డోనాల్డ్ ట్రంప్ కంటే దారుణంగా అపార్ధానికి గురైన వ్యక్తి మరొకరు ఉండి ఉంటారా? నా మటుకు నాకైతే ఉండరేమో అనిపిస్తుంది.
అమెరికా ఫస్ట్, మరోసారి అమెరికా అగ్రరాజ్యం చేద్దాం నువ్వంటే నాదాలు ముందుకు వచ్చినప్పుడు ట్రంప్ అమలు చేయదలచుకున్న నిరంకుశ విధానాలకు మరో పేరు అని విరుచుకుపడ్డాము. స్వీయాత్మకమైన శ్వేత జాతి ద్రహంకారమని, తూర్పు తీరం నుంచి వచ్చిన వామ పక్షవాదుల ప్రభావంతో ఇప్పటి వరకు నిర్లక్ష్యాన్ని గురైన అసలు సిసలైన పౌరసత్వాన్ని పునఃస్తాపించేందుకు జరుగుతున్న ప్రయత్నం అని విమర్శలు వచ్చాయి.
అలా విమర్శలు చేసిన వాళ్ళు ఎంత మూర్ఖులో కదా !
అమెరికాను మరోసారి అగ్రరాజ్యంగా చేద్దాం అన్న నినాదం విన్నప్పుడల్లా అదేదో స్థానికత తో నిండిన దేశభక్తి నీ ముందుకు తెస్తున్నారని అనుకున్నాము. కానీ ప్రపంచ దేశాలన్నీ ఈ నినాదాన్ని తమ సొంత నినాదం గా చేసుకుని అమలు చేయాలన్న ఆదేశం అన్న వాస్తవాన్ని గుర్తించటంలో విఫలం అయ్యాము.
కాబట్టి ఇపుడు చేయాల్సింది ఏమిటంటే ఈ దురదృష్టకర భూమండలం మీద ఉన్న దేశాలన్నీ ఎచ్చు పుచ్చుగా ఉన్న తమ జాతీయ ప్రాధాన్యతలను పక్కన పెట్టీ నిజమైన విశ్వాస పాత్రులుగా అమెరికాను అగ్రరాజ్యంగా చేయటానికి వీలుగా శిలువ ను మోయటానికి సిద్ధం కావాలి.
ఆ విధంగా చూసినపుడు పిచ్చుకంత బుర్ర తో కకావికలవుతున్న అమెరికా స్థానంలో స్పష్టమైన అవగాహనతో నిర్మాణం అవుతున్న నూతన సామ్రాజ్యవాదాన్ని మనం చూడగలుగుతాము.
అలాంటపుడు గత సంవత్సరం చివర్లో డొన్రో డాక్ట్రిన్ ను అమెరికా ప్రాంగణంలో జాతీయ రాజ్యాలకు అవసరమైన మార్గదర్శకాలు రూపొంది స్తుంది, నూతన సామ్రాజ్యవాదానికి అవసరమైన నూతన వలసలను నిర్మిస్తోంది అన్న విషయం తెలిసినప్పుడు ఆశ్చర్యపడాల్సిందేముంది,!
ఆరోజున చూసుకున్నప్పుడు స్థానిక దర్శనలైనా స్థానిక దర్శనం అయిన ఏ దేశం ఎన్ని ఆయుధాలు ఉపయోగిస్తుంది , ఏ దేశం ఏ ధరకు పెంటగాన్ నుంచి ఎన్ని ఆయుధాలు కొనుగోలు చేస్తుంది, ఏ ఘర్షణను ఎన్ని గంటలకు నిలిపివేస్తుంది, తమరు కొనుగోలు అమ్మకాలు ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు, విలువైన ఖనిజ వనరులు ఎవరు సొంతం చేసుకోవాలి ఎవరు సొంతం చేసుకోకూడదు, ఇటువంటి వనరులను ట్రంప్ ఏ మార్కెట్ నుంచి కొనుగోలు చేయాలి వంటివన్నీ అమెరికాను మరోసారి అగ్రరాగ్యంగా చేసే ప్రయాణంలో అనేక మదిలీలు మాత్రమే. ఇదే ఇప్పుడు అమెరికా అధ్యక్ష భవనం వేదికగా వినిపిస్తున్న సరికొత్త పారిభాషిక పదాలు.
