
అదే చిహ్నంతో, విలువను చారిత్రకంగా నిర్దిష్ట సామాజిక వాస్తవికతను సూచిస్తున్న నిర్దిష్ట వర్గంగా కూడా చూడాలి. ఈ పదాన్ని తరచుగా తప్పుగా అర్ధం చేసుకుకున్నారు.
సరుకు విలువను కలిగి ఉంటుంది. ఎందుకంటే ఇది సంగ్రహించిన శ్రమ సమ్మేళనమని మార్క్స్ చెప్పాడు. సరుకును సృష్టించడానికి ఉత్పత్తి సాధనాలూ, ముడి పదార్థాలు కూడా అవసరమని అర్ధశాస్త్రవేత్తలు అభ్యంతరం తెలిపారు. ఖచ్చితంగా చెప్పాలంటే ఇది అలా ఉంది. ఇది ఏ విధంగానూ మార్క్స్ ప్రకటనకు విరుద్ధంగా లేదు.
శ్రమ మాత్రమే సంపాదనకు మూలమని ఖచ్చితంగా మార్క్స్ చెప్పలేదు. ఉపయోగ విలువగా సరుకులను గురించి అతనిలా చెప్పాడు:‘వాటిపై ఖర్చు చేసిన ఉపయోగకరమైన శ్రమను మనం తీసివేస్తే, మనిషి సహాయం లేకుండా ప్రకృతి చేత అమర్చబడిన పదార్ధ అడుగుతట్టు ఎల్లప్పుడూ మిగిలి ఉంటుంది.’ శ్రమచే ఉత్పత్తి చేయబడిన ఉపయోగ విలువల భౌతిక సంపదకు శ్రమ మాత్రమే మూలం కాదు. విలియంపెట్టీ గమనించినట్లు ‘శ్రమ తండ్రి, భూమి తల్లి’(స్పష్టంగా, ఉత్పత్తి సాధనాలు శ్రమ, ప్రకృతి ద్వారా అందించబడిన పదార్దాలకు తమంతట తామే తగ్గవచ్చు). ఇక్కడ విలువ అంటే అర్ధమేమిటో అర్ధం చేసుకోవడంలోని అతని వైఫల్యమే అర్ధశాస్త్రవేత్త గందరగోళానికి మూలం.
అయితే, కొంత నైతిక దృష్టితో అర్ధం చేసుకోవడం జరిగింది. అందువలన శ్రమ సాధనాలుగా, మూలధనంతో తప్పుగా గుర్తించి, విలువైన వాటిగా కూడా చూపాలనే ఆతృత; లేదా దానిని పూర్తిగా ఆధ్యాత్మిక/ విశేషమైన, మార్కెట్లో ధరలుగా, ఏకైక వాస్తవంగా చూసారు. తరువాతి అభిప్రాయానికి సంబంధించి ‘స్వేచ్ఛా వాణిజ్య ఆధునిక వ్యాపారుల గురించిన’ మార్క్స్ వ్యాఖ్య చాలా సముచితమైనది. వారికి అక్కడ తత్ఫలితంగా ‘విలువ’ కానీ విలువ పరిమాణం కానీ సరకుల మార్పిడి సంబంధాల ద్వారా అంటే వర్తమాన రోజువారీ ధరల పట్టికలో దాని వ్యక్తీకరణలో తప్ప ఎక్కడా లేవు’.
పూర్తిగా సామాజిక వాస్తవికతను కలిగిన సరుకుల విలువ..
మార్క్సిస్టు దృక్పథంలో, విలువ సరుకుల సామాజిక లక్షణం, ఒక సామాజిక సంబంధం: ‘సరుకుల విలువ పూర్తిగా సామాజిక వాస్తవికతను కలిగి ఉంది’, ‘పూర్తిగా వ్యతిరేకమైన వాటి సారాంశంపై ముతక భౌతికత్వం’; ‘దాని కూర్పులోకి పదార్ధం అనుమాత్రంగా కూడా చేరదు.’
