వస్తూత్పత్తిలో(ప్రత్యేకించిపెట్టుబడిదారీ ఉత్పత్తిలో) రూపాలు పూర్తిగా అస్పష్టంగా ఉంటాయో, వాస్తవ విరుద్ధంగా ఉంటాయో తెలుసుకోవడానికి ఆ తరువాతిది సాధనం. మనం అప్పుడు మూలధన వలయాన్ని M–C–M’ విలువ అనే భావం సహాయంతో అధ్యయనం చేయడానికి ముందుకు సాగాము. మారక విలువ రూపంలో(అందుకే తరువాతి దానిని విలువ అసాధారణ రూపం అని పిలుస్తాడు) విలువ వ్యక్తమౌతుందన్న విషయాన్ని గుర్తుచేసుకునే, మూలధన వలయ ప్రాథమిక విశ్లేషణ కొరకు సరుకులను వాటి విలువల వద్ద మార్చుకోవడం జరుగుతుందని భావించాము.
విశ్లేషణ సమయంలో అదనపు విలువ రహస్యాన్ని మనం కనుగొన్నాము. అదనపు విలువ ఉత్పత్తిలో ఉద్భవించిందనీ, పనిదినం నిడివికీ(లెంగ్త్)శ్రమ శక్తి విలువకూ మధ్య ఉన్న వ్యత్యాసం ఫలితమనీ గమనించాము. అ విధంగా అదనపు విలువ కార్మికుడు పెట్టుబడిదారునికి అమ్ముకునే విశిష్టమైన ఆస్తి శ్రమ శక్తి నుంచి, అంటే ఖర్చు దానిని పునరుత్పత్తికి అవసరమైన దానికన్నా ఎక్కువ విలువను ఉత్పత్తి చేయడం నుంచి ఉద్భవిస్తుంది. అప్పుడు కార్మికవర్గం పెట్టుబడిదారులకు ‘బంగారు గుడ్లు పెట్టే బాతు’.
అదనపు విలువకి పెట్టుబడిదారుల అంతం లేని తపన, పెట్టుబదిదారునికీ– కార్మికునికీ మధ్య జరుగుతున్న వర్గపోరాట క్రమంలో అనేక అదనపు విలువ ఉత్పత్తి సాధనాలు ఉద్భవిస్తాయి. వీటిని సైద్ధాంతికంగా సంపూర్ణ, సాపేక్ష అదనపు విలువ వర్గీకరణల క్రింద విశ్లేషించ వచ్చు. గత మూడు అధ్యాయాలలోనూ ప్రస్తుత అధ్యాయంలోని ముందు భాగంలోనూ మనం ఈ విశ్లేషణను వివరించాము.
వివిధ విశ్లేషణాత్మక దారాలనూ, వర్గీకరణలనూ ఒకదగ్గరకు తీసుకు రావలసిన, పెట్టుబడిదారీ ఉత్పత్తి విధాన కేంద్ర విశ్లేషణను వర్తించవలసిన సమయం ఇది. ఈ కర్తవ్యం వైపే తరువాతి అధ్యాయంలో మన దృష్టిని సారిద్దాము. తరువాత మనం నివేదించే విశ్లేషణ పరిమితులను సూచించడానికి ఇప్పుడు కొన్ని ప్రాథమిక వ్యాఖ్యలు చేస్తాము.
పెట్టుబడి సంచితం(పోగుసేత)..
మూలధన వలయం M-C దశతో ప్రారంభమవుతుంది. లేదా ప్రత్యేకంగా M అంటే డబ్బు, LP అంటే శ్రమ శక్తి, MP అంటే ఉత్పత్తి సాధనాలుగా ఉన్న LP M MP. ఈ దశ పంపిణీ (సర్క్యులేషన్) పరిధిలో జరుగుతుంది. శ్రమ సాధనాలను ఉపయోగించి ముడి పదార్ధాలను కార్మికులు కొత్త ఉత్పత్తులుగా మార్చడంతో, ఆ తరువాతి దశ C-P-C’ ఉత్పత్తి క్రమం పూర్తవుతుంది. ఇలా ఉత్పత్తి అయిన సరకు C’ అదనపు విలువను కలిగి ఉండే సంభావ్యత ఉంది. కానీ అది వాస్తవానికి విస్తరించిన విలువగా మారుతుంది.
