ఎడిటర్ సంజయ్ శర్మ ప్రకారం, తన ఛానల్ ప్రభుత్వం నుంచి ఇలాంటి చర్యను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు.
గత సంవత్సరం పహల్గామ్ ఉగ్రవాద దాడి సమయంలో కూడా ఈ ఛానల్‌ను మూసివేశారు.
ఈ విషయం సుప్రీంకోర్టుకు వరకు వెళ్లిన తర్వాత, చడీచప్పుడు కాకుండా తమ ఉత్తర్వులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆ తర్వాత ఛానల్ పునరుద్ధరించబడింది.
న్యూఢిల్లీ: ‘4PM న్యూస్’ యూట్యూబ్ ఛానెల్‌ను తెరిస్తే, ‘జాతీయ భద్రత లేదా ప్రజా క్రమశిక్షణకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వు కారణంగా, ఈ ఛానెల్ ప్రస్తుతం ఈ దేశంలో అందుబాటులో లేదు’ అనే సందేశం కనిపిస్తుంది.
అయితే, మార్చి 12 నుంచి ఈ ఛానెల్ యూట్యూబ్‌లో అందుబాటులో లేదు.
తాము చేస్తున్న తీవ్ర విమర్శల కారణంగా, తమ ఛానల్‌ను పదే పదే ప్రభుత్వం నిషేధించడం ద్వారా నిజం గొంతు నులమడానికి ప్రయత్నిస్తోందని ఆ ఛానల్ ఎడిటర్ సంజయ్ శర్మ ఆరోపించారు.
ది వైర్‌తో మాట్లాడుతూ, యూట్యూబ్ నుంచి తనకు వచ్చిన ఈ-మెయిల్లో ఛానెల్ మూసివేతకు సంబంధించి ఎటువంటి సమాచారం లేదని సంజయ్ శర్మ అన్నారు.
జాతీయ భద్రత, ప్రజా క్రమాన్ని పేర్కొంటూ ప్రభుత్వ సూచనల మేరకు ఛానెల్‌ను మూసివేస్తున్నట్టు మాత్రమే అందులో పేర్కొన్నట్టుగా ఉందన్నారు.
అయితే, ఇరానియన్ ప్రొఫెసర్ అబ్బాస్‌తో జరిగిన సంభాషణ వీడియోకు సంబంధించి ఈ చర్య తీసుకున్నారని శర్మ అనుకుంటున్నారు.
తన యూట్యూబ్ ఛానెల్‌ను భారతదేశంలో మాత్రమే నిషేధించారని, దానిని ఇప్పటికీ విదేశాలలో చూడడానికి అందుబాటులో ఉందని సంజయ్ శర్మ తెలియజేశారు.
సంజయ్ శర్మ ప్రకారం, తన ఛానల్ ప్రభుత్వం నుంచి ఇలాంటి చర్యను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు.
గత సంవత్సరం పహల్గామ్ ఉగ్రవాద దాడి సమయంలో, ఇదే సాకుతో ఛానల్ మూసివేయబడింది.
తరువాత ఈ విషయం సుప్రీంకోర్టుకు చేరినప్పుడు, ప్రభుత్వం నిశ్శబ్దంగా తన ఉత్తర్వులను ఉపసంహరించుకుంది. దీంతో ఛానల్ పునరుద్ధరించబడింది.
2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా తన ఛానెల్ నిషేధించబడిందని సంజయ్ శర్మ చెప్పారు.
ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, అధికారానికి లొంగిపోవాలని, ప్రభుత్వానికి క్లిష్టమైన ప్రశ్నలు అడగకుండా ఉండాలని తనపై నిరంతరం ఒత్తిడి చేస్తున్నారని తను ఆరోపించారు.
గత 8-9 సంవత్సరాలుగా నేను నిరంతరం వేధింపులకు గురవుతున్నాను: ఎడిటర్
ఎడిటర్ చెప్పినదాని ప్రకారం, గత ఎనిమిది నుంచి తొమ్మిది సంవత్సరాలుగా వేధింపులకు తను గురవుతున్నారు.
మొదట తన వార్తాపత్రికను లక్ష్యంగా చేసుకున్నారు, ఆపై తన యూట్యూబ్ ఛానెల్ నిషేధించబడింది. దీంతో తను జర్నలిజం ప్రాక్టీస్ చేయకుండా నిరోధించబడ్డారు.
‘యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత, తన సీనియర్ అధికారి ఒకరు నాకు ఫోన్ చేసి, యోగికి వ్యతిరేకంగా మీరు వార్తలు ప్రచురిస్తున్నందున సీఎం మీపై చాలా కోపంగా ఉన్నారని అన్నారు’ మేము ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయము, అధికారంలో ఉన్న వ్యక్తిని మాత్రమే ప్రశ్నిస్తామని నేను అతనికి చెప్పానని శర్మ గుర్తు చేసుకున్నారు.
సంజయ్ శర్మ ఆ అధికారి మాట విననప్పుడు, తనపై తప్పుడు కేసు పెట్టి వేధించే ప్రయత్నం జరిగిందని చెప్పారు.
