లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై 2026 ఫిబ్రవరి 10న కాంగ్రెస్ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.
ఈ సందర్భంలో, తీర్మానంపై పునరాలోచించుకునేందుకు స్పీకర్‌కు కొంత సమయం ఇవ్వాలని భావిస్తున్నట్టు టీఎంసీ వెల్లడించింది.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుపై సంతకం చేసేందుకు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీలు ముందు నిరాకరించారు.
ఆ తర్వాత కొన్ని వారాలకు, ఈ తీర్మానం మళ్లీ చర్చకు వచ్చింది.
అయితే ఉభయ సభల్లోని తమ పార్టీ ఎంపీలు ఈ తీర్మానానికి మద్దతు ఇస్తారని తమకు సమాచారం అందినట్టు ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ కథనం పేర్కొంది.
తీర్మానానికి మద్దతు ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తమ ఎంపీలను ఆదేశించినట్టు ఇద్దరు టీఎంసీ ఎంపీలు ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’కు తెలియజేశారు.
అయితే రాజ్యసభలో టీఎంసీకి 12 మంది సభ్యులు ఉండగా, లోక్‌సభలో 28 మంది సభ్యులు ఉన్నారు.
ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం: నేపథ్యం
మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే “అప్రచురిత జ్ఞాపకాల” గురించి సభలో మాట్లాడేందుకు లేదా ఉదహరించేందుకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి స్పీకర్ అనుమతి నిరాకరించారు.
దీంతో ఫిబ్రవరి 10న ప్రతిపక్షాలు 118 మంది ఎంపీల సంతకాలతో స్పీకర్ బిర్లాపై అవిశ్వాస తీర్మాన నోటీసును సమర్పించాయి.
సభలో దాడి జరిగే అవకాశమున్నందున ప్రధాని మోదీని సభకు రావొద్దని తాను సూచించినట్టు కూడా బిర్లా పేర్కొన్నారు.
సభలో ఆటంకాల నడుమ ఎనిమిది మంది ప్రతిపక్ష ఎంపీలను ఓం బిర్లా సస్పెండ్ చేశారు. బడ్జెట్ సమావేశాల తొలి అర్ధభాగంలో, ఆయనపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసును లోక్‌సభ సెక్రటేరియట్ స్వీకరించిన తర్వాత, ఈ సమస్య పరిష్కారమయ్యే వరకు బిర్లా సభకు అధ్యక్షత వహించకుండా దూరంగా ఉన్నారు.
ఆ బాధ్యతను ప్యానెల్ ఆఫ్ చైర్పర్సన్స్కు అప్పగించారు.
తదుపరి పరిణామాలు
ఒకవేళ తీర్మానాన్ని స్వీకరిస్తే, సభలో దానిపై చర్చ జరుగుతుంది. ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లకూడదని ప్రతిపక్షాలు భావిస్తే, మార్చి 9న అది సభ ముందుకు వచ్చినప్పుడు నోటీసును ఉపసంహరించుకోవచ్చు.
కాంగ్రెస్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టినప్పుడు, ఈ అంశాలపై పునరాలోచించుకునేందుకు స్పీకర్‌కు కొంత సమయం ఇవ్వాలని భావిస్తున్నట్టు టీఎంసీ అప్పట్లో పేర్కొంది.
లోక్‌సభలో టీఎంసీ పార్లమెంటరీ పార్టీ నేత అభిషేక్ బెనర్జీ అప్పట్లో మాట్లాడుతూ, తమ పార్టీ “మరింత సంయమనంతో వ్యవహరించాలని నమ్ముతోందని”, అంతేకాకుండా నోటీసు ద్వారా “బలప్రదర్శన” చేయాలనుకోవడం లేదని స్పష్టం చేశారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
