ప్రతి పెట్టుబడిదారుని చేతిలోనూ పెద్ద, పెరుగుతున్న మూలధన కేంద్రీకరణను ఆ విధంగా తయారీ సూచిస్తుంది. ‘సామాజిక ఉత్పత్తి సాధనాలను, జీవనాధారాన్ని మూలధనంగా పరివర్తన చేయడమే’, వ్యాపారంలో పాల్గొనడానికి అవసరమైన మూలధనం కనీస వ్యయంలో నిరంతర పెరుగుదల ధోరణి ప్రాముఖ్యత. తయారే అభివృద్ధితో ఉత్పత్తి స్వభావం ఒకే సారి సామాజికంగానూ, పెట్టుబడిదారీ విధంగానూ పెరుగుతుంది.
తయారీ పరిణామం, దాని వెనుకనే వచ్చిన శ్రమ విభజనా కార్మికుడి స్వతంత్రాన్ని క్రమంగా కోల్పోయేలా చేస్తుంది. కార్మికుల అధికార శ్రేణిని అభివృద్ధి చేయడం, నైపుణ్యం గల హస్తకళాకారుడిని సాధారణ కార్మికునిగా మార్చడమే కాదు. పెట్టుబడిదారుడికి తన శ్రమను అమ్ముకోకపొతే కార్మికుని శ్రమ శక్తి కూడా నిరుపయోగమయ్యే పరిస్థితికి ఇది తీసుకువెళుతుంది. ‘సహజంగానే స్వతంత్రంగా ఏమీ చేయలేని స్థితికి నెట్టబడిన తయారీ కార్మికుడు ఉత్పాదక కార్యకలాపాలను పెట్టుబదిదారుడి వర్క్ షాప్‌కు కేవలం అనుబంధంగా మారుస్తాడు.’
మానసిక శ్రమకూ శారీరక శ్రమకూ మధ్య వైరుధ్యాన్ని వృద్ధి చేయడం పెట్టుబడిదారీ తయారీ అతి ముఖ్యమైన పరిణామం. శ్రమ విభజన అభివృద్ధి, పని ప్రక్రియ హేతుబద్ధీకరణ అవసరం, దాని పరిణామం ఫలితంగా సాధారణ కార్మికుని పని నిస్తేజంగా, మార్పులేని పూర్తిగా పరావర్తనంగా మారగా ఉత్పత్తిలో మేధో నైపుణ్యాల వాడుక ప్రోత్సహించబడుతుంది. పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాలు ఒక వైపున మేధో శ్రామికులు, శాస్త్ర విజ్ఞాన వాడుక మొదలైన వాటికీ మరొక వైపున సాధారణ శారీరక శ్రమ చేసే కార్మికునికీ మధ్య వైరుధ్యాన్ని సృష్టిస్తుంది, పెంచుతుంది.
తయారీలో శ్రమ విభజన ఫలితంగా కార్మికుడు మరొకరి ఆస్తిగా- పాలక శక్తిగా, ఉత్పత్తి భౌతిక ప్రక్రియ మేధో శక్తితో ముఖాముఖి తీసుకురాబడ్డాడు. ఒకే కార్మికుడి అనుబంధ శ్రమ ఏకత్వానికి, ఇష్టానికి పెట్టుబడిదారుడు ప్రాతినిధ్యం వహించే ఈ విభజన సాధారణ సహకారంతో ప్రారంభమవుతుంది. కార్మికుడిని ఒకే పని చేసే కార్మికునిగా కుదించడం తయారీలో అభివృద్ధి చెందింది. విజ్ఞాన శాస్త్రాన్ని శ్రమకంటే భిన్నమైన ఉత్పాదక శక్తిగా చేసి మూలధన సేవలోకి నెట్టే ఈ ప్రక్రియ ఆధునిక పరిశ్రమలో పూర్తయ్యింది.
సమీక్షించడానికి, తయారీ చారిత్రక పాత్ర ద్విముఖం. ఒక వైపున శ్రమ విభజనను అభివృద్ధి చేయడం ద్వారా ప్రావీణ్యం పెంచి శ్రమ సాధనాలను(పనిముట్లను) మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, ఒకే పని చేసే కార్మికుల కార్యకలాపాలను పునర్వ్యవస్థీకరించడం, మళ్లీ సమూహపరచడం ద్వారా ఉత్పాదక శక్తులను, తయారీ అభివృద్ధి చేస్తుంది.
సామాజిక సంస్థను, శ్రమ విభజనను మార్చడం ద్వారా అంటే నూతన ఉత్పత్తి సంబంధాలను అభివృద్ధి చేయడం ద్వారా అది నూతన ఉత్పత్తి శక్తులను సృష్టిస్తుంది. కానీ అది ఈ చారిత్రక ప్రగతిశీల పాత్ర పోషిస్తూనే, పెట్టుబడిదారీ తయారీగా అది ప్రత్యేక వర్గ లక్షణాలను ప్రదర్శిస్తుంది.
‘పెట్టుబడిదారుడి ప్రయోజనానికే కాక కార్మికుని ప్రయోజనానికి కూడా అది కార్మికుని సామాజిక ఉత్పాదక శక్తిని పెంచుతుంది. కానీ వ్యక్తిగత కార్మికులను కుంటుపరచడం ద్వారా ఇది జరుగుతుంది. ఇది కార్మికునిపై మూలధన ప్రభుస్వామ్యం కోసం కొత్త పరిస్థితులను సృష్టిస్తుంది.’
