చాలా మంది జర్నలిస్టులు, రచయితలు, విద్యావేత్తలు, వ్యంగ్యకారులు, కమెడియన్ల- అరెస్టులు, ఎఫ్ఐఆర్లు, న్యాయ పోరాటాలతో 2025 సంవత్సరం గడిచిపోయింది.
తెలంగాణ సీఎం రేవంత్‌ను అవమానించారనే ఆరోపణలతో పల్స్న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ పొగడదండ రేవతి, అదే ఛానెల్‌కు చెందిన విలేకరు తన్వీ యాదవ్‌ను ఓ వీడియో ఆధారంగా హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు మార్చిలో అరెస్టు చేశారు.
అశ్లీలత, సంఘటిత నేరం, కుట్ర, మనోభావాలను రెచ్చగొట్టడం వంటి అభియోగాలతో వారిపై కేసు నమోదు చేశారు.
ఏదేమైనప్పటికీ, మొదట్లో వారికి బెయిల్ ముంజూరైనప్పటికీ తిరిగి అరెస్టు చేయడాన్ని హైకోర్టు నిలిపివేసింది.
ఆ తర్వాత అక్టోబరులో సుప్రీంకోర్టు స్టే విధించింది.
అస్సాం సహకార బ్యాంకు వద్ద అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనను కవర్ చేసినందుకు గౌహతి ప్రెస్‌క్లబ్ సహాయ కార్యదర్శి, డిజిటల్ జర్నలిస్టు దిలావర్ హుస్సేన్ ముజుందార్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల(అత్యాచారాల నిరోధక) చట్టాన్ని ఉల్లంఘించారని పేర్కొంటూ కామరూప చీఫ్ మెజిస్ట్రేట్ కోర్టు మార్చి 26న కేసు నమోదు చేసింది.
ముజుందార్‌ను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, మార్చి 25న ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా నుంచి పోలీసు స్టేషన్, కోర్టు వరకు జర్నలిస్టులు నిరసన ప్రదర్శన చేశారు.
ఆ తర్వాత సాయంత్రం ముజుందార్‌కు బెయిల్ మంజూరైంది.
పహల్గాం దాడి తర్వాత ఆపరేషన్ సిందూర్‌పై విశ్లేషణాత్మకమైన కథనాన్ని ది వైర్ ప్రచురించింది.
ఈ నేపథ్యంలో ది వైర్ వ్యవస్థాపక సంపాదకులు సిద్ధార్థ వరదరాజన్‌పై బీఎన్ఎస్ నిబంధనలోని 152(దేశ ద్రోహం)కింద ఆగస్టులో, అస్సాంలోని ఒక పోలీసు స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ నమోదైంది.
సుప్రీంకోర్టు వెంటనే స్పందించి, వరదరాజన్‌కు రక్షణను మంజూరు చేసింది.
రచయితలు/ వ్యంగ్యకారులు/ విద్యావేత్తలు
పహల్గాం ఉగ్రవాద దాడి మీద స్పందిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేయడంతో- జానపద గాయని, యూట్యూబర్ నేహాసింగ్ రాథోడ్‌పై లక్నో హజ్రత్‌గంజ్ పోలీసుస్టేషన్లో ఏప్రిల్‌లో దేశద్రోహం కేసును నమోదు చేశారు.
నిఘా వర్గాల వైఫల్యంపై పోస్టులు పెట్టారని, ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకున్నారని రాథోడ్‌పై ఆరోపణలు చేశారు.
బీఎన్ఎస్ నిబంధనలలోని ఐటీ చట్టం, ప్రజల శాంతికి భంగం కల్గించటం, వర్గాల మధ్య శత్రుత్వాన్నిపెంచటం కింద ఆమెపై కేసులను నమోదు చేశారు.
డిసెంబరులో ఆమె ముందస్తు బెయిల్‌ను అలహాబాద్ హైకోర్టు(లక్నో బెంచ్) తిరస్కరించింది.
పహల్గాం దాడిపై ప్రభుత్వం, మీడియా స్పందనపై ప్రశ్నిస్తూ వ్యంగంగా పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ- డాక్టర్ మెడుస్సాగా ప్రసిద్ధి చెందిన లక్నో విశ్వవిద్యాలయానికి చెందిన అసిస్టెంటు ప్రొఫెసర్ మాద్రి కాకోటిపై హసన్‌గంజ్ పోలీసు స్టేషన్లో ఏప్రిల్ 29న కేసు నమోదు చేశారు.