పైన పేర్కొన్న అంశాలను ఈ క్రిందివిధంగా సంగ్రహం చేయవచ్చు. అన్ని సమాజాల్లోనూ మానవ శ్రమ ప్రతి ఉత్పత్తీ ఒక ఉపయోగ విలువ. కానీ అది ఖచ్చితమైన సామాజిక అభివృద్ధి దశలో, ఒక నిర్దిష్ట చారిత్రక యుగంలో మాత్రమే, ఈ ఉత్పత్తులు సరకులుగా మారుతాయి. ఉపయోగ విలువను ఉత్పత్తి చేయడంలో వెచ్చించిన శ్రమ దాని వస్తుగత లక్షణంగా అంటే, దాని విలువగా వ్యక్తీకరించబడుతుంది. సరుకు ఉపయోగ విలువ అంశం దాని ఉత్పత్తిలోకి వెళ్ళిన/ చేరిన ప్రత్యేకమైన నిర్దిష్ట శ్రమకు(ఉదాహరణకు, ప్రత్తి నుండి నూలు వడకడం, నూలు నుండి బట్ట నేయడం) అనుగుణంగా ఉంటుంది. విలువ అంశం సాధారణంగా వాస్తవానికి ఖర్చయిన మానవ శ్రమకు అంటే ఉత్పత్తిలో పాల్గొన్న సంగ్రహించిన శ్రమకు అనుగుణంగా ఉంటుంది.
విలువకూ(సరకుల ఉత్పత్తి యుగానికి చెందిన ఖచ్చితమైన సామాజిక సంబంధాన్ని సూచిస్తున్న దాన్ని ఇప్పుడు చూడవచ్చు), సంగ్రహించిన శ్రమకూ లేదా సాధారణంగా శ్రమకూ మధ్య ఉన్న సంబంధం ఈ దిగువ విధంగా ఉంటుంది:
విలువ వ్యక్తీకరణలోని రహస్యం అనగా అన్ని రకాల శ్రమలూ సమానం, సమతుల్యం, ఎందుకంటే ఇప్పటి వరకూ అవి సాధారణంగా మానవ శ్రమగానే ఉన్నందున, మానవ సమానత్వ భావన జనాదరణ పొందిన దురభిమాన స్థిరత్వాన్ని ఇప్పటికే సాధించినంత వరకూ అర్ధం చేసుకోవడం సాధ్యం కాదు. ఏమైనప్పటికీ శ్రమ ఉత్పత్తిలో అత్యధిక భాగం సరుకుల రూపం తీసుకున్న, దీని ఫలితంగా మనిషికీ మనిషికీ మధ్య ఉన్న ప్రబలమైన సంబంధం సరకుల యజమానుల మధ్య సంబంధంగా ఉన్న సమాజంలో మాత్రమే ఇది సాధ్యం.
సరుకులపై వ్యామోహం/ఆరాధన (సరకుల ఫెటిసిజం) సరుకు ముందస్తు విశ్లేషణ, సరుకు ఉత్పత్తిని వర్గీకరించే సామాజిక సంబంధాల వ్యవస్థను బయటకు తీసుకు రావడానికి తోడ్పడింది. వ్యక్తుల వ్యక్తిగత ఖాతాలో, మార్పిడి చేసే ఉద్దేశంతో వాటిని క్రమపద్దతిలో ఉత్పత్తి చేసినప్పుడు మాత్రమే మానవ శ్రమ ఉత్పత్తులు సరుకులుగా మారుతాయి. సరుకుల మార్పిడి నిష్పత్తుల సమస్య పూర్తిగా పరిమాణాత్మక అంశానికి మాత్రమే అంటే, కనిపించే రూపాల స్థాయికి లేదా సమాజ ఉపరితలంపై కనిపించే విషయాలకు మాత్రమే మనం పరిమితం చేసుకుంటే, ఉత్పత్తి అంతర్లీన సామాజిక సంబంధాల విషయంలో మనం ఒక అవగాహనకు రాలేము.
