అధికార క్రమానుగత శ్రేణి– వైరుధ్యం/ వైరం..
ఆ విధంగా శ్రమ ప్రక్రియ సహకార పాత్రకు సమన్వయ ఏజన్సీ మాత్రమె అవసరం కాగా, దాని పెట్టుబడిదారీ పాత్ర అధికార క్రమానుగత శ్రేణిని, నిరంకుశ నియంత్రణను డిమాండు చేస్తుంది.
సైన్యానికి అధికారులు, సార్జెంట్లు, సాదా సైనికులతో కూడిన క్రమానుగత, అధికారస్వామ్యం ఉన్నట్లే పెట్టుబడిదార్లకు కూడా వారి నిర్వాహకులు, ఫోర్మెన్లు, దోపిడీకి గురవుతున్న కార్మికుల క్రమానుగత, అధికారస్వామ్యం ఉన్నది. సహకార శ్రమ ప్రక్రియ వంటి దానికి ఖచ్చితంగా అంతర్గత ప్రక్రియ కాని, పెట్టుబడిదారీ శ్రమ ప్రక్రియ సైనిక నిర్మాణంలో(పెట్టుబడిదారీ) బూర్జువా ప్రజాస్వామ్య కపట నాటకాలు పూర్తిగా బహిర్గతమౌతాయి.
పెట్టుబడిదారీ ఆర్ధశాస్త్రవేత్త దీనిని చూడడంలో పూర్తిగా విఫలమవుతాడు. అందుకు బదులుగా అతను, పెట్టుబడిదారీ లక్షణమైన నియంత్రణ అవసరమైన విభిన్న పనుల ఆ ప్రక్రియలో పెట్టుబడిదారులకూ కార్మికుల, ప్రయోజనాల మధ్య ఉన్న వైరుధ్యం లాగా శ్రమ ప్రక్రియ సహకార పాత్ర వలన నియంత్రణ అవసరమైనట్లు పరిగణిస్తాడు.
అనేకమంది కార్మికులు పనిలో సహకరించుకోవడానికి తీసుకు వచ్చిన విధానం కూడా శ్రమకూ మూలధనానికీ మధ్య ఉన్న సంబంధాన్ని భ్రమాత్మకం చేయడానికి తోడ్పడుతుంది. అది పెట్టుబడిదారుడే కార్మికులను ఒక చోటుకు చేరుస్తాడు అనేది. దీనికి ముందు కార్మికులు కేవలం తమ శ్రమను అమ్ముకోవలసిన విడివిడిగా ఉన్న వ్యక్తులు. సహకారం ఫలితంగా కార్మికుల ఉత్పాదకత పెరిగితే, పెరిగిన ఉత్పాదక శక్తి మూలధనం పనిగా కనపడుతుంది.
సహకారంతో పనిచేస్తున్నప్పుడు కార్మికుడు అభివృద్ధి చేసిన ఉత్పాదకశక్తి మూలధనం ఉత్పాదక శక్తి, ఎందుకంటే(Because) ఈ శక్తి కొరకు మూలధనం ఖర్చు ఏమీ చేయదు. అంతేకాకుండా(Also) అతని శ్రమ మూలధనానికి చెందదానికి ముందు, కార్మికుడు తానుగా దానిని అభివృద్ధి చేయడు. అందువల్ల(Therefore) ఇది ప్రకృతి మూలధనానికి ఇస్తున్న శక్తి, మూలధనంలోని అనూహ్యమైన ఉత్పాదక శక్తిగా కనపడుతుంది.
సహకారం గురించిన మన చర్చను సంక్షిప్తం చేయడం. అంతేకాకుండా(Also) చారిత్రక దృక్పథంతో చెప్పడం ఇప్పుడు మిగిలి ఉంది. వాస్తవ ప్రక్రియను తన చేతిలోకి తీసుకున్నప్పుడు మూలధనం ప్రభావితం చేసిన మొదటి మార్పు సహకారం. కార్మికుల ఉత్పాదకతను పెంచడానికి అది తోడ్పడుతుంది. ఇంకా(Moreover) ఆ విధంగా అది సాపేక్ష అదనపు విలువ ఉత్పత్తి సాధనం. దాని పెట్టుబడిదారీ ప్రత్యేక రూపంలో సహకారం శ్రమ ప్రక్రియ కార్మికునికీ, మూలధనానికీ మధ్య ఉన్న ప్రాథమిక వైరుధ్యాన్ని ప్రతిబింబించే నిర్మాణాన్ని/ సంస్థని సూచిస్తుంది.
