
ఎపిసోడ్ 2- మార్గదర్శకుడు గలిలేవ్ గలిలియ్
1564 ఫిబ్రవరి 15న ఇటలీలోని పిసా నగరంలో గలిలేవ్ గలిలియ్ జన్మించారు. అప్పటికి పిసా ఫ్లోరెన్స్ డచీ (Duchy of Florence)భాగం. ఆయన వించెన్జో గలిలియ్ (Vincenzo Galilei), గియులియా అమ్మన్నాటి (Giulia Ammannati) దంపతులకు తొలి సంతానం.
వించెన్జో ఆ కాలానికి ఒక ప్రముఖ లూట్ వాయిద్యకారులు, సంగీత సిద్ధాంతకర్త, స్కాలర్. ఆయన సంగీతంలో ప్రయోగాలు చేసి స్ట్రింగ్ టెన్షన్, పిచ్ మధ్య సంబంధాన్ని అన్వేషించారు– ఇది గలిలేవ్కు పరిశోధనలు చేయటానికి తొలి ప్రేరణ.
గియులియా ఒక వ్యాపార కుటుంబం నుంచి వచ్చింది. వారిది మధ్యతరగతి కుటుంబం. మొత్తం ఆరుగురు లేదా ఏడుగురు సంతానం. కానీ ముగ్గురు మాత్రమే శైశవ దశ దాటారు. గలిలేవ్ చిన్న తమ్ముడు మిచెలాంజెలో(Michelangelo) కూడా సంగీతకారుడు అయ్యాడు. కానీ కుటుంబ ఆర్థిక భారాలు(డౌరీలు మొదలైనవి) గలిలేవ్ మీద పడ్డాయి.
గలిలేవ్ బాల్యం ఎక్కువగా ప్రముఖ ఇటాలియన్ నగరమైన పిసాలో గడిచింది. ఎనిమిదేళ్ల వయసులో (1572లో) కుటుంబం ఫ్లోరెన్స్‌కు మారింది. కానీ తొలతగా పిసా నగరం నుంచే గలిలేవ్కు విజ్ఞానశాస్త్ర ప్రపంచపు గుర్తింపు వచ్చింది. రెండేళ్లు ముజియో టెడాల్డి(Muzio Tedaldi) సంరక్షణలో పిసాలోనే ఉన్నారు. పదేళ్ల వయసులో ఫ్లోరెన్స్‌లో కుటుంబంతో చేరారు. అక్కడ జకోపో బోర్ఘిని (Jacopo Borghini) ట్యూటర్‌గా ఉన్నారు.
1575 నుంచి 1578 వరకు ఫ్లోరెన్స్ సమీపంలోని వలోంబ్రోసా అబీ(Vallombrosa Abbey)లో సన్యాసుల(monks) వద్ద విద్యాభ్యాసం చేశారు. అక్కడ తర్క శాస్త్రం చదివారు. గురువుల ప్రభావం వల్ల మతపరమైన జీవితం వైపు ఆకర్షితుడయ్యారు.
ఒకానొక సమయంలో తాను కూడా సన్యాసి కావాలని అనుకున్నారు. కానీ తండ్రి ఆయనను మెడిసిన్ చదివించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం విజ్ఞానశాస్త్ర ప్రపంచానికి ఎంత మేలు చేస్తుందో ఆయన ఆనాడు ఊహించి ఉండరు. తండ్రి మాటకు తలొగ్గిన గలిలేవ్ మానవజాతికి ఊహించలేనంత మేలు చేశారు.
ప్రారంభ విద్య: 1580లో 16 ఏళ్ల వయసులో పిసా యూనివర్సిటీలో మెడిసిన్ చదవడానికి చేరారు. కానీ, అక్కడ గిరోలామో బోరో(Girolamo Borro), ఫ్రాన్సిస్కో బ్యూనమిచి(Francesco Buonamici) లెక్చర్లు విని గణిత శాస్త్రం, నేచురల్ ఫిలాసఫీ(నేటి జీవశాస్త్రానికి ప్రారంభ రూపం) వైపు మొగ్గు చూపారు. ఇది మరొక గొప్ప మలుపు. 1581లో చర్చ్‌లో స్వింగ్ అవుతున్న షాండిలియర్‌ను గమనించి, లోలకం కదలిక (Pendulum Swing), సమయం, ఆర్క్ పరిమాణంతో సంబంధం లేకుండా స్థిరంగా ఉంటుందని ప్రయోగాలు చేశారు. ఇది ఆయన తొలినాటి ప్రధాన పరిశోధనగా భావించ వచ్చు. ఆయనకు విజ్ఞానశాస్త్ర పరిశోధనల పట్ల ఉన్న ఆసక్తిని చూపిస్తుంది.