సరుకుల ఉత్పత్తి ఆధిపత్యం వహిస్తున్న సమాజంలో, సామాజిక ఉత్పత్తి సమయంలో ప్రజలు ఏర్పరచుకునే సంబంధాలు సమాజ ఉపరితలంపై నేరుగా వ్యక్తీకరించబడవు. అందుకు బదులుగా సరుకుల మధ్య ఈ సంబంధాలు(సమాజంలోని ఉత్పత్తి దారుల మధ్య), వారి శ్రమ ఉత్పత్తులైన సరకుల మధ్య(మారకం) సంబంధాల రూపం తీసుకుంటాయి. ఆ విధంగా, ఉత్పత్తిదారుల మధ్య గల సామాజిక సంబంధాలను(వారిచే త్పత్తి చేయబడిన) వస్తువుల మధ్య సంబంధాలుగా సరుకుల రూపం మాయ చేస్తుంది. మార్క్స్ ఈ విషయాన్ని ఈ క్రింది విధంగా చెప్పాడు:
అందుచేత ఒక సరుకు భావగర్భితమైనది ఎందుకంటే దానిలో ఉత్పత్తిదారుల సంబంధాలు ఉత్పత్తి దారులకు తమ స్వంత శ్రమ మొత్తంతో ఉన్న సంబంధాన్ని వారి మధ్య సామాజిక సంబంధంగా కాకుండా వారి శ్రమల త్పత్తుల మధ్య సంబంధంగా చూపబడుతుంది. ఖచ్చితంగా మనుషుల మధ్య సామాజిక సంబంధం వారి దృష్టిలో వస్తువులమధ్య గల సంబంధ విచిత్ర రూపాన్ని దాల్చుతుంది. దీనిని నేను ఫెటిసిజమని పిలుస్తాను. అవి సరుకులుగా ఉత్పత్తి అయిన వెంటనే శ్రమ ఉత్పత్తులకు తనను తాను ఇది జతచేస్తుంది. అది సరుకుల ఉత్పత్తి నుండి విడదీయలేనిది.
గణనీయమైన సరుకుల ఉత్పత్తి లేని సమాజాన్ని పరిగణనలోకి తీసుకుంటే, సరుకుల ఫెట్టిష్ లక్షణానికి సంబంధించిన విషయాన్ని బాగా అర్ధంచేసుకోగలం. పురాతన భారత దేశంలోని స్వయంపోషక గ్రామీణ సమాజంలో ఉదాహరణకు అక్కడ శ్రమ సామాజిక విభజన ఉంది. కానీ వడ్రంగి, కమ్మరి వంటి వివిధ చేతి వృత్తుల వారి ఉత్పత్తులు సరకులు కాలేదు. అందుకు బదులుగా వారి శ్రమ నేరుగా సామాజిక శ్రమగా చూడబడింది.
అంతేకాకుండా వారి ఉత్పత్తులకు, ఒకదానితో మరొకదానికి మార్పిడి విలువల ద్వారా సంబంధం ఏర్పరచబడడం ద్వారా, ఆవిధంగా ఏర్పాటు చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ ఉత్పత్తిదారులు మొత్తం గ్రామ సమాజం కోసం నేరుగా పనిచేస్తున్నందున వారు శ్రమను ‘స్వతంత్రంగానూ, వ్యక్తుల వ్యక్తిగత ఖాతాలోనూ’ చేయడం లేదు. అందువలన సరకు-రూపం మధ్యవర్తిత్వం వహించి వారి నిర్దిష్ట శ్రమలను సామాజిక శ్రమగా చేయవలసిన అవసరం లేదు. ఉత్పత్తిదారుల మధ్య ఉత్పత్తి సంబంధం నేరుగానూ స్పష్టంగానూ ఉంది. ఉత్పత్తుల మధ్య సంబంధంగా వ్యక్తీకరించబడలేదు.
మరొక ఉదాహరణగా వివరించవలసిన విషయంగా మధ్య యుగాలలో యూరపు భూస్వామ్య నిర్మాణం ఉంటుంది. ఉత్పత్తి సామాజిక సంబంధాలను ఇక్కడ వర్గీకరించేది, యజమానికీ దాసునికీ మధ్య ఉన్న లేదా రాజుకు సామంత రాజుకీ మధ్య ఉన్న వ్యక్తిగతంగా ఆధారపడే సంబంధం. దాసుడు నేరుగా యజమానికి సేవలందిస్తాడు. యజమానికీ, దాసులకీ మధ్య సంబంధాలకు వారి శ్రమ ఉత్పత్తుల మధ్యవర్తిత్వం లేదు. నేరుగానూ స్పష్టంగానూ ఉన్నాయి. ఆ విధంగా సమాజంలో మరలా ‘వ్యక్తుల మధ్య సామాజిక సంబంధాలు వారి శ్రమ పనితీరులో శ్రమ ఉత్పత్తుల మధ్య సామాజిక సంబంధాల రూపంలో మారువేషంలో లేవు’.
