బెంగాల్ విభజన సమయాన
జాతి ఐక్యతా చిహ్నపు సందేశ శిఖరమై
బ్రిటిష్ సామ్రాజ్యం గుండెలో
వందే మాతరం కోట్ల కంఠాల చైతన్య
ఆలాపన విప్లవగీత శంఖారావం
మహాత్ముని హృదయ మందిరాన
సత్యాగ్రహ స్ఫూర్తి జ్వాలకు
స్వదేశీ ఉద్యమ విజయ సంకేత సమరం
రవీంద్రుని స్వేచ్ఛా కలల తీరాన
అక్షరాల ఆశయాల గళాన
దాస్య బంధనాలు తెంచేసేన
మహోపదేశపు కాంతిపుంజ సమూహం
సుజలాం సుఫలాం
శతాబ్దాల శబ్దాల సస్య శ్యామలం
బంకించంద్ర దేశభక్తి వేల తారకల
ఉదయ కిరణాల శాంతి మంత్రమై
ఆనంద్ మఠ్ వచన రచన
సంచలన కావ్య విశ్వవ్యాప్తం
కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు
భవిష్యత్ భారతీయ తత్వపు పొలాల్లో
ప్రతి భారతీయుడు భావోద్వేగపు జలాల్లో
వందేమాతరం ఓ నినాద కిరీటం
వందే మా”తరం”మన సుప్రభాత
సబర్మతి సంగీత సుస్వాగతం
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