ఒక జామెట్రీ లెక్చర్ విని తండ్రిని ఒప్పించి వైద్యం నుంచీ నుంచి గణితశాస్త్రానికి మారారు. 1585లో డిగ్రీ పూర్తి చేయకుండానే యూనివర్సిటీ వదిలేశారు. ఫ్లోరెన్స్, సియెనాలో ట్యూటర్‌గా గణిత శాస్త్ర బోధనలు చేశారు. 1586లో హైడ్రోస్టాటిక్ బ్యాలెన్స్ డిజైన్ చేసి పుస్తకం ప్రచురించారు. ఇది ఆయనను స్కాలర్ల దృష్టికి తెచ్చింది. క్రిస్ఫర్ క్లావియస్తో మైత్రి కిఇక్కడే బీజం పడింది.
సైంటిఫిక్ టెంపర్మెంట్ చిన్న వయసులోనే ఎలా అభివృద్ధి చెందింది?
సైంటిఫిక్ టెంపర్మెంట్(వైజ్ఞానిక మనస్తత్వం)– అంటే పరిశీలన, ప్రయోగం, మ్యాథమెటికల్ విశ్లేషణ, అథారిటీకి బదులు సాక్ష్యాలపై ఆధారపడటం– గలిలేవ్లో చిన్న వయసులోనే అభివృద్ధి చెందింది.
తండ్రి విన్సెంజో సంగీతంలో ప్రయోగాలు చేయడం(స్ట్రింగ్ టెన్షన్, పిచ్) ఆయనకు ప్రేరణ. వలోంబ్రోసా అబీలో తర్కం(logic) చదివినప్పుడు రీజనింగ్ స్కిల్స్ బాగా పెరిగాయి. యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతుండగా, చాండిలియర్ స్వింగ్ గమనించి పెండ్యూలమ్ ప్రయోగాలు చేశారు. ఇది మోషన్ స్టడీలకు (తరువాత గమనశాస్త్రం – Kinematics) పునాది వేసింది.
యూక్లిడ్, ఆర్కిమెడెస్ల పరిశోధనలు చదివి గణితశాస్త్రంలో ఆసక్తి పెంచుకున్నారు. ఓస్టిలియో రిచ్చి(Ostilio Ricci) వంటి ట్యూటర్లు ఆయనకు క్వాంటిటేటివ్ అప్రోచ్ నేర్పారు. 1588లో ఫ్లోరెన్స్ అకాడమీలో పర్స్పెక్టివ్ (Perspective), కియారోస్క్యూరో(Chiaroscuro – the treatment of light and shade in drawing and painting) టీచ్ చేశారు. సైన్స్, ఆర్ట్‌ను కలిపారు. ఈ ప్రారంభ ప్రయోగాలు, మార్పులు ఆయనను ఆరిస్టాటిల్ సిద్ధాంతాలను ప్రశ్నించేలా చేశాయి.
దాని ప్రభావం ఆయన జీవిత కాలం ఎలా కనిపించింది?
గలిలేవ్ సైంటిఫిక్ టెంపర్మెంట్ ఆయన జీవితమంతా ప్రభావం చూపింది, ఆయనను ఆధునిక విజ్ఞానశాస్త్ర పితగా మార్చింది. ఇది ఆయన ఆవిష్కరణలు, జీవితకాలంలో చర్చ్తో వచ్చిన విభేదాలు, వివాదాలు ఆయన వారసత్వంలో స్పష్టంగా కనిపిస్తుంది
♦ తొలికాల ఆవిష్కరణలు: 1589లో పిసా యూనివర్సిటీలో గలిలేవ్ మ్యాథమెటిక్స్ చైర్ పొందారు. లీనింగ్ టవర్ నుంచి బాల్స్ డ్రాప్ చేసి బరువుతో సంబంధం లేకుండా ఫాలింగ్ రేట్ సమానమని చూపారు. అంటే ఒకేసారి ఒకే ఎత్తు నుంచి జారవిడువబడిన రెండు లేదా అంతకన్నా ఎక్కువ వస్తువులు ఒకేసారి భూమిని చేరతాయి.(సమతలం).
