వీటన్నిటి నికర ప్రభావం, మూలధన నిల్వల మొత్తం విలువ పడిపోవడం, ఉత్పత్తి సాధనాలను(సంక్షోభం కొంత కాలం అమలులో ఉన్న తరువాత) అత్యవసరంగా మార్చడం, వేతనాలను తగ్గించడం. ఈ విధంగా లాభాల రేటు పెంచబడుతుంది, సంక్షోభానికి పూర్వపు స్థాయికి పునరుద్ధరించబడుతుంది.
ప్రభావంలో , “ఉత్పత్తి స్తబ్ధత పెట్టుబడిదారీ పరిమితులలో ఉత్పత్తి తదుపరి విస్తరణకు సిద్ధం చేస్తుంది”. ఈ విధంగా ఇది స్పష్టమే (a) లాభాల రేటు తగ్గే ధోరణిని పెట్టుబడిదారీ సంక్షోభాలకు మూలంగా మార్క్స్ చూశాడు. (b) లాభాల రేటు పునరుద్ధరణకు. పునరుద్ధరించిన పెట్టుబడి విస్తరణకు సంక్షోభాలను సాధనాలుగా మార్క్స్ చూశాడు.
సంక్షోభాలు, వలయాలు..
ఆ విధంగా, పెట్టుబడిదారీ విధానం క్రమానుగతంగా సంక్షోభాలను ఎదుర్కొంటున్నట్టుగా కనబడుతుంది. ఈ సంక్షోభాలు పెట్టుబడిదారులు ఆశించిన లాభాలను అర్జించని పరిస్థితులు, కానీ నష్టాలు లేదా తగ్గినా లాభాలతో బాధపడతారు, తమ సరుకులను అమ్ముకోలేక పోతారు, కార్మికులు పెద్ద సంఖ్యలో తొలగించబాడతారు. సంక్షోభాలు, దాని ప్రణాళిక లేని పాత్ర(అసమానత); ఉత్పత్తి శక్తుల అభివృద్ధి ప్రక్రియలో అంతర్లీనంగా ఉన్న వైరుధ్యాలు( లాభాల రేటు తగ్గే ధోరణి); సామాజిక ఉత్పత్తి శక్తి వేగవంతమైన పెట్టుబడిదారీ అభివృద్ధికీ, సామాజిక వినియోగ శక్తి పరిమిత అభివృద్ధికీ మధ్య వైరుధ్యం(అల్పవినియోగ ధోరణి)వంటి పెట్టుబడిదారీ విధానం కొన్ని కొన్ని ప్రాథమిక అంతర్గత వైరుధ్యాల ఉత్పత్తి. సంక్షోభాల ద్వారా ఖచ్చితంగా పరిస్థితులు చక్కబడతాయి, తద్వారా పెట్టుబడిదారీ విస్తరణ మరోసారి జరుగుతుంది. సంక్షోభాలు ఈ కర్తవ్యాలు నిర్వహిస్తాయి.
(i) స్థిర– అస్థిర పెట్టుబడుల అంశాలను విలువను వేగంగా తగ్గించడానికి అనుమతించడం ద్వారా బలవంతపు మూతకు గురైన కాలంలో అరుగుదల, ఉత్పత్తి సాధనాల ధరలు బాగా తగ్గడం(ii) నిరుద్యోగ సైన్యాన్ని పెంచడం, కార్మికుల వేతనాలను తగ్గించడం. ఆర్ధిక సంక్షోభాలు, పెట్టుబడిదారీ ఉత్పత్తి విధాన ప్రాథమిక ఆర్ధిక వైరుధ్యాలు కనబడడం(అభివ్యక్తమవడం), విలక్షణమైన పెట్టుబడిదారీ పరిష్కారం రెండూ కూడా.
కొన్ని కుట్ర సిద్ధాంతాలు సూచించిన విధంగా పరిష్కారం వాస్తవానికి పెట్టుబడిదారీ వర్గ ప్రతినిధులు నిర్ణయించిన చైతన్యంతో కూడినది కాదు. కానీ పెట్టుబడిదారీ ఆర్ధిక విధానంపై వ్యక్తుల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా వస్తుగత నియమాలు విధించినవి.
