దేశంలోనే అత్యంత శక్తివంతమైన నాయకుడికి హాస్యమే ప్రధాన శత్రువు గా మారింది. అందుకే ఒక కార్టూనిస్ట్ వేసిన కార్టూన్ దేశ అగ్రనేత ను పోలిన మనిషిని తన కార్టూన్ లో చూపించడంతో అతనిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారట !
ఈ దేశం ఏమైనా జరుగవచ్చు కానీ హాస్యం మాత్రం కుదరదు.
52 సెకన్ల పాటు ఆన్లైన్ లో ఉండటమే దేశానికి పెనుముప్పు గా మారిందా ?
ఫిబ్రవరి 7 న వైర్ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్ట్ అయిన ఒక చిన్న కార్టూన్ రాజకీయంగా పదునైన భావాన్ని వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిష్టంభన, 2020 నాటి చైనా సరిహద్దు సంక్షోభం గురించి పార్లమెంట్ లో చర్చించటానికి ప్రధాని సిద్ధం కాకపోవడాన్ని ఈ కార్టూన్ ప్రతిబింబిస్తోంది. ఈ కార్టూన్ ఫిబ్రవరి 9 న వైరల్ అయిన తర్వాతనే ఈ కార్టూన్ దేశ భద్రతకు ప్రమాదకరమైనది గా మారింది.
ఒక కార్టూన్ మీద ఎంత సెన్సార్ షిప్ ఉంది అంటే చివరకు ది వైర్ ఇన్స్తా గ్రాం ఖాతాను ప్రభుత్వం బ్లాక్ చేసింది. అంతే కాదు. ఎక్స్ యాజమాన్యానికి కేంద్ర ప్రభుత్వం లేఖ కూడా రాసింది. ఈ 52 సెకన్ ల వీడియో కంటెంట్ ను కూడా తొలగించాలి అని !
ప్రభుత్వాన్ని చూసి నవ్వడం కూడా ఈ దేశంలో ప్రస్తుతం సాధ్యం కావడం లేదు. ఇంకా రాజ్యాంగం లోని ఆర్టికల్ 19(1)(అ) ఇంకా అమల్లో ఉన్నపుడే దేశం ముందు ఉన్న దుస్థితి ఇది. భావ ప్రకటనా స్వేచ్ఛ లో నవ్వటం కూడా ఒకటి. నవ్వటం కూడా ఒక వ్యక్తీకరణ.
గత సంవత్సరం లెక్స్ ఫ్రీడ్మాాన్ కు ఇచ్చిన పోడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో “విమర్శ ప్రజాస్వామ్యానికి ఆత్మ అని బలంగా నమ్ముతాను. నిజంగా నీ రక్తంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉంటే ప్రశ్నించడం నేర్చుకోవాలి. ప్రశ్నించాలి” అన్నారు. విమర్శ పెరగాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ” మరింత విమర్శ ఉండాలి. ఈ విమర్శ కూడా పదునుగా నూ ఆలోచింప చేసేదిగానూ ఉండాలి . మన మత గ్రంథాల్లో కూడా : నీ విమర్శకు అదుపు ఉండకూడదు. విమర్శకులు మనకు అత్యంత సన్నిహిత మిత్రులుగా ఉండాలి. సహచారులుగా ఉండాలి. ఎందుకంటే అర్థవంతమైన విమర్శ మనల్ని మనం మార్చుకోవడానికి అవకాశం ఇస్తుంది. మరింత లోతైన అవగాహన తో ప్రజాతంత్రయుతంగా పని చేయవచ్చు ” అని కూడా ప్రధాని ప్రస్తావించారు.
ప్రధాని ఎంటే గొప్పగా చెప్పినా ఆచరణలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో ఇవేవీ కనిపించడం లేదు.
వ్యంగ్య వ్యాఖ్యాత కునాల్ కామ్ర చివరిసారిగా ముంబై లో నిర్వహించిన కార్యక్రమం తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం ఎలా వ్యహరించిందో చూసాము. మునావర్ ఫరూకి నిర్వహించని కామెడీ షో కారణంగా గడిపిన జైలు జీవితం మన ముందు ఉంది. తాజాగా 52 సెకన్ల ఇన్స్టా రీల్ ను నిషేధించడం ఇపుడు తాజా దాడి సందర్భం. యివన్నీ ప్రభుత్వం వ్యవహారశైలి ని పరిశీలించడానికి హాస్యాన్ని వేదిక గా ఎంచుకున్నాయి.
సామాజిక మాధ్యమాలపై గుత్తాధిపత్యం కలిగిన కంపెనీలను గుప్పిట్లో పెట్టుకున్న ప్రభుత్వం చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. ప్రత్యామ్నాయ అవగాహన గురించి ముందుకొస్తున్న ఆలోచనల వ్యక్తీకరణకు వేదికే లేకుండా చేస్తున్నాయి. అటువంటి ఆలోచనలే దేశానికి ప్రభుత్వానికి ముప్పు అన్న ప్రచారాన్ని ఉధృతం చేస్తున్నాయి. ఇటువంటి ప్రత్యామ్నాయ ఆలోచనలు అన్న చిన్న చిన్న గుండు సూదులు ప్రభుత్వం ఎగురవేస్తున్న భారీ ప్రచార బుడగలను, అవి సృష్టిస్తున్న నీరులేని మేఘాలను పటాపంచలు చేయగల సామర్ధ్యం కలిగినవి కావడమే దీనికి కారణం.

