♦ పశ్చిమాసియాలో మూడు వారాలుగా కొనసాగుతున్న విధ్వంసం
♦ భారత్‌పై యుద్ధ ప్రభావం గురించి పార్లమెంట్లో ప్రధాని ప్రసంగం
ఈ దాడుల్లో ఇరాన్లో 1,500 మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోగా, లెబనాన్‌లో 1,000కి పైగా పౌరులు బలయ్యారు.
ఇజ్రాయెల్‌లో 15 మంది, 13 మంది అమెరికా సైనికులతో పాటు- గల్ఫ్ ప్రాంతంలో భూమి, సముద్రంపై అనేక మంది పౌరులు ఈ యుద్ధం వల్ల ప్రాణాలను విడిచారు.
భారత్‌లో ఎల్పీజీ సంక్షోభం తీవ్రత పట్ల ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత కఠినమైన హెచ్చరికలను జారీ చేశారు.
48 గంటల్లోగా హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవకపోతే ఇరాన్ విద్యుత్ కేంద్రాలను “నామరూపాల్లేకుండా” చేస్తామని బెదిరించారు.
అటువంటి దాడులు ఏవైనా జరిగితే, తమను తాము రక్షించుకునే క్రమంలో అమెరికా- ఇజ్రాయెల్ ఇంధన, మౌలిక సదుపాయాలపై దాడులతో బదులిస్తామని టెహ్రాన్ స్పష్టం చేసింది.

అమెరికా, ఇజ్రాయెల్ దాడుల వల్ల ఇరాన్‌పై రగులుకున్న ఈ విధ్వంసకర యుద్ధం ఇప్పుడు నాలుగో వారంలోకి ప్రవేశించింది.
ఈ దురాక్రమణ కారణంగా ఇరాన్లో 1,500 మందికి పైగా, లెబనాన్‌లో 1,000కి పైగా ప్రాణాలు గాలిలో కలిశాయి.
ఇజ్రాయెల్‌లో 15 మంది, 13 మంది అమెరికా సైనికులతో పాటు గల్ఫ్ ప్రాంతంలో అనేక మంది పౌరులు మరణించారు.
అమెరికా- ఇజ్రాయెల్ ద్వయం చేస్తున్న దాడుల వల్ల లెబనాన్, ఇరాన్లలో లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లను కోల్పోయి తీవ్ర విషాదంలో నిరాశ్రయులుగా వీధినపడ్డారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