ఏమైనప్పటికీ, సహకారం పెట్టుబడిదారీ ఉత్పత్తికి మాత్రమే చెందినది కాదు. మానవ నాగరికత ప్రారంభం నుంచే ఇది ఉనికిలో ఉంది. కానీ అప్పుడు దాని వర్గలక్షణం చాలా భిన్నంగా ఉండేది. ఆదిమ సమాజాలలో ఉత్పత్తి సాధనాలపై ఉమ్మడి యాజమాన్యం ఆధారంగానూ, ఇంకా చెప్పాలంటే(Furthermore) వ్యక్తి గుర్తింపు తెగ లేదా సమాజంతో ముడిపడి అది ఉండేది.
దీనికి భిన్నంగా పెట్టుబడిదారీ సహకారంలో స్వతంత్ర వేతన కార్మికుడి, ఉత్పత్తి సాధనాలపై వ్యక్తిగత యాజమాన్య అవసరం ఉంది. మార్క్స్ చెప్పినట్లు: ‘చారిత్రకంగా, రైతుల వ్యవసాయానికి, గిల్డ్‌లో ఉన్నా లేకపోయినా స్వతంత్ర చేతి వృత్తులకు వ్యతిరేకంగా ఈ రూపం అభివృద్ధి చేయబడింది.’
చివరగా(Finally) పెట్టుబడిదారీ ఉత్పత్తి విధానం అన్ని రూపాలకూ సహకారం ప్రాథమికమైనది. అయినప్పటికీ(However) దాని ప్రాథమిక స్వరూపంలో తయారీ, ఆధునిక పరిశ్రమ వంటి మరింతగా అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ ఉత్పత్తితో పాటు అనుబంధ పాత్ర పోషిస్తుంది.
తయారీ రంగంలో శ్రమ విభజన..
సహకారం రెండు రకాలుగా ఉంటుంది: అందులో ప్రతి కార్మికుడూ మొదటి నుంచి చివరివరకు మొత్తం ఉత్పత్తిని ఉత్పత్తి చేసే ప్రాథమిక లేదా సాధారణ సహకారం; అందులో కార్మికుల మధ్య పని విభజన ఉండి ప్రతి ఒక్కరూ ఒకటి లేదా కార్యకలాపాల శ్రేణిని నిర్వహించి ప్రక్రియలో ఉన్న వస్తువును తదుపరి కార్మికునికి బదిలీ చేసే మరింత అభివృద్ధి చెందిన రూపం.
శ్రమ విభజన క్రమంగా అభివృద్ధి చెందడంతో, సహకారం తన ప్రాథమిక రూపం నుంచి మరింత సంక్లిష్టమైన రూపానికి, మరింత శ్రమ విభజన ద్వారా సహకారం నుంచి తయారై అభివృద్ధి చెందుతుంది.
తయారీ ఈ రెండు విధాలలో ఏదో ఒకదాని ద్వారా అభివృద్ధి చెందుతుంది.
ఒకవైపున అనేక మంది చేతి వృత్తుల వారు ఒకే ప్రారంభ ముడి పదార్ధాన్ని వరుసగా వివిధ దశల ద్వారా అభివృద్ధి చేసిన దానిని ఒక పెట్టుబడిదారుని కర్మాగారంలో ఒకే పైకప్పు క్రింద చేయవచ్చు.
ప్రత్యామ్నాయంగా కర్మాగారంలో ఉన్న సాధారణ సహకారం ద్వారా ఒకరి ప్రక్కన ఒకరు– సూదిని తయారు చేసే అనేక మంది తయారీదారులు సూది తయారీని అనేక రకాల కార్యకలాపాలుగా విభజింఛి వీటిలో ప్రతి ఒక్క దానినీ చేతి వృత్తి వానికి కేటాయించడం ద్వారా, తయారీగా పరిణామం చెందుతుంది.
దీని పరిణామ మార్గం ఏదైనా తయారీ స్థాపన పెట్టుబడిదారీ పూర్వ సమాజంలోని చేతివృత్తుల వారు స్వేచ్ఛను కోల్పోవడాన్ని తక్షణమే సూచిస్తుంది.
వివిధ వృత్తులను చేస్తున్న హస్త కళాకారుల స్థాయి నుంచి వారు పూర్తిగా కూలీలుగా మారుతారు. అదే సమయంలో ఉత్పత్తులలో నిక్షిప్తమైన శ్రమ సామాజిక లక్షణం మరింత స్పష్టంగా తెలుస్తుంది.