అయినప్పటికీ ఓవర్ ఆఫీస్ నుంచి అందుతున్న ఈ ఫత్వాలను ప్రశ్నించడానికి అందరూ ఎక్కడో ఎక్కడో ఇద్దరు ముగ్గురు దేశాధినేతలు ప్రయత్నిస్తూనే ఉన్నారు.
గతంలో నిర్దిష్ట ప్రమాణాలు విధానాలు ప్రాతిపదికన నిర్మితమైన ప్రపంచ బలాబలాల పొందిక నేడు అమెరికాను అగ్రరాజ్యంగా మార్చేందుకు ట్రంప్ సృష్టిస్తున్న అరాచకత్వం, ప్రపంచంలో ఏ దేశంలో ఏ నాయకుడు దుష్టశక్తో వాళ్లకు కూడా తెలియక ముందే అమెరికా అధ్యక్షుడు ప్రకటించే నూతన ప్రపంచ వ్యవస్థ నిర్మితమవుతోంది.
ఐక్యరాజ్యసమితి అనే ఒక విభాగం గుర్తుందా? ఒకవేళ మీకు గుర్తున్న మర్చిపోండి. ఐక్యరాజ్యసమితి స్థానంలో ఇప్పుడు బోర్డ్ ఆఫ్ పీస్ శాంతి సాధన వేదిక తెరమీదకు వస్తుంది. ఐక్యరాజ్యసమితికి ప్రత్యామ్నాయంగా రం అనబడే ఒకే ఒక వ్యక్తి ప్రకటించి ప్రతిపాదించి నిర్మించబోనుకుంటున్న వేదిక ఇది. ఈ శాంతి సాధన కమిటీలో సభ్యత్వం పొందాలంటే కనీసం రెండు బిలియన్ డాలర్ల సభ్యత రుసుము చెల్లించాలి. ఆ శాంతి సాధన వేదికకు శాశ్వత అధ్యక్షుడు బహుశా చనిపోయేంతవరకు ట్రంప్ మాత్రమే ఉండే వేదికది.
దీన్ని ప్రశ్నించి వ్యతిరేకించి ప్రతిఘటించడానికి ఎవరైనా సిద్ధపడితే వాళ్ళను మరింత ఫీల్ పిప్పి చేసేంతవరకు ఈ వేదిక నిద్రపోదు. లేదా పేదరికంలో మధ్యల వాళ్ళంతట వాళ్లే ఏర్పాటు చేసుకున్న చట్టాల నడుము బంధించి రెండు మూడు వారాలు అలా వదిలేస్తే అలనాటి మహాభారతంలో నేలమాలికలో బంధించబడిన శకుని పరివారం లాగా కాలంతో పాటు అంతరించిపోతారు. లేదంటే వాళ్ల గొర్రెలు సరిగ్గా పనిచేసి బుద్ధి పుట్టి అరుపులు ఆర్తనాదాలతో సాగిల పడితే కనికరించి వదిలేస్తారు. లేదా అలా సాగిలపడ లేని వాళ్లు ఉంటే అటువంటి వాళ్లను ఎక్కడ ఉన్నా ఆఖరికి పడక గదిలో నిద్రిస్తున్న బంధించి బేడీలు వేసి అమెరికాకు తరలించి అమెరికాను అగ్రరాజ్యంగా చేసే ప్రయత్నంలో ఇస్తున్న ఆదేశాలను బేఖాతరు చేస్తున్న ద్రోహులుగా గుర్తించి విచారించి శిక్షలు వేస్తారు.
ఇది ఎలా సాధ్యం అని మీకు ఆశ్చర్యం కలగవచ్చు.
అటువంటి అధికారం ట్రంప్ కు ఉందా లేదా అని వివరించటానికి విద్యా వ్యవస్థ లో కానీ, ట్రంప్ రూపొందించిన సిలబస్ లో కానీ లేదా ఆయన విస్వశించే క్రైస్తవం లో కానీ ఆధారాలు అవకాశాలు లేవు.