అదనపు విలువ వాస్తవంగా గ్రహించబడాలి అంటే ఈ ఉత్పత్తి విఫణి (మార్కెట్ )లోకి వెళ్ళాలి. దాని ఉత్పత్తిలో వినిమయమైన విలువ కన్నా ఎక్కువ విలువకు దాని అమ్మకం జరగాలి. ఇది 3వ దశ C’-M’. ఈ మూడు దశలు(M-C, C-P-C’, C’-M’) ఒక దాని వెనుక ఒకటి స్థిరంగా పునరావృతం కావడమే మూలధన పంపిణీ (సర్క్యులేషన్). మన తదుపరి విశ్లేషణలో పంపిణీ (సర్క్యులేషన్) దశలు M-C, C’-M’లు నిరంతరాయంగా ప్రభావితం అవుతాయని మనం భావించి, ఉత్పత్తి దశ C-P-C’పైన మాత్రమే దృష్టిని కేంద్రీకరించాలి.
సరుకులు వాటి విలువకే మారకం అవుతున్నాయనే ఊహ, డబ్బులను (స్థిర– అస్థిర) ఉత్పాదక మూలధన అంశాలలో అంతర్భాగంగా మార్చడంలోనూ ఉత్పత్తి చేసిన సరుకులను తిరిగి డబ్బులుగా మార్చడంలోనూ తలెత్తుతున్న సమస్యలను తరువాత పరిగణనలోకి తీసుకోవాలని దీని అర్ధం. అయితే ఈ సమస్యలు ఉనికిలో ఉన్నాయనీ అవి క్రమానుగతంగా కొన్ని రకాల సంక్షోభాలకు దారితీస్తాయని మనసులో ఉంచుకోవాలి.
రెండవది, పెట్టుబడిదారీ సమాజం పెట్టుబదిదారులతోనూ, పెట్టుబడిదారుల కొరకు అదనపు విలువను సృష్టించే కార్మికులతో మాత్రమే కూడి ఉండదు. ఈ కార్మికుల నుంచి అదనపు విలువను రాబట్టే పెట్టుబడిదారులు దానిని ఇతర పెట్టుబడిదారులతో, భూస్వాములతో, మొత్తం సమాజంలో వివిధ సామాజిక విధులను నిర్వహించే అనుత్పాదక దొంతరలతో పంచుకోవాలి. దీనిని అనుసరించి వచ్చే విశ్లేషణలో ప్రస్తుతానికి మనం సామాజిక అదనపు విలువను కౌలు లేదా అద్దె, వడ్డీ, వ్యాపార మూలధనంపై లాభం, పారిశ్రామిక మూలధనంపై లాభం వగైరాలుగా విభజించే లోతుల్లోకి వెళ్ళకూడదు. ఈ అంశాలను తరువాత చేపడదాము. అందుచేత ప్రారంభించడానికి పెట్టుబడిదారీ సంచితాన్ని ‘ఒక నైరూప్య దృష్టికోణం నుంచి అంటే వాస్తవ ఉత్పత్తి ప్రక్రియలో కేవలం ఒక దశగా మాత్రమే’ పరిశీలిద్దాం.
సరైన విశ్లేషణ కోసం రెండు కారణాల వలన మనం అనుసరిస్తున్న విధానం అవసరం. మూలధనం నిర్వచించే లక్షణమైన విలువ విస్తరించడానికి మూలధన వలయం ఉత్పత్తి దశ ఖచ్చితంగా అవసరం: మొత్తం మీద సమాజంలో మొదట అది ఉత్పత్తి జరిగినప్పుడు(దోపిడీకి గురౌతున్న వర్గాలకూ, సమాజంలోని అనుత్పాదక దొంతర్లకు పంపిణీ జరిగినప్పుడు) మాత్రమే అదనపు విలువను వసూలు చేసుకోగలం. రెండవది, మూలధన సంచిత ప్రక్రియ సరళమైన ప్రాథమిక పద్ధతి అది తెస్తున్న పంపిణీ(సర్క్యులేషన్) సంఘటనతో, అదనపు విలువను విభజించడంతో అస్పష్టంగా ఉంది. అందుచేత ప్రక్రియ ఒక ఖచ్చితమైన విశ్లేషణ కొరకు కొంత కాలం పాటు దాని అంతర్గత యంత్రాంగ దృష్టికి కనిపించే విషయాలను విస్మరించండి.