తయారీ పరిమితులు..
సాపేక్ష అదనపు విలువను ఉత్పత్తిచేసే పద్దతిగా తయారీ ముఖ్య పాత్ర పోషిస్తుందనడంలో సందేహం లేదు. ఏమైనప్పటికీ అది బ్రిటిష్ సందర్భంలో, దాని విశిష్ట లక్షణాలలో కొన్ని ఈ విషయంలో దాని సమర్ధతపై ఖచ్చితమైన పరిమితులను విధిస్తాయనే మార్క్స్ విశ్లేషణకు అనుగుణంగానే ఉంది. మొదటగా కార్మికులను నైపుణ్యం గల, నైపుణ్యం లేని వారిగా విభజించడాన్ని, అలాగే నైపుణ్యాల సోపాన క్రమాన్ని అది సృష్టిస్తున్నా అది ఈ దిశలో ఎక్కువ దూరం వెళ్ళలేదు.
నైపుణ్యం లేని కార్మిక వర్గం, నైపుణ్యం గల కార్మికులతో పోల్చినప్పుడు సంఖ్యా రీత్యా చాలా చిన్నది. ఒకే విధమైన సులభమైన పనులను మహిళలూ, పిల్లలూ చేస్తూ ఆ విధంగా వేతనాలను తగ్గిస్తున్నా ఇక్కడ దాని సంభావ్యతను పురుష కార్మికుల నుంచి ఎదురవుతున్న తీవ్ర ప్రతిఘటన కారణంగా పూర్తిగా తగినంతగా వినియోగించుకోలేరు.
చాలా ముఖ్యమైనది, తయారీకి ఆధారం హస్తకళా నైపుణ్య పునాది అయినందున దోపిడీని తీవ్రతరం చేసే, అదనపు విలువను పెంచే ప్రయత్నాలను ‘కార్మికుల అవిధేయతతో నిరంతరం కుస్తీ పట్టేటట్లు పెట్టుబడిదారులను బలవంతపెట్టడం ద్వారా’ ఇప్పటికీ కార్మికవర్గం ప్రతిఘటించగలదు. కొనసాగుతున్న చేతివృత్తుల ప్రాముఖ్యత సూచించిన ఇరుకైన సాంకేతిక పునాది, ‘ఉత్పత్తి ప్రక్రియా ఉత్పత్తిని చేతితో చేయగల సామర్ధ్యాన్ని కలిగి ఉండవలసి ఉన్నందున తన మార్గంలో ప్రత్యేక హస్తకళను రూపొందిస్తున్న కారణంగా’ శ్రమ ప్రక్రియను శాస్త్రీయంగా విశ్లేషించడాన్ని అసాధ్యం చేసింది.
తయారీ ఈ పరిమితుల నుంచి, దాని అభివృద్ధి ద్వారా అది సృష్టించిన వస్తుగత పరిస్థితుల నుంచి చాలా శక్తివంతమైన సాపేక్ష అదనపు విలువను ఉత్పత్తి చేసే విధానం చారిత్రకంగా ఆవిర్భవించింది. ‘యంత్రాలు, ఆధునిక పరిశ్రమ’ అని మార్క్స్ పిలిచిన ఈ పరిణామాన్ని తరువాతి అధ్యాయం విశ్లేషిస్తుంది.
వివరణలు- సూచనలు..
1 కార్మిక వర్గం ఈ పోరాటాన్ని విజయవంతంగా ముగించని దేశాలు చాలా ఉన్నందున మనం ఇక్కడ కొంత మేరకు సాధారణ నిబంధనలకు లోబడి మాట్లాడుతున్నాము.
2 K. Marx, Capital, Vol. I, International Publishers, 1967, p. 315.
3 Ibid., p. 317.
4 Ibid., pp. 318–19.
5 Ibid., p. 319.
6 పెట్టుబడిదారుడు పెట్టిన మొత్తం మూలధనానికీ అదనపు విలువకూ మధ్య ఉన్న నిష్పత్తిని కూడా ఇది ప్రభావితం చేస్తుంది. ఈ అంశాన్ని తరువాత పరిశీలిస్తాము.
7 Marx, Capital, Vol. I, p. 326.
8 Ibid., p. 329.
9 Ibid.
10 Ibid., p. 330.
11 Ibid., p. 331.
12 Ibid., p. 332.
13 Ibid., p. 333.
14 Ibid., p. 334.
15 Ibid., p. 341.
16 Ibid., p. 338.
17 Ibid., p. 345. 62 MARXIAN POLITICAL ECONOMY
18 Ibid., p. 355.
19 Ibid., p. 356.
20 Ibid.
21 Ibid., p. 349.
22 Ibid., pp. 36061.
23 Ibid., p. 361. ఈ సందర్భంలో హేరీ బ్రేవార్ మెన్ లేబర్ అండ్ మోనోపోలీ కేపిటల్, మంత్లీ రివ్యూ ప్రెస్ 1974 కూడా చూడండి (See also, in this connection, Harry Braverman, Labour and Monopoly Capital, Monthly Review Press, 1974.)
24 Marx, Capital, Vol. I, p. 364.
25 Ibid., p. 367.
26 Ibid., pp. 338–39.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 24వ భాగం, 23వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