ఆ విధంగా చూసినప్పుడు ఖరీదైన క్లబ్బుల్లో సభ్యత్వాలు, ప్రపంచాన్ని ప్రభావితం చేయటానికి ఏర్పాటు అయిన ఎప్ట్సీన్ సూపర్ క్లబ్బు లలో భాగస్వామ్యాలు, వారసత్వంగా వచ్చిన సైనిక సామర్ధ్యాలు, ట్రంప్ ను విశ్వగురువు స్థానంలో నీలబెట్టే వాక్ స్వేచ్ఛ కలిగిన వాళ్ళూ ఎపుడూ అంటారు. ఎపుడు కుశంక తో చూసే చైనా, రష్యాలను మినహాయిస్తే…
ఈ పరిణామాలన్నిటిని హీనపక్షంగా లెక్కవేసినా విశ్వ గురువు స్థానానికి తనను మించిన అర్హులు లేరని ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. ఒకటి తర్వాత ఒకటి అవమానాల పరంపరను ఎదుర్కొంటున్న మోడీ ఇంకా ఏమాత్రం ట్రంప్ తన మిత్రుడు అని ప్రకటించకుండా ఉంటే బాగుంటుంది. మోడీని కామణించడానికి గల కారణాలేమిటో ట్రంప్ కంటే బాగా ఎక్కువగా ఎవరికి తెలుస్తుంది!
వీళ్ళిద్దరి దోస్తీ గతంలో ఎప్పుడు స్వయం నియమిత విశ్వ గురువుగా ప్రకటించుకున్న భారతదేశం ముందు అనేక సవాళ్లను విసరనున్నది.
20047 నాటికి భారతదేశం విశ్వ గురువుగా అవతరించనున్నదని మోడీ లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఆ మేరకు కాస్తంత మెరుగైన పని. అప్పటికి ప్రాచీన చరిత్ర సంస్కృతి సాంప్రదాయాలను మేళవించిన అత్యాధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాణాలు పరిఢవిల్లే సమయం అని మోడీ సరిగ్గానే గుర్తించారు. ఒకవైపు ప్రాచీనత మరోవైపు ఆధునికత రెండు పరస్పరం పోసగని కత్తులు ఒకే త్వరలో ఇమడ్చటం ఎలాగో కాలం నిర్ణయించుకుంటుంది.
ఆ సమయానికి విశ్వంలో ఆవు పేడతో తయారుచేసిన వింధనాన్ని ఉపయోగించుకుని సుదూర తీరాలను చేరుకోవడానికి రాకెట్లు ప్రయాణిస్తాయి. ఆస్తి ఆవరణంలో అసలైన విశ్వగురు చిత్రాలను ఈ రాకెట్ లే ఏర్పాటు చేస్తాయి.
నేడు భారతీయులైన మనం రేపు మాకు లేదా కనీసం 20047 ముందు వరకు అర్థం పర్థం లేని ప్రశ్నలు వేస్తున్నప్పటికీ, ఈ మధ్యకాలంలో భారతీయులం అయిన మన అందరం ఎన్నో భారాలు కష్టాలు నష్టాలు మోయాల్సి వచ్చినప్పటికీ, ప్రస్తుతానికి మాత్రం డోనాల్డ్ ట్రంప్ మన విశ్వగురు పీఠాన్ని ఎత్తుకుపోయాడు.
ఏది ఏమైనప్పటికీ ఎన్నికల యుగ ధర్మాన్ని గౌరవ ట్రంప్ బాగా అనుకరిస్తున్నారు.
భారతదేశంలో మనం అమలు చేస్తున్నట్లుగానే జాతీయ ఓటరు జాబితాను యుద్ధం చేయాల్సిందిగా ఫ్రం అమెరికా శాసనకర్తలను ప్రేరేపిస్తున్నారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం అటువంటి పని ఏదైనా చేయాల్సిన అవసరం వస్తే అక్కడ రాష్ట్రాలు మాత్రమే ఆ పని చేయటానికి తగిన అధికారాన్ని కలిగి ఉంటాయి. కేంద్ర ప్రభుత్వానికి ఇటువంటి అధికారము లేదు.