1592-1610లో పడువా యూనివర్సిటీలో గమనాలను గురించి పరిశోధనలు చేశారు. ఫాలింగ్ బాడీస్‌లా (దూరం టైమ్ స్క్వేర్ ప్రపోర్షనల్), పారాబోలిక్ ట్రాజెక్టరీలు కనుగొన్నారు. ప్రొజక్టైల్ పరిశోధనల తొలిదశ ఇదే.
♦ ఆస్ట్రానమీ మరియు టెలిస్కోప్: 1609లో టెలిస్కోప్‌ను మెరుగుపరచి, గురుగ్రహ చంద్రులను (Moons of Jupiter), వీనస్ ఫేజెస్, సన్‌స్పాట్స్, మూన్ (మన చంద్రుడు – భూమి) క్రేటర్స్ కనుగొన్నారు. ఇవి హీలియోసెంట్రిక్ మోడల్‌కు సపోర్ట్ ఇచ్చాయి. ఈ పరిశోధనలు వివరాలను 1610లో సిడెరియస్ నున్సియస్ పుస్తకంలో ప్రచురించారు.
♦ వివాదాలు, మెథడాలజీ: 1623లో ది అసేయర్లో “ప్రకృతి పుస్తకం మ్యాథమెటిక్స్ భాషలో రాయబడింది” అని చెప్పారు. సైంటిఫిక్ మెథడ్‌ను గట్టి పునాది వేశారు. 1632లో డైలాగ్ కన్సర్నింగ్ ది టూ చీఫ్ వరల్డ్ సిస్టమ్స్‌లో కోపర్నికన్ వ్యూను సపోర్ట్ చేశారు. ఇది చర్చ్తో వివాదానికి దారితీసి 1633లో ట్రయల్(విచారణ) జరిగి హౌస్ అరెస్ట్‌కు దారితీసింది. అంతకు ముందు చాలాసార్లు గలిలేవ్ను కాచుకున్న క్రిస్ఫర్ క్లావియస్ మరణించి చాలా కాలమైంది. ఇంతకాలం ఆదుకున్న ఆయన ప్రభావం క్రమంగా తగ్గుతూ వచ్చింది.
మనిషి జీవించి ఉన్నప్పుడు ఉన్న విలువ/ప్రభావం మరణించాక తగ్గుతూ వస్తుంది. ఒకానొక సందర్భంలో ఆ వ్యక్తి తాలూకు ప్రభావాన్ని స్వయంగా చూసిన వారు లేకపోవటంతో వారు మరుపున పడతారు. క్రమంగా వారు చేసిన కృషి కాల పరీక్షకు నిలిచేదైతే, మళ్లీ వారి గురించి తరువాత తరాలు తెలుసుకుంటాయి.
కానీ, అంత కృషి చేసేవారు ఎందరు? వారిలో ఒకరే మన క్లావియస్ కూడా.
♦ జీవిత చరమాంకం, లెగసీ: హౌస్ అరెస్ట్‌లోనూ టూ న్యూ సైన్సెస్ (1638) ప్రచురించారు. మెటీరియల్స్ సైన్స్, మోషన్ (Kinematics) గురించి. ఇది న్యూటన్ లాస్‌కు మార్గం సుగమం చేసింది. ఆయన సైంటిఫిక్ టెంపర్మెంట్ ఆధునిక ఫిజిక్స్, ఆస్ట్రానమీ- సైంటిఫిక్ మెథడ్లు అభివృద్ధి చెందటానికి ఉపయోగపడింది. అందుకే అల్బర్ట్ ఐన్‌స్టీన్ ఆయనను “ఫాదర్ ఆఫ్ మాడర్న్ ఫిజిక్స్” అని పిలిచారు.
(మొదటి ఎపిసోడ్‌ను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.