కావున మనం మొదట సమస్య సారాన్ని అధ్యయనం చెయ్యాలి. ఆ తరువాత మరింత క్లిష్టమైన ‘నిర్ణయాలను’ అధ్యయనం చెయ్యాలి. ఈ విలువైన వ్యాఖ్యలను మనస్సులో ఉంచుకొని పెట్టుబడిదారీ మూలధన సంచిత విశ్లేషణకు మనం ముందుకు సాగాలి.
గమనికలు– ప్రస్తావనలు..
1 కారల్ మార్క్స్ , పెట్టుబడి, సంపుటు 1 ఇంటర్నేషనల్ పబ్లిషేర్స్, 1967, పేజీ 509.
2 Ibid., p. 523.
3 ఉదాహరణకి, జాన్ రాబిన్సన్, యాన్ ఎస్సే ఆన్ మార్క్సియాన్ ఎకనామిక్స్, మెక్‌మిలన్ అండ్ కొ., 1942, లేదా మార్క్స్‌ను సూచిస్తున్న దాదాపు ఏ బూర్జువా అర్ధశాస్త్ర పాఠ్యపుస్తకంనైనా చూడండి.
4 మార్క్స్, పెట్టుబడి, సంపుటి. 1, పేజీ 523. బయటికి విలువ నియమానికి విరుద్ధంగా ఉన్నట్లు కనపడున్నా, వాటి విలువల నుంచి సరుకుల ధరలు వైదొలగడం, వాస్తవానికి విలువ నియమం వ్యక్తీకరణ జరుగుతున్నది ఈ సాధనాల ద్వారానే. ఈ విషయాన్ని పెట్టుబడి సంపుటి 1, సంపుటి 3లలోని డబ్బు(మనీ) అధ్యాయాలు రెండింటిలోనూ మార్క్స్ అభివృద్ధి చేశాడు, మనం దీనిని గురించి తరువాత చాలా చెప్పాలి. (The deviation of prices of commodities from their values, while seemingly ‘contradicting’ the law of value, in fact is the means through which the law of value expresses itself. Marx develops this point both in the chapter on money in Capital, Vol. I and also in Vol. III, and we shall have more to say on this later on.)
5 మార్క్స్, పెట్టుబడి, సంపుటి. 1, పేజీ 527.
6 Ibid., p. 530.
7 H.బ్రేవ్‌మేన్, లేబర్ అండ్ మొనోపలీ కేపిటల్, మంత్లీ రివ్యూ ప్రెస్, 1974.
8 మార్క్స్, పెట్టుబడి, సంపుటి. 1, పేజీ 530.
9 Ibid.
10 Ibid.
11 Ibid., p. 537.
12 Ibid.
13 Ibid., p. 538.
14 Ibid., pp. 539-40.
15 Ibid., p. 546.
16 Ibid., pp. 553–54.
17 Ibid., p. 555.
18 Ibid., p. 559. గ్రామీణ ప్రాంతాల నుంచి పారిశ్రామిక కార్మిక వర్గంలోకి తీసుకోబడిన పురుషులు, వారి కుటుంబాలను వెనుక తమ గ్రామాలలో వదిలివచ్చిన మూడవ ప్రపంచానికి చెందిన నూతన వలసదేశాల విషయంలో, మహిళల, పిల్లల శ్రమ ప్రాముఖ్యతను, ప్రత్యేకించి క్రింది గీతాలు గీసి చూపించాలి. కుటుంబంలోని మహిళలూ, పిల్లలూ తమ జీవనాధారాన్ని ఉత్పత్తి చేసే ప్రయత్నాన్ని చేస్తూనే ఉన్నారు. అంతేకాకుండా పెట్టుబడిదారులు మొత్తం కుటుంబానికి కాక కార్మికుని స్వంతానికే పునరుత్పత్తికి మాత్రమే వేతనం చెల్లించాలి. (The importance of the labour of women and children must especially be underlined in the case of the neocolonial countries of the third world, where males drawn into the industrial working class from the rural areas leave their families behind. The women and children of the family continue to try and produce their own subsistence, and the capitalist has to pay the worker only to reproduce himself and not the whole family.)
19 Ibid., p. 560.
20 Ibid., p. 563. 21 Ibid., p. 565.
22 Ibid.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 33వ భాగం, 32వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