పెట్టుబడిదారీ విస్తరణ, సంక్షోభాల ప్రత్యామ్నాయ కాలాలను ఆర్ధిక వ్యవస్థ అభివృద్ధికి సాధారణ మార్గాలుగా మార్క్సిస్టు అర్ధశాస్త్రం ఎల్లప్పుడూ గుర్తించిందని నొక్కి చెప్పాలి. వాస్తవానికి మార్క్స్ సైద్ధాంతిక విశ్లేషణ అటువంటి నమూనాను పెట్టుబడిదారీ విధాన ప్రాథమిక చలన సూత్రంగా(నియమంగా)సూచించింది. పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్థ విరుద్ధ లక్షణాల నుంచి దాని అసాధ్యతను ఊహించే, అటువంటి విశ్లేషణ పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్థలో సమతుల్యతను, సామరస్యాన్ని కనుగొన్నట్లు నటించే సమకాలీన పెట్టుబడిదారీ ఆర్ధిక సిద్ధాంతానికీ, పెటీ బూర్జువా (చిన్న పెట్టుబడిదారుల) విలక్షణ ధోరణులకు రెంటితో పదునైన వ్యత్యాసాన్ని కలిగి ఉంది.
సంక్షోభాలు పెట్టుబడిదారీ పునరుత్పత్తి ‘సాధారణ’ ప్రక్రియకు సంభవించే, గణనీయ సమయం వరకు కొనసాగే, అంతరాయ కాలాలను– స్తబ్దతను లేదా లేదా దీర్ఘ కాలంపాటు మందకొడిగా సాగే అభివృద్ధిని సూచిస్తాయి. పెట్టుబడిదారీ విధాన చరిత్రలో ఆటువంటి దశల తరువాత ఉత్పత్తి విస్తరించే దశలు ఉంటాయి. ఈ దశలలో ఉత్పత్తిశక్తులలో అభివృద్ధి వేగంగా సంభవిస్తుంది, మార్కెట్లు విస్తరిస్తాయి.
ఆ కారణంగా సంక్షోభాలు నియమిత కాలంలో సంభవించే స్వభావం ఒకటి ఉంది. దీర్ఘకాలంలో ఒక దాని తరువాత ఒకటి సంభవించే సంక్షోభం, పెరుగుదల వలయాలే(cycles)కాకుండా, పెట్టుబడిదారీ ఆర్ధిక వ్యవస్థలో ఆర్ధిక వ్యవస్థ పెరిగే, మందగించే స్వల్పకాల వలయాలు కూడా ఉంటాయి.
ఒక ప్రణాళిక లేని పెట్టుబడిదారీ విధాన స్వభావం, మూలధన పరికరాల(capital equipment) మన్నికకు సంబంధించిన సమస్యలు, డిమాండు- సరఫరాలలో తాత్కాలికంగా కలిగే మార్పుల వలన సంభవించే ధరలలో హెచ్చు తగ్గుల వలన ఈ స్వల్పకాల వలయాలు సంభవిస్తాయి. కాల వ్యవధికి సంబంధించి ఇవి చాలా చిన్నవిగా ఉంటాయి. అంత తీవ్రంగా ఉండవు. పెట్టుబడిదారీ వ్యాపార వలయాల విశ్లేషణ ఈ స్వల్పకాలిక హెచ్చుతగ్గులపైనే సాధారణంగా దృష్టి కేంద్రీకరిస్తుంది.
వేగవృద్ధి సూత్రం సామర్ధ్యంలో అడ్డంకులు(principle of acceleration….capacity bottlenecks), మొదలైన భావాలను ఈ విషయాన్ని వివరించడానికి వినియోగిస్తారు. ఇది, ఎవరైనా వాదనలోకి తెచ్చే పెట్టుబడిదారీ విధానంలో ఉండే ఈ మౌలిక వైరుధ్యాన్ని ఈ హెచ్చుతగ్గులను వివరించడం ద్వారా వెల్లడించలేము.