సామాజిక వాస్తవికతను, ఆధునిక పెట్టుబడిదారీ సిద్ధాంతాన్ని అర్ధం చేసుకోడంలో వస్తు పూజ దృగ్విషయానికి చాల అంతరార్ధాలు ఉన్నాయి. సమగ్రంగా సంగతి అట్లా ఉండనివ్వండి, విస్తృతంగా అంతరార్ధాలను విచారణ చేసే ప్రయత్నం చేయకూడదు. కానీ అందుకు బదులుగా పాఠకులకు ఎన్ గేరాస్ అద్భుతమైన వ్యాసాన్ని(చదవమని) సూచించాలి.
వస్తు పూజ తన ప్రభావాలను వట్టి మాయగా, ఆధిపత్యంగా, రెండు విధాలుగా వ్యక్తీకరిస్తుంది. వ్యక్తుల మధ్య గల సామాజిక సంబంధాలను వస్తువుల(వాటి ఉత్పత్తులు సరకులుగా) మధ్య గల సామాజిక సంబంధాలుగా చూపడం నుండి వట్టిమాయ తలెత్తుతుంది. చారిత్రకంగా నిర్దిష్ట సామాజిక సంబంధాలను సహజ లేదా శాశ్వతమైన సంబంధాలుగా పరిగణించడంలో తప్పనిసరిగా ఉంటుంది.
పెట్టుబడిదారీ అర్ధశాస్త్రంలో మూలధన భావన ఒక శాస్త్రీయ ఉదాహరణ. తక్షణ ఉత్పత్తిదారుడి(కార్మికుడి) నుంచి ఉత్పత్తి సాధనాలను పెట్టుబడిదారీ విధానం క్రింద వేరుచేయడంతో, ఉత్పత్తి సాధనాలపై పెట్టుబడిదారీ వర్గ గుత్తాధిపత్యంతో ఈ సాధనాలు ఇప్పుడు మూలధనంగా మారాయి. ఈ మార్క్సిస్టు భావనలో, మూలధనం ఒక నిర్దిష్ట సామాజిక సంబంధంగా కనిపిస్తుంది. కానీ పెట్టుబడిదారీ సమాజాన్ని శాశ్వతమైనదీ, సహజమైనదమని(తప్పనిసరిగా చైతన్యయుతంగానే కాకపోయినా) పరిగణించే పెట్టుబడిదారీ అర్ధశాస్త్రవేత్త సమాజాన్ని విశ్లేషించడంతో సంబంధం లేకుండా ఉత్పత్తిసాధనాలను మూలధనంతో చూడడం ప్రారంభించాడు. ఆ విధంగా ఆదిమ వేటగాని విల్లు, బాణం లేదా పురాతన జాలరి వల లేదా ఆధునిక పెట్టుబడిదారీ యాజమాన్యంలోని లేతు మిషన్ అన్నీ కూడా అర్ధశాస్త్రవేత్తకు ఒకే విధమైన మూలధనం.
ఈ విధంగా ఒక నిర్దిష్ట సామాజిక సంబంధం ‘మూలధనం’ ఉత్పత్తి సాధనాల సహజ ఆస్తిగా అన్వయించబడింది. సరుకులను గురించి ఇదే విధమైన అభిప్రాయం ఏర్పడింది. సరుకుల ఉత్పత్తి ప్రారంభదశలో ఆర్ధిక వ్యవస్థ సరుకులకు చెందని లక్షణం ప్రధానంగా ఉండేది.
సరుకుల చారిత్రక నిర్దిష్ట లక్షణం ఇప్పటికీ స్పష్టంగా గ్రహించడం జరిగింది. ఇంకా అభివృద్ధి చెందడం, సరుకుల ఉత్పత్తి ఆధిపత్యం సంభవించడం. ఏమైనప్పటికీ, ఉత్పత్తులకు సరుకుల ముద్ర వేస్తున్న లక్షణం, సరుకుల చలామణికి దేని స్థాపనం ప్రాథమికమో, అది సహజ సిద్ధత్వాన్ని, సామాజిక జీవిత స్వీయ అవగాహనను, మనిషి వాటి అర్ధాన్ని విడదీసే ముందు, అతని దృష్టిలో అవి మార్పులేనివి అయినందున వాటి చారిత్రక పాత్రను కాదు, వాటిని ఇప్పటికే పొందింది. (With the further development and eventual dominance of commodity production, however, the characters that stamp products as commodities, and whose establishment is a necessary preliminary to the circulation of commodities, have already acquired the stability of natural, self-understood forms of social life, before man seeks to decipher, not their historical character, for in his eyes they are immutable, but their meaning.)
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధ శాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది తొమ్మిదవ భాగం, ఎనిమిదవ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.