బీహార్ పొరుగు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్‌లో మాయావతి, బెంగాల్లో మమతా బెనర్జీ ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఇప్పటి వరకు ప్రతిపక్షాలు సైతం గౌరవించేలా బీహార్‌లో మహిళలు ముఖ్యమంత్రిగా ఎందుకు కాలేకపోయారు? బీహార్ రాజకీయాలు పితృస్వామ్యం, కులతత్త్వంతో అద్దబడ్డాయి. అంతేకాదు, కులం ముసుగులో మహిళలకు సంబంధించిన అంశాలు విస్మరణకు గురైయ్యాయి.
బీహార్ ఎన్నికలలో కులాధార భాగస్వామ్యం చాలా కీలకమైన అంశంగా ఉంది. ఏ కులానికి చెందిన నేత ఎవరనేది ప్రజలకు అవసరమైన విషయం. కానీ బీహార్ రాజకీయాలలో సగం జనాభా గల వారి భాగస్వామ్యమేది? వారి కోసం ఎటువంటి అంశాలు ప్రధానమైనవనే వాటి గురించి ఎవరికీ పట్టనేపట్టదు.
“నేను ఏ సముదాయ పురోగతినైనా, మహిళల భాగస్వామ్య పురోగతితో లెక్కిస్తాను”అని బాబా సాహెబ్ అంబేడ్కర్ అన్నారు.
బీహార్‌లో పార్టీల మ్యానిఫెస్టో మహిళా రాజకీయ ప్రాతినిధ్యం వరకే పరిమితమవుతుంది. ఏ కుల వ్యక్తి ముఖ్యమంత్రి లేదా మంత్రి అవుతాడనేదే ఇక్కడ కీలక పోటీగా ఉంటుంది. ఇది సరైనది కూడా, ఎందుకంటే సమాజంలో తరతరాలుగా ఎవరైతే విస్మరణకు గురైయ్యారో వారికి అవకాశం లభించాలి. దీనివల్ల వాళ్లు సామాజికంగా మిగితావారితో సరిసమానమైన స్థాయికి చేరుకోగలరు. వారి రాజకీయ ప్రాతినిధ్యం నిర్ధారించుకోవాలి కాబట్టి ఇది సముచితమైనది.
భాగస్వామ్యనికి ఇదే ఆధారమైతే, సమాజంలో మహిళలు అణిచివేతకు గురికాలేదా? వేల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు పురుషాధిక్యాన్ని వారు ఎదుర్కోవడం లేదా?
25% మహిళలకు టికెట్ ఇవ్వని వైనం..
ఏ పార్టీ కూడా మహిళను సీఎం, డిప్యూటీ సీఎంగా ప్రకటించలేదు. బీహార్‌కు ఒకేఒక మహిళా ముఖ్యమంత్రిగా రాబడీ దేవి సేవలందించారు. కానీ తను ఏ సభలో లేదా ర్యాలీలో ప్రసంగించిన దాఖలాలూ లేవు. తన ఆలోచనలు ప్రజలకు తెలియనే తెలియదు. తను ప్రాతినిధ్యం వహించలేదనేది స్పష్టం.
స్వపక్షం లేదా విపక్ష సహాయంతో ఏదైనప్పటికీ, నితీష్ కుమార్ ఇప్పటి వరకు 9 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రతీ ఒక పార్టీ కూటమితో బీహార్ కోసం తను పనిచేశారు. తన గత 5 పదవీకాలాలను చూసుకున్నట్లైతే 2 సార్లు కాంగ్రెస్- ఆర్జేడీ కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా మూడుసార్లు ఎన్డీఏతో, అందులో నుంచి ఒక పదవీకాలం ప్రస్తుతం నడుస్తోంది.
ఈ ఐదు పదవీకాలాలలో మంత్రిమండలిలో మహిళా భాగస్వామ్యాన్ని చూసినట్లయితే, ప్రతీ పదవీకాలంలో ఎక్కువలో ఎక్కువ ముగ్గురు మహిళలు మాత్రమే మంత్రులయ్యారు. దీనికి విరుద్ధంగా ప్రతీసారి 30 నుంచి ఎక్కువ మంత్రిత్వశాఖలను పురుషులకు ఇచ్చారు.
అయినప్పటికీ, 2020లో నితీష్ కుమార్ 7వ పదవీకాలంలో దేశ స్వాతంత్య్రం తర్వాత; బీహార్‌కు మొదటిసారి మహిళా ఉపముఖ్యమంత్రి రేణుదేవీ లభించారు. కానీ తన పదవీకాలం 2022 ఎన్డీయేతో జేడీయూ కూటమి తెగదెంపులతో ముగిసిపోయింది.
2020 అసెంబ్లీ ఎన్నికల్లో 243 సీట్లలో నుంచి ఎన్డీఏ దాదాపు మహిళలకు 35 టికెట్లను కేటాయించింది. మహాకూటమి దాదాపు 25 మహిళా అభ్యర్థులను మైదానంలో దించింది.
ప్రస్తుతం బీహార్ అసెంబ్లీలో 243 సీట్లలో 26 మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. 2015లో కూడా అటూఇటుగా ఇదే పరిస్థితి నెలకొంది. కేవలం 28 మహిళా ఎమ్మెల్యేలను ఎన్నుకున్నారు. శాసనమండలి గురించి మాట్లాడితే, ప్రస్తుతం 75లో కేవలం 10 మంది మహిళా ఎమ్మెల్సీలున్నారు.
ఈ గణంకాలు కేవలం రాష్ట్ర ఎన్నికల వరకు మాత్రమే పరిమితం కాలేదు. బీహార్‌లో 40 లోక్‌సభ సీట్లు ఉన్నాయి- 2024 లోక్‌సభ ఎన్నికలో ఎన్డీఏ బీహార్‌లో 4, ఇండియా కూటమి 6 మహిళా అభ్యర్థులకు టికెట్ కేటాయించింది. అందులో నుంచి 5మంది మాత్రమే ఎన్నికల్లో విజయబావుటా ఎగరేశారు. ప్రస్తుతం ఎంపీలుగా కొనసాగుతున్నారు.
దీనికంటే ముందు 2019లో కూడా కేవలం ముగ్గురు, 2