డబ్బులు– ఋణం..
పెట్టుబడిదారీ విధానంపై మార్క్స్ విశ్లేషణపై మన సంక్షిప్త, ప్రాథమిక వివరణలో, మనం చాలా ముఖ్యమైన అంశాలను వదిలివేశాము. డబ్బులు, ఋణ అంశాలు ముఖ్యమైనవి. ఋణ వ్యవస్థ ప్రత్యేకించి సంక్షోభాలపై చర్చలకు సంబంధించినది. పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం అభివృద్ధితో, పెద్ద ఎత్తున పెట్టుబడిదారీ కార్యకలాపాలను సులభతరం చేయడానికి; పెట్టుబడికీ, ఉత్పత్తి చేసిన సరుకులను అమ్మడానికి మధ్య గణనీయమైన సమయం గడిచిపోయే, కార్యకలాపాలకు అనుగుణంగా మూలధన పెట్టుబడిని సాధ్యం చేయడానికి ఋణ వ్యవస్థ పుట్టింది.
మొత్తం మీద డబ్బు ఇక్కడ కేవలం చెల్లింపు సాధనంగా పనిచేస్తుంది, అంటే డబ్బులకు సరుకులు అమ్మరు. కానీ, ఒక నిర్దిష్ట తేదీకి ఎవరికైతే చెల్లించడానికి రాతపూర్వక హామీ ఇచ్చారో వారికి డబ్బు రూపంలో చెల్లిస్తారు. సంక్షిప్తత కొరకు మనం ఈ ప్రామిసరీ నోట్లను అన్నిటినీ మార్పిడి బిల్లుల జాబితాలో చేర్చవచ్చు. అటువంటి మార్పిడి బిల్లులవి చెల్లింపవలసిన తేదీ వరకు అవి చెల్లింపు సాధనాలుగా పంపిణీ అవుతాయి.
మార్పిడి బిల్లులు, తీసుకునే మొదటి రూపం రుణ ధనం, ఆ విధంగా పెట్టుబడిదారుల మధ్య లావాదేవీలలో ఆచరణాత్మకంగా డబ్బులుగా ఉపయోగపడతాయి.(అవి చట్టబద్దమైన చెల్లింపులు కానప్పటికీ). అలా చేయడం ద్వారా డబ్బుల- వస్తువుల(బంగారం లేదా వెండి లాగా)లేదా ప్రభుత్వం విడుదల చేసిన కాగితం కరెన్సీ(కాగితపు ద్రవ్యం) నాణ్యతతో సంబంధం లేకుండా స్వతంత్ర పెట్టుబడిదారీ విస్తరణకు అవి ఉపయోగపడతాయి. మరింత అభివృద్ధి చెందిన ఋణ వ్యవస్థ డబ్బులంతా బాగా పనిచేస్తున్న బ్యాంకు డిపాజిట్ల వినియోగానికి దారితీసింది. అంటే చేసిన కొనుగోళ్ళ చెల్లింపులకూ, అప్పుల పరిష్కారానికీ విస్తృతంగా అంగీకరించబడుతున్నది.
మార్పిడి బిల్లులు, బ్యాంకు నోట్లు నుంచి నేటి బాగా అభివృద్ధి చెందిన బ్యాంకింగ్ వ్యవస్థ వరకు ఋణ వ్యవస్థ అభివృద్ధి చెందడం నగదు(అంటే కరెన్సీ, నాణాలు) వినియోగంలో పొదుపును తేవడం ద్వారానూ, పెట్టుబడిదారీ విధానం ఆర్ధిక చక్రాలు సజావుగా నడిచే కందెన వలే పనిచేయడం ద్వారానూ పెట్టుబడిదారీ విస్తరణకు బాగా దోహద పడుతున్నది.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 60వ భాగం, 59వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
