పత్రికా స్వేచ్ఛను పర్యవేక్షించే అంతర్జాతీయ సంస్థ రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్ “ప్రెస్ ఫ్రీడమ్ ప్రిడేటర్స్” లేదా పత్రికా స్వేచ్ఛకు ముప్పుగా భావించబడే వ్యక్తులు, సంస్థల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో రెండు భారతీయ సంస్థలైన అదానీ గ్రూప్, హిందుత్వ వెబ్సైట్ ఓపీఇండియా ఉన్నాయి.
న్యూఢిల్లీ: అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛా నిఘా సంస్థ రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్(ఆర్ఎస్ఎఫ్) పత్రికా స్వేచ్ఛను వేటాడేవారి; లేదా పత్రికా స్వేచ్ఛకు ముప్పుగా పరిగణించబడే వ్యక్తులు, సంస్థల జాబితాను విడుదల చేసింది. ఈ వేటాడేవారిని “మాంసాహారులు” అని అర్థం వచ్చేలా సంస్థ లేబుల్ చేసింది.
రెండు భారతీయ సంస్థలైన అదానీ గ్రూప్, హిందూత్వ వెబ్సైట్ ఓపీఇండియా కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఆర్ఎస్ఎఫ్ ఏటా ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్‌ను విడుదల చేస్తుంది. ఇందులో భారతదేశం 180 దేశాలలో 151వ స్థానంలో ఉంది.
‘ప్రిడేటర్’ ఎవరు?
‘జర్నలిస్టులను చంపడం, సెన్సార్ చేయడం, జైలులో పెట్టడం, దాడి చేయడం, మీడియాను నియంత్రించడం, జర్నలిజాన్ని అప్రతిష్టపాలు చేయడం లేదా ప్రచార ప్రయోజనాల కోసం వార్తలను మార్చడం’ చేసే వ్యక్తులు, సంస్థలు, కంపెనీలు లేదా ప్రభుత్వాలు ఆర్ఎస్ఎఫ్ జాబితాలో ఉన్నాయి.
అంతర్జాతీయంగా ఈ జాబితాలో జిన్‌పింగ్ నేతృత్వంలోని చైనా కమ్యూనిస్ట్ పార్టీ, సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బెలారసియన్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకాషెంకో, ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆధ్వర్యంలో దాదాపు 220 మంది జర్నలిస్టుల మరణాలకు కారణమైన ఇజ్రాయెల్ రక్షణ దళం(ఐడీఎఫ్); మయన్మార్ రాష్ట్ర శాంతి- భద్రతా కమిషన్, కెప్టెన్ ఇబ్రహీం ట్రార్ నేతృత్వంలోని బుర్కినా ఫాసో సైనిక జుంటా; అంతేకాకుండా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో జర్నలిస్టులను వేధించడంలో పేరుగాంచిన బిలియనీర్ ఎలోన్ మస్క్ ఉన్నారు.
‘పత్రికా స్వేచ్ఛను వేటాడే వ్యక్తి’ అదానీ గ్రూప్స్..
దేశంలో రెండవ అత్యంత ధనవంతుడు, ప్రధాని మోడీకి అత్యంత సన్నిహితుడు గౌతమ్ అదానీని ఆర్ఎస్ఎఫ్ గుర్తించింది. ఆయన నేతృత్వంలోని అదానీ గ్రూప్, దాని అనుబంధ సంస్థలు స్వతంత్ర మీడియాను నోరు మూయించడానికి పరువు నష్టం; కంటెంట్ సెన్సార్షిప్ దావాలను(గ్యాగ్ సూట్లు)క్రమపద్ధతిలో ఉపయోగిస్తున్నాయని ఆ సంస్థ తెలిపింది.
2017 నుంచి అదానీ గ్రూప్ 15 మందికి పైగా జర్నలిస్టులు; మీడియా సంస్థలపై సివిల్, క్రిమినల్ పరువు నష్టం కేసులతో సహా దాదాపు 10 చట్టపరమైన చర్యలను ప్రారంభించిందని నివేదిక పేర్కొంది.