సహకారం నుంచి తయారీ అభివృద్ధి చెందిన ఫలితంగా కార్మికుని ఉత్పాదకత ఇంకా పెరగడానికి జరుగుతుంది. ఇప్పుడు ప్రతి కార్మికుడూ ఒకే ఒక నిర్దిష్ట పనిని మళ్లీమళ్లీ చేస్తాడు. అంతేకాకుండా(Also) మరింత నైపుణ్యం సాధిస్తాడు.
‘పని చేస్తూ నేర్చుకునే ప్రక్రియ’ ఉత్పాదకత పెరగడానికి దోహదం చేస్తుంది.
కార్మికుని పనిముట్లైన శ్రమ సాధనాల మెరుగుదల వలన కార్మికుని ఉత్పాదకత పెరగడానికి తయారీ దోహదం చేస్తుంది: ‘తయారీ కాలం పనిముట్లను సులభతరం చేస్తుంది. కార్మికుని ప్రత్యేక విధుల ప్రతి విషయానికీ అనుగుణంగా వాటిని మార్చడం ద్వారా శ్రమ సాధనాల సంఖ్యను గణనీయంగా పెంచుతుంది.’
తయారీలో పూర్తి ప్రక్రియ ఇప్పటికీ హస్తకళా నైపుణ్యాన్ని కలిగిన శారీరక శ్రమ ద్వారానే జరుగుతున్న విషయాన్ని, అందుచేత తన పనిముట్లను ఉపయోగించడంలో ప్రతి కార్మికుని ‘బలం, నైపుణ్యం, చురుకుతనం, ఆత్మవిశ్వాసంపై ఆధారపడి ఉన్నదనే విషయాన్ని గమనించవలసిన అవసరం ఇక్కడ ఉంది.’
మరో విధంగా కాకుండా తయారీలో ప్రతి కార్మికుని విధుల కొరకు స్వీకరించింది పనిముట్లనే అనే వాస్తవాన్ని కూడా ఇది వివరిస్తున్నది. ఈ రెండు అంశాలలో ఆధునిక పరిశ్రమ తయారీ పూర్తిగా భిన్నంగా ఉన్న విషయాన్ని తరువాత మనం చూస్తాము.
తయారీ పూర్తి అయిన విడిభాగాలను కూర్చి, పూర్తి అయిన ఉత్పత్తిని ఇచ్చే తరహా(‘assembly’)కావచ్చు లేదా ‘ప్రాసెసింగ్’ రకం – ప్రాథమిక ముడి పదార్థం లేదా ‘కృషి’పై నిర్వహించబడిన అనుసంధానించబడిన ప్రక్రియల శ్రేణి ఫలితంగా వచ్చే ఉత్పత్తి. ఆ తరువాతి దానిని తయారీ మరింత అధునాతనమైన లేదా పరిపూర్ణమైన రూపంగా పరిగణించబడవచ్చు.
రెండు రూపాలు, ప్రత్యేకించి తరువాతిది పనివానిలోనూ, పనిలోనూ ఒక నిర్దిష్ట కొనసాగింపు– క్రమ బద్దతను అభివృద్ధి చేస్తాయి. ప్రతి కార్మికుని ఉత్పత్తీ ఆ తరువాతి వానికి ముడి సరుకు అవుతున్న వాస్తవం నుంచి ఇది వస్తుంది.
కార్మికులు ఒకరిపై మరొకరు ఆధారపడుతున్న ఫలితంగా, ‘ప్రతి ఒక్క కార్మికుడూ తన పనిపై అవసరమైన సమయం కంటే ఎక్కువ సమయం ఖర్చు చేయకుండా ప్రతి ఒక్కరినీ బలవంత పెడుతుంది.’ అంతేకాకుండా(Also) ‘స్వతంత్ర హస్త కళలో లేదా సాధారణ సహకారంలో కనపడిన దానికన్నా చాలా భిన్నమైన శ్రమ తీవ్రత పుట్టింది.’ సాపేక్ష అదనపు విలువ అర్ధాలు స్పష్టమే.
అనువాదం: యార్లగడ్డ వెంకట్రావు
(వెంకటేష్ ఆత్రేయ రచించిన “మార్క్సిస్టు రాజకీయ అర్ధశాస్త్రం పెట్టుబడి మొదటి సంపుటి పరిచయం” పుస్తకాన్ని ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది 22వ భాగం, 21వ భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
