మొత్తం జనగణన ప్రక్రియను రెండు దశల్లో నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ సమర్ధతను పరీక్షించడానికి ముందస్తు పరీక్ష నవంబరు 10 నుంచి 30 వరకు జరగనున్నది.
న్యూఢీల్లీ: వచ్చే ఏడాది ప్రారంభమైయ్యే మొదటి దశ జనగణన కోసం ఈ ఏడాది నవంబరు 10 నుంచి 30 వరకు “ప్రీటెస్టు”ను నిర్వహించనున్నారు. ఈ మేరకు భారత రిజిస్ట్రార్ జనరల్- జనాభ లెక్కల కమీషనర్ అక్టోబరు 16న నోటీఫికేషన్ను జారీ చేసింది. ఉత్తర్వు ప్రకారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఎంపిక చేసిన నమూనా ప్రాంతాల్లో మొదటి దశ 2027 జనాభ లెక్కల ప్రీటెస్టు జరగనుంది.
అంతేకాకుండా 2025 నవంబరు 1- 7వ తేదీ మధ్య సొంతగా లెక్కించుకొనే అవకాశాన్ని కూడా కల్పించినట్టుగా ఉత్తర్వులో పేర్కొన్నారు.
గతంలో మాదిరి కాకుండా ఈసారి మొదటి దశ కోసం నిర్వహించే ప్రీటెస్టులో గృహాల లెక్కలు, వాటి జాబితా ఉంటుందని తెలియజేయడంతో, కులగణ కోసం అనుసరించాల్సిన పద్ధతిపై నిర్ణయం ఇంకా ఖరారు కాలేదని సూచిస్తుందని ది హిందూ కథనం తెలియజేసింది.

జనాభా లెక్కల చట్టం- 1948(37 ఆఫ్ 1948) సెక్షన్ 17ఏ, జనాభాలెక్కల విధానం- 1990, విధానం 6డీ ప్రకారం-మొదటి దశ 2027 జనాభా లెక్కల ప్రీ-టెస్టు ఉత్తర్వును కేంద్ర ప్రభుత్వం జారీ చేసిందని రిజిస్ట్రార్ జనరల్, జనాభా లెక్కల కమీషనర్ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ తెలియజేశారు.
2019లో రెండు దశలలో గృహ- జనగణనకు సంబంధించిన ప్రశ్నలను విజయవంతంగా అడిగారు. 2019 ఆగస్టు 12 నుంచి సెప్టెంబరు 30వరకు జాతీయ జనాభా నమోదు(ఎన్పీఆర్) టెస్టును విజయవంతంగా పూర్తిచేసింది.
సమర్థతను నిర్ధారించనున్న ప్రీటెస్టు..
2026 ఏప్రిల్ 1 నుంచి 2027 ఫిబ్రవరి 28 వరకు గృహ- జనగణనను నిర్వహిస్తారు. రెండు దశల్లో జరిగే మొత్తం గణన ప్రక్రియ సమర్ధతను ప్రీటెస్టు నిర్ధారిస్తుంది.
స్వతంత్ర భారతలో మొట్టమొదటిసారిగా కులగణను చేపట్టబోతున్నారు. ఈ లెక్కలు పూర్తిగా డిజటల్ కాబోతున్నాయి.
జనగణన ద్వారా స్థానిక అంశాలను గుర్తించడం, డాటా నాణ్యతను అంచనావేయడం, ముద్రణ ప్రక్రియ, లాజిస్టిక్స్, సమర్ధవంతమైన శిక్షణ, పద్ధతులు, డాటాను సేకరించడం వంటి అనేక ఇతర విషయాలపై తలెత్తే అనేక ప్రశ్నలు, అంశాలను సమర్ధతను ప్రీటెస్టు తెలియజేస్తుంది.
2011 నుంచి ఇది మొదటి జనగణన, ఈ ప్రక్రియను 2021లో చేపట్టాల్సి ఉండగా కోవిడ్-19 వల్ల జాప్యం జరిగింది. ఇప్పుడు ఇది 2026లో ప్రారంభమై 2027లో పూర్తవుతుంది.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