ఆర్ఎస్ఎఫ్ ప్రకారం, 2025లో అదానీ గ్రూప్ ‘హిట్‌లిస్ట్’లో ఎనిమిది మంది జర్నలిస్టులు; మూడు మీడియా సంస్థలపై దాఖలు చేయబడిన రెండు గ్యాగ్ కేసులు ఉన్నాయి. వీటిలో ఏ కంటెంట్ ‘పరువు నష్టం కలిగించేది’ అనేది తదుపరి విచారణ లేకుండానే స్వయంగా నిర్ణయించుకునే హక్కును కోర్టు అదానీ గ్రూప్‌కు ప్రసాదించింది.
ఈ ఉత్తర్వులు మూడవ పక్షాలకు కూడా వర్తింపజేయబడ్డాయని, ఇది “అపరిమిత సెన్సార్‌షిప్‌కు అవకాశం” కల్పిస్తుందని ఆర్ఎస్ఎఫ్ తెలిపింది.
ఈ కేసులు నమోదైన వెంటనే, ది వైర్, న్యూస్‌లాండ్రీ, హెచ్డబ్ల్యు న్యూస్, స్వతంత్ర జర్నలిస్ట్ రవీష్ కుమార్లపై కంటెంట్ తొలగింపు ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి. గ్యాగ్ సూట్లను దుర్వినియోగం చేయడం అదానీ గ్రూప్ “అత్యంత ప్రమాదకరమైన ఆయుధం”అని ఆర్ఎస్ఎఫ్ తన నివేదికలో పేర్కొంది.
చేర్చబడిన ఓపీఇండియా పేరు..
ఓపీఇండియా ‘కుట్ర సిద్ధాంతాలను’ వారి ‘ప్రాణాంతక ఆయుధం’గా ఆర్ఎస్ఎఫ్ అభివర్ణించింది.
జాబితాలో ఓపీఇండియాను చేర్చడంపై ఆ సంస్థ మాట్లాడుతూ, ‘2025లో పత్రికా స్వేచ్ఛపై దాడి చేసేవారు సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని పెంచడం ద్వారా జర్నలిస్టుల స్వేచ్ఛను మరింత పరిమితం చేశారు. ఓపీఇండియా దీనికి ఒక ఉదాహరణ.
ఆర్ఎస్ఎఫ్ ప్రకారం, “హిందూ జాతీయవాద వెబ్సైట్ ఓపీఇండియా ప్రభుత్వాన్ని విమర్శించే జర్నలిస్టులపై నిరంతరంగా దాడి చేస్తుంది. ఈ వెబ్సైట్ తనను తాను ‘లిబరల్ మీడియా కార్టెల్’ అని పిలవబడే దానికి వ్యతిరేకంగా పోరాటంలో భాగంగా చిత్రీకరించుకుంటుంది. ట్రోల్ నెట్‌వర్క్‌ల సహాయంతో, ఇది విమర్శనాత్మక జర్నలిస్టులను, మీడియా సంస్థలను అప్రతిష్టపాలు చేసే కథనాలను వ్యాప్తి చేస్తుంది. వారిని ‘సోరోస్ పర్యావరణ వ్యవస్థ’ లేదా ‘భారత వ్యతిరేక లాబీ’లో భాగమని పిలుస్తుంది.”
ఆర్ఎస్ఎఫ్ 2025 జాబితాలో జర్నలిస్టులు, మీడియా సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఓపీఇండియా ప్రచురించిన 96 కథనాలు ఉన్నాయి. ఇందులో జర్నలిస్టులు, మీడియా సంస్థల నెట్వర్క్”మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథన యుద్ధం” చేస్తోందని, “భారతదేశంలో పాలన మార్పుకు కుట్ర పన్నుతోంది”అని ఆరోపిస్తున్న కుట్ర సిద్ధాంతాల ఆధారంగా 200 పేజీల “నివేదిక”ఉంది.
ఆ సంస్థ ప్రకారం, ఓపీఇండియా వెబ్సైట్లో ప్రచురితమయ్యే ఇటువంటి కథనాలు తరచుగా సంబంధిత జర్నలిస్టులపై ఆన్లైన్ ట్రోలింగ్, పరువు నష్టం ప్రచారాలకు దారితీస్తాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