మన దేశానికి సంబంధించిన తెలివైన ఎన్నికల సంఘం విధివిధానాల నుండి ప్రేరణ పొందిన అమెరికా కేవలం పౌరులు మాత్రమే ఓటు హక్కు కలిగి ఉండేలా చూడటానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయత్నం ఇక్కడ అక్కడ అంటే భారతదేశంలోనూ అమెరికాలోనూ ఏకకాలంలో కొనసాగుతోంది. భారతదేశంలో అమలు జరుగుతున్న విధానాల తరహా చర్యలను అమెరికా కూడా ప్రారంభించడానికి సిద్ధపడుతుంది.
మినియా పోలీసు లో జరిగిన పరిణామాలే ఇక్కడ లక్నోలో గాని ఎమ్మార్వో తోట గౌహతిలో గాని ఎందుకు జరగకూడదు?
నిజానికి డ్రం మరికొన్ని అడుగులు వేస్తూనే ఉన్నారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్గా ఉన్న తులసి గబార్డ్ లాంటి వాళ్లను దారిలోకి తెచ్చుకొని 2020 అమెరికా ఎన్నికల్లో జార్జియా రాష్ట్రంలో పోలైన బ్యాలెట్ పత్రాలన్నింటినీ సేకరించినందుకు ప్రయత్నం చేస్తున్నారు. 2020 ఎన్నికల్లో దానే గెలిచానని ట్రంప్ చెప్పుకోవడం ఎప్పటికీ మానరు. జార్జియా రాష్ట్రంలోని ఫుల్టన్ కౌంటిలో ఎన్నికల అధికారులు డెమొక్రటిక్ పార్టీ ప్రాపకం కోసం ట్రంప్ కు వ్యతిరేకంగా ఎలా పనిచేశారు నిరూపించాలన్నదే ఈ ప్రయత్నం వెనుక ఉన్న లక్ష్యం.
నిజంగా ట్రంప్ గెలిచారనీ అందువలన జనవరి 6న అమెరికా అధ్యక్ష భవనంపై జరిగిన దాడి ఆ ఎన్నికలలో జరిగిన మోసానికి వ్యతిరేకంగా దేశభక్త పౌరులు వ్యక్తం చేసిన నిరసన మాత్రమే అని నిరూపించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అమెరికాను ఉదారవాదులను దాడి నుండి కాపాడేంది జరిగిన ప్రయత్నం అని నమ్మింప చూస్తున్నారు.
విశ్వ గురువుగా ఎదిగిన ట్రంప్ సమస్యను కూడా అధిగమిస్తారు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. తద్వారా తన ఆత్మ బంధువులు కూడా ఇతర దేశాల్లో జనవరి 6 లాంటి చర్యలకు పాల్పడేలా ప్రేరేపిస్తున్నారు.
అగ్ర రాజ్యంగా అమెరికా అంటే మనం ఇప్పటివరకూ అర్థం చేసుకున్నది కాదు. ప్రపంచంలో ప్రాధాన్యత కు నోచుకోని దేశాలు అన్నీ అగ్రానాయకుడి అడుగు జాడల్లో నడవాలని ఇస్తున్న పిలుపు ఇది.
బహుశా భగవద్గీత లో పరమాత్ముడు చెప్పిన ఆఖరి అవతారం ఆవిష్కరణ అదేనేమో !
కొసమెరుపు
ఇదిలా ఉండగా ఇక్కడ విశ్వ గురువు స్థానాన్ని అలంకరించేందుకు ఉవ్విళ్లూరుతున్న వికసిత భారత్ రాజధాని డిల్లీలో ఓ యువకుడు ప్రధాన రహదారి నిట్టనిలువునా చీలి ఏర్పడిన గోతిలో మోటార్ సైకిల్ తో సహా పడిపోయి చనిపోయాడు. 2047 నాటికి దేశాన్ని వికసిత భారతంగా స్థానం ఖాలీ గా ఉంటే విశ్వ గురువు స్థానాన్ని అందుకోవడానికి జరుగుతున్న ప్రయాణంలో బహుశా తొలి సమిధ ఈ యువకుడే అయి ఉంటాడు.
ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి
బదరీ రైన
అనువాదం : కొండూరు వీరయ్య
రచయిత ఢిల్లీ విశ్వ విద్యాలయంలో ప్రొఫెసర్ గా పని చేసారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
