాధనాలనూ, ఫ్యాక్టరీ భవనాలూ, మన్నికైన ఇతర ఆస్తులూ, కొంతవరకు ముడి పదార్ధాలూ సహాయక పదార్ధాలూ కలిగి ఉంటాయి. ఇప్పుడు శ్రమ సాధనాలు, ఫ్యాక్టరీ భవనాలు సాపేక్షంగా మన్నికైనవి, ఉత్పత్తి అనేక రౌండ్లలో ఉపయోగపడేవిగా ఉంటాయి. కానీ ముడి పదార్ధాలూ, సహాయక పదార్ధాలూ ఉత్పత్తి క్రమంలోనే వినియోగించబడతాయి. అలానే ముడి పదార్ధాలూ, సహాయక పదార్ధాలూ ఉత్పత్తి క్రమంలోనే వినియోగమై పోతాయి.
సహాయక పదార్థాలు(పారిశ్రామిక ప్రక్రియలో వేడి చేయడానికి వినియోగించే బొగ్గు) ఉత్పత్తిలో భౌతికంగా కనపడవు. వాటి విలువ మాత్రం ముడి సరుకులలో మాదిరిగానే పూర్తిగా ఉత్పత్తిలోకి బదిలీ చేయబడుతుంది. శ్రమ సాధనాలు వాటి విలువను క్రమంగా ఉత్పత్తిలోకి విడుదల చేస్తాయి. ఈ దృష్టికోణంలో చూసినప్పుడు ముడి పదార్ధాలనూ, సహాయక పదార్ధాలనూ తన విలువను పూర్తిగా ఉత్పత్తిలోకి బదిలీ చేసే అస్థిర పెట్టుబడితో సమూహంగా చేయవచ్చు. ఇప్పుడు మనం స్థిర, పంపిణీ మూలధనాన్ని నిర్వచించగలం.
ఫ్యాక్టరీ భవనాలూ ఇతర ఆస్తులతో సహా శ్రమసాధనాలతో కూడిన స్థిర పెట్టుబడిలో కొంత భాగం, ఈ దిగువ లక్షణాలను కలిగి ఉంటుంది. దాని పనితీరు మొత్తం కాలంలో దాని విలువలో కొంత భాగం, ఉత్పత్తి చేయడానికి అది సహాయపడే సరుకులతో నిమిత్తం లేకుండా స్థిరంగా ఉంటుంది. ఈ ప్రత్యేక లక్షణమే స్థిర పెట్టుబడిలోని ఈ భాగానికి స్థిరత్వాన్ని ఇస్తున్నది. ఉత్పత్తి రూపం ప్రక్రియలో అభివృద్ధి చెందిన మూలధనంలోని ఇతర భాగాలన్నీ, ఇందుకు భిన్నంగా పంపిణీ లేదా ద్రవ్య మూలధనంగా ఉంటాయి.
ఆ విధంగా, శ్రమ సాధనాలు స్థిర పెట్టుబడిగా ఉండగా, శ్రమ శక్తీ, ముడి పదార్ధాలూ, సహాయక పదార్ధాలూ అన్నీ కూడా పంపిణీలో ఉన్న(సర్క్యులేటింగ్) మూలధనమే. ఈ భావనలకు సంబంధించి అనేక అపోహలు ఉన్నాయి. ఉత్పాదక పెట్టుబడిలోని వివిధ పాదార్ధిక అంశాలు; తమ విలువను ఉత్పత్తిలోకి బదిలీ చేయడంలోని రీతిలోని వ్యత్యాసాలపై అవి ఆధారపడి ఉన్నందున, ఈ భావనలను ఉత్పాదక పెట్టుబడికే వర్తింపజేయాలని మొదటగా స్పష్టం చేయవలసి ఉంది.
‘స్థిర– అస్థిర మూలధనాల’ మధ్య వ్యతిరేకత ఉన్నదనే దానికి ధనానికీ, సరుకుల రూపంలో ఉన్న మూలధనానికీ సంబంధించిన విషయంలో అర్ధం లేదు. మార్క్స్ చెప్పినట్లు, ఆ తరువాతివి ‘ఉత్పాదక పెట్టుబడికి భిన్నంగా వాస్తవానికి పంపిణీలో ఉన్న మూలధనం’.
రెండవది, ఉత్పాదక మూలధనంలోని, స్థిర– చలామణిలో ఉన్న మూలధనం మధ్య ఉన్న వ్యత్యాసం, స్థిరత్వం ఏదో భౌతిక భావనపై ఆధారపడి ఉండదు. మార్క్స్ చూపిన సరళమైన ప్రతి-ఉదాహరణ ఓడ ప్రయాణించేదే అయినప్పటికీ ఇది ఉత్పత్తికి తన విలువను(ఈ సందర్భంలో ఒక రవాణా అని పిలవబడే సేవకు) క్రమంగా కోల్పోతుంది, కాబట్టి అది స్థిరపెట్టుబడి. దీనితో దగ్గర సంబంధం ఉన్న తప్పుడు అవగాహన, స్థిర (పెట్టుబడిని) మూలధనాన్ని, నిర్దిష్ట ఆర్ధిక లక్ష్యంగా కాకుండా ఒక వస్తువు వస్తుగత ఆస్తిగా – మూలధనం వేగవంతమైన టర్నోవర్‌ను సూచించే భావన. పస్తువులను మార్క్స్ అద్భుతమైన ఉదాహరణగా పేర్కొన్నాడు. శ్రమ పడే జంతువులుగా అవి స్థిర మూలధనం, గొడ్డు మాంస పశువులుగా అవి ముడి పదార్ధం, అందుచేత చలామణిలో(సర్క్యులేటింగ్) ఉన్న మూలధనం.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 51వ భాగం, 50వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