ఆమెకు జూన్ 9న ముందస్తు బెయిల్ మంజూరు చేశారు.
అరుంధతీ రాయ్: జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఆగస్టు 2025లో, 25 టైటిళ్ళతో పాటు- ఆమె పుస్తకం ఆజాదిని నిషేధించింది.
“భారత వ్యతిరేక” కథనాలను ప్రోత్సహిస్తున్నారని రాయ్ మీద ఆరోపించారు.
పెన్ అమెరికాతో పాటు వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఈ చర్యను తీవ్రంగా ఖండించాయి. దీనిని భావ స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించాయి.
తన అనుభవాలు- జ్ఙాపకాల పుస్తక కవర్ పేజీపై బీడీ తాగుతున్న తన ఫోటోపై విమర్శలను ఎదుర్కోవలసి వచ్చింది.
ఆ ఫోటో భారత పొగాకు నియంత్రణ చట్టాలను ఉల్లంఘించడమే కాకుండా, సమాజానికి- ముఖ్యంగా యువ మహిళలను “నష్టపరిచే సందేశం” ఇస్తుందని ఆరోపిస్తూ కేరళ హైకోర్టులో ఓ పిల్ దాఖలు చేయబడింది.
ఆ తర్వాత సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని అరుంధతీ రాయ్ పుస్తకం అమ్మకాన్ని నిషేధించాలని చేసిన విజ్ఙప్తిని తిరస్కరించింది.
ఢిల్లీలోని తన ఇంటి నుంచి అశోకా విశ్వవిద్యాలయ అసోసియేట్ ప్రొఫెసర్ అలీ ఖాన్ మహమూదాబాద్‌ను 2025 మేలో అరెస్టు చేశారు.
ఆపరేషన్ సిందూర్‌పై సామాజిక మాధ్యమాల్లో అలీ చేసిన పోస్టుల పర్యవసానంగా హర్యానా పోలీసులు అరెస్టు చేశారు.
దీని మీద విస్తృతంగా చర్చ జరిగింది. అలీ అరెస్టును ఖండిస్తూ విద్యావంతుల, పౌర హక్కుల కార్యకర్తలు తీవ్రంగా విమర్శించారు.
దర్యాప్తు కొనసాగించడానికి అనుమతిస్తూ జూలైలో తనకు సుప్రీంకోర్టు తాత్కాలిక బెయిల్‌ను మంజూరు చేసింది.
స్టాండ్- అప్ కమెడియన్లు
ఒక కామెడీ షోలో మహరాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌షిండేను లక్ష్యంగా చేసుకొని జోకులు విసిరినందుకు, మార్చిలో మూడు ఎఫ్ఐఆర్లను స్టాండ్‌అప్ కమెడియన్ కునాల్ కామ్రా ఎదుర్కోవలసి వచ్చింది. ఈ కేసులను ముంబై ఖేర్ పోలీసుస్టేషన్‌కు బదిలీ చేశారు. ఒక కోర్టు తనకు తాత్కాలిక ఉపశమనాన్ని మంజూరు చేసింది. దర్యాప్తుకు సహకరించాలని ఆదేశించింది. అరెస్టు చేయలేదు.
ప్రజాకర్షక వ్యక్తి , కంటెంట్ సృష్టికర్త రణవీర్ అలహాబాదియాతో పాటు స్టాండ్- అప్ కమెడియన్ సమయ్ రైనా ఇతరులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.
ప్రజావేదికలపై అసభ్యకరమైన లైంగిక విషయాలను ప్రోత్సహించారంటూ ఫిర్యాదుదారులు ఆరోపించారు.
దర్యాప్తు కొనసాగుతుందని నొక్కి చెపుతూ, ఈ ప్రదర్శన దాని సృష్టికర్తలపై వచ్చిన తీవ్రమైన ఆరోపణలను తక్కువగా చూడరాదని సుప్రీంకోర్టు చెప్పింది. అంతేకాకుండా “నైతికత, మర్యాదను” ఖచ్చితంగా పాటించాలనే కఠిన షరతును విధిస్తూ, తమ పాడ్‌కాస్ట్‌ను కొనసాగించడానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
ఈ వ్యాసాన్ని outlookindia వెబ్సైట్ సౌజన్యంతో ది వైర్ తెలుగు పాఠకులకు అందిస్తున్నాము.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
