
ఒక వ్యక్తిని దోషిగా నిర్ధారించినప్పటికీ అతనికి ఇంకా న్యాయపరమైన హక్కులు ఉంటాయని, ఈ మేరకు మనం మార్గదర్శకాలను రూపొందించుకున్నామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి, మంత్రిగా బాధ్యతలో ఉన్న ఎన్నికైన శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు నేరాలకు, తప్పులకు పాల్పడినట్టైతే వారిని కోర్టు దోషులుగా నిర్ధారించకముందే నెలరోజుల పాటు జైలులో గడపాల్సి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ప్రవేశపెట్టిన కొద్దిరోజుల తర్వాత జస్టిస్ గవాయి స్పందించారు. న్యాయాధికారాన్ని కూడా కార్యనిర్వాహక వ్యవస్థ నిర్వహించడమంటే, రాజ్యాంగం నిర్దేశించిన అధికారాల విభజన నిర్వీర్యం చేయడమేనని అన్నారు.
కార్యనిర్వాహక వ్యవస్థ తానే జడ్జిగా వ్యవహరిస్తే, ఇక న్యాయపాలన ఏమవుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు.
గోవా హైకోర్టు బార్ అసోసియేషన్ నిర్వహించిన కార్యక్రమంలో జస్టిస్ గవాయి పాల్గొని ప్రసంగించారు. ఉత్తరప్రదేశ్‌తో సహా పలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్న “బుల్డోజర్ న్యాయం” గురించి ఆయన ప్రస్తావించారు.
బుల్డోజర్ న్యాయంపై 2024లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి మాట్లాడుతూ, ఏకపక్షంగా ఇళ్లను కూల్చివేయాలన్న దానికి కూడా కొన్ని మార్గదర్శకాలున్నాయని గుర్తుచేశారు. నేరాలకు పాల్పడినట్లు విచారించకుండానే చట్టంలో ఉన్న నిబంధనలు, మార్గదర్శకల సూత్రాలను పాటించకుండా వారి ఇళ్లను కూల్చివేశారని తెలిపారు. ఆ ఇంట్లో నివసించే ఇతర కుటుంబ సభ్యులు ఎలాంటి తప్పులు చేయకుండానే ఇలాంటి చర్యల వల్ల బాధలను అనుభవించాల్సి వచ్చిందని జస్టిస్ గవాయి వాపోయారు.
అంతేకాకుండా, షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ పునర్వ్యవస్థీకరణ బిల్లు- 2024 తీర్పు గురించి కూడా ఆయన మాట్లాడారు.
ఈ తీర్పు వెలువరిచడానికి గల కారణాలను ఆయన గుర్తు తెచ్చుకున్నారు. తీర్పుపై తన సొంత సామాజిక వర్గం నుంచి అనేక విమర్శలు వచ్చాయని, అయినప్పటకీ ఈ తీర్పు ప్రజల డిమాండ్ వల్ల రాయలేదని, తన “మనస్సాక్షి” ప్రకారం రాశానని పేర్కొన్నారు.
ఒకవైపు, ఒకే రిజర్వేషన్ కేటగిరికి చెందిన ఒకే కుటుంబం నుంచి తరతరాలుగా ఐఏఎస్ అధికారులు వస్తున్నారు. మరోవైపు అదే రిజర్వేషన్ కేటగిరికి చెందిన వ్యవసాయ కూలీలు, మేస్త్రీలకు ఇది వాస్తవం కాదని అనుకుంటున్నారని గవాయి చెప్పుకొచ్చారు.
ఎస్సీలలో “క్రిమీలేయర్” మనుగడ గురించి నొక్కి చెపుతూ, “తీర్పు రాయడానికి ముందు నన్ను నేను అర్ధం చేసుకుంటూ ఈ తీర్పు రాశాను. ఉదాహరణకు ఒక కొడుకు లేదా కూతురు ముంబై, ఢిల్లీలో పేరున్న పాఠశాలలో విద్యనభ్యసిస్తారు. అదే రిజర్వేషన్ కేటగిరికి చెందిన గ్రామాలలోని వ్యవసాయ కూలీలు, మేస్త్రీల పిల్లలు, జిల్లా పరిషత్ లేదా గ్రామ పంచాయితీ పాఠశాలలో విద్యను అభ్యసించడాన్ని పోల్చగలమ”ని పేర్కొన్నారు.
2024 ఆగస్టులో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల పునర్విభజనపై ఏడుగురు సభ్యులతొ కూడిన ధర్మాసనంలో మెజారిటీతో వెలువరించిన తీర్పులో, ఇదే కేటగిరిలో మరింత వెనుకబడి ఉన్న వర్గాలకు వేరువేరుగా కోటాలను కేటాయిస్తూ రాష్ట్రాలకు అనుమతి మంజూరు చేసింది.
రిజర్వేషన్ పునర్విభజన తీర్పుపై, తన సామాజికర్గానికి చెందని ప్రజల నుంచే అనేక విమర్శలను గవాయి ఎదుర్కొన్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్‌లో గవాయి సభ్యులుగా ఉన్నారు.
ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలలో ఇంకా మిగిలిన వారు, వారి వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లను పునర్విభజించి, వారికి రిజర్వేషన్ ఫలాలు అందే విధంగా చూడడానికి, రిజర్వేషన్ పునర్విభజన అధికారాలను రాష్ట్రాలకు కల్పిస్తూ ఈ ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
ఇదే కార్యక్రమంలో గవాయి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ రిజర్వేషన్ల పునర్విభజనపై తనకంటే ముందు మాట్లాడిన వక్తల అభిప్రాయలను ప్రస్తావించారు. ఈ తీర్పుపై అనేకమంది తనను విమర్శించారని చివరికి తన సొంత సామాజిక వర్గానికి చెందిన వారి నుంచి కూడా విమర్శలను ఎదుర్కొన్నానని అన్నారు. అయితే, ప్రజల డిమాండ్లు- ఆకాంక్షల మేరకు తాను తీర్పులు రాయనని పూర్తిగా తన మనస్సాక్షిని అర్ధం చేసుకొని తీర్పులను రాస్తానని పునర్ఘాటించారు.
తన తీర్పును సమర్ధించుకుంటూ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం, సమానత్వం మధ్య అందరూ సమానమనే అర్థం కాదని, వారు సమానులుగా మారాలని, సమానులను అసమానులతోనే చూడాలని ఇది మన రాజ్యాంగం హామీ ఇచ్చిందని చెప్పారు.
గ్రామాలలో కార్మికులు, కూలీలు గ్రామీణ పాఠశాలలో చదువుకుంటున్నారని, అదే సంపన్న వర్గాలకు చెందిన పిల్లలు ఢిల్లీ- ముంబైలలో విద్యను అభ్యసిస్తున్నారని, ఈ పరిస్థితిని మౌళిక సమానత్వానికి విరుద్ధంగా తాను పరిగణిస్తున్నానని అభిప్రాయపడ్డారు. తన అభిప్రాయాలకు సుప్రీంకోర్టుకు చెందిన ఇతర జడ్జీలు మద్దతు పలకడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
జడ్జిగా గత 22- 23 ఏళ్ల తన ప్రయాణంలో, సామాజిక- ఆర్థిక న్యాయాన్ని సాధించడానికి రాజ్యాంగబద్ధంగా దేశం ముందుకు సాగడంలో, తాను కూడా కారణమయ్యాయనని గవాయి సంతోషాన్ని వ్యక్తపరిచారు.
అనువాదం: ఘంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.