తనపై వేధింపులు ఇక్కడితో ఆగలేదని ఆయన చెప్పుకొచ్చారు. తన వార్తాపత్రికలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నివేదికను ప్రచురించారు.
దీంతో ఎస్టీఎఫ్ చీఫ్ తనపై, ఈ వార్తాపత్రిక యజమాని తన భార్యపై పరువు నష్టం దావా వేశారు. కొన్ని రోజుల తర్వాత, తన కార్యాలయంపై దాడి జరిగింది.
సంజయ్ శర్మ ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సంజయ్ సింగ్‌తో ఇంటర్వ్యూ తర్వాత, ప్రభుత్వం కేటాయించిన తన ఫ్లాట్‌ను ఖాళీ చేయవలసి వచ్చింది.
ఆ ఫ్లాట్ అప్పట్లో జర్నలిస్టులకే కేటాయించబడింది. తన గుర్తింపు రద్దు చేయబడింది. తన వార్తాపత్రికకు ప్రకటనలను నిరాకరించబడ్డాయి.
దీంతో శర్మ చాలా బాధపడ్డారు. చివరికి, తన సొంత యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించారు. దీనిని ప్రజలు ఎక్కువగా చూస్తున్నారు, వింటున్నారు, అయితే ఇది ప్రభుత్వాన్నిఇబ్బంది పెడుతోంది.
“ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమయంలో నా ఛానెల్ మొదటిసారి మూసివేయబడినప్పుడు, నేను UP4PM అనే కొత్త ఛానెల్‌ని సృష్టించాను. కానీ మేము న్యాయ పోరాటం కొనసాగించాము. నా న్యాయవాది యూట్యాబ్‌కు కఠినమైన నోటీసును అందించారు, ఆ తర్వాత వారు మాకు క్షమాపణలు చెప్పి మూడవ రోజున మా ఛానెల్‌ను పునరుద్ధరించారు” అని ఆయన చెప్పారు.
తన జాతీయ 4PM ఛానెల్‌కు దాదాపు 8.5 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారని, వీక్షకుల సంఖ్య (కంటెంట్ చూసే మొత్తం వీక్షకుల సంఖ్య) దాదాపు 10 మిలియన్లు ఉందని ఆయన వివరించారు.
అదే సమయంలో, UP4PMకి దాదాపు 1.8 మిలియన్ల సబ్స్క్రైబర్లు ఉన్నారు.
‘ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు తీసుకున్న చర్య’
పహల్గామ్ దాడి తర్వాత ఈ ఛానెల్‌పై తీసుకున్న చర్య గురించి ప్రస్తావిస్తూ, “ఆ సమయంలో, ఉగ్రవాదులు ఈ ప్రాంతంలోకి ఎలా ప్రవేశించారని నేను అడిగాను. దీంతో, ఆదాయపు పన్ను- ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు కోసం నాపై ఫిర్యాదు దాఖలు చేయబడింది. ప్రస్తుతం, ఇరాన్ భారతదేశానికి మిత్ర దేశమని మాత్రమనే ప్రశ్నను లేవనెత్తాము. తమతో పరిపాలన ఎందుకు ఇలా వ్యవహరిస్తోంది? ఏ జర్నలిస్టైనా అడగవలసిన విధంగానే అడిగాము కదా. ఈ కారణంగా, జాతీయ ప్రయోజనాల పేరుతో మా ఛానెల్‌పై మళ్ళీ చర్య తీసుకున్నారు”అని వాపోయారు.
సంజయ్ శర్మ ప్రకారం తనకు గుజరాత్ కోర్టు నుంచి చాలా నోటీసులు వచ్చాయని, లక్నోలో తనపై ఇంకా కేసులు నమోదయ్యాయని ఆయన చెప్పారు.
గత కొన్ని సంవత్సరాలుగా తాను అనేక దర్యాప్తులను ఎదుర్కొన్నానని తను చెప్పారు.
2025 మే నెలలో, భారతదేశం- పాకిస్తాన్ మధ్య సైనిక వివాదంలో రాఫెల్ విమానాల కూల్చివేతకు సంబంధించిన సీఎన్ఎన్ కథనాన్ని ప్రచురించిన తర్వాత, ది వైర్ వెబ్సైట్ 12 నుంచి 15 గంటలకు పైగా బ్లాక్ చేయబడింది.
గత నెల, మోడీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఒక వ్యంగ్య కార్టూన్‌ను ప్రసారం చేసినందుకు ఫిబ్రవరి 9న సాయంత్రం భారతదేశంలో ది వైర్ ఇన్స్టాగ్రామ్ ఖాతాను దాదాపు రెండు గంటల పాటు నిలిపివేశారు.
మంత్రిత్వ శాఖ బాధ్యతను నిరాకరించగా, మెటా ద్వారా “తప్పు” జరిగినట్టుగా వెలుగులోకి వచ్చింది.
ఈ అప్రకటిత చర్య భావప్రకటనా స్వేచ్ఛ, డిజిటల్ సెన్సార్షిప్ గురించి పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