వ్యంగ్యం పలుకుబడి పదును ఎంతో చరిత్ర ఎన్నో సందర్భాల్లో నమోదు చేసింది. వ్యంగ్యం, హాస్యం వాస్తవాలు చెప్పటం మొదలు పెడితే పాలకులకు ఎలాంటి ఇబ్బందులూ వస్తాయి అన్నది కూడా అర్థం చేసుకునేందుకు అనేక చారిత్రక సందర్భాలు ఉన్నాయి. అందుకే భారదేశంలో నేడు హాస్యం వ్యంగ్యం కూడా ప్రమాదకరంగా పరిణమించాయి. దేశం గర్వించదగ్గ కార్టూనిస్టు శంకర్ ను ఉద్దేశించి భారత ప్రథమ ప్ర ధాని జవహర్ లాల్ నెహ్రూ నీ కార్టూన్ల లో నన్నేమీ ఉపేక్షించవద్దు అని స్పష్టంగా చెప్పారు. ఇదే విషయాన్ని నెహ్రూ చెప్తూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఫిలిం డివిజన్ ఓ లఘు చిత్రాన్ని కూడా విడుదల చేసింది. ఆ స్ఫూర్తి కి నేటి పాలకవర్గం ఆచరణకు మధ్య వేల కాంతి సంవత్సరాల దూరం ఉన్నది. ఈ దేశం చవిచూసిన ఏకైక ఎమర్జెన్సీ స్థితిలో సైతం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కి ఆ నిర్ణయం నాడే అని చెప్పుకోగల ధైర్యం ఉన్నది.
ఈ రోజు పాలక పక్షానికి చెందిన వాళ్ళు ఆడింది ఆట పాడింది పాటగా మారింది. ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించే వాళ్లు హత్యలు అత్యాచారాలు వంటి బెదిరింపులను ఎదుర్కోవడం దైనందిన కార్యక్రమం గా మారింది. స్వయంగా అస్సాం ముఖ్యమంత్రి ముస్లిం లను కాలచివేస్తున్నట్టు వీడియోలు తీసి మరీ పోస్ట్ చేస్తున్నారు. అయినా అధికార యంత్రాంగం ఇటువంటి వాటిగురించి ఏ చర్యలూ తీసుకోనే స్థితిలో లేవు. ప్రతిపక్షాన్ని హేళన చేయటానికి పాలకపక్షం శ్రేణులు మీడియా సైన్యం వ్యంగ్య కారులు పట్టపగలే బాహాటంగా నూ చీకటి వేళల్లో పని చేసే డార్క్ వెబ్ లాంటి వేదికల్లోనూ యదేశ్చ గా చలామణి అవుతున్నాయి. అయినా సో కాల్డ్ పాలనా యబిత్రాంగానికి ఇదేమీ పట్టదు.
ఎవరైనా ప్రభుత్వం గీసిన గీతల పరిధికి బయట ఆలోచించటం గాని ఆచరించిన గాని ప్రవర్తించడం గాని చేస్తే ఐటి నిబంధనలు, అత్యవసర అధికారాలు కర్ర పట్టుకుని బయలు దేరతాయి. నియంతృత్వం నీలినీడలు గుండా భారతదేశం ప్రయాణిస్తోంది. ఈ విషయాన్ని ధృవీకరించటానికి అనేక ఉదాహరణలు మనముందు ఉన్నాయి. పౌర వేదికలు, మీడియా ల పై బిగుస్తున్న ప్రభుత్వం పట్టు ఈ నీలి మేఘాల వ్యాప్తికి కారణం. స్వేచ్ఛాయుత వాతావరణములో పని చేసే హక్కు ను కోరుకోవడం అంటే అదేదో జర్నలిస్టులకు మాత్రమే రక్షణ కోరుకోవడం కాదు. ప్రభుత్వాలు నిజాయితీగా ఉండాలని ఆశించడం, నిరంతరం ప్రభుత్వాలను వేరపు లేకుండా ప్రశ్నించే అవకాశం ఉండటం, ప్రభుత్వాలు ప్రజలకు జవాబుదారీ గా ఉండేలా చూడటం కోసమే ఈ హక్కు.
52 సెకన్ల యానిమేటెడ్ వీడియో ను అడ్డుకోవడానికి ప్రభుత్వానికి అత్యవసర అధికారాలు అవసరం అయితే ఈ హాస్యం ఎవరికి తగలాలో వాళ్లకు గట్టిగా తగిలినట్టే. మోడీ ప్రభుత్వానికి తగిలినట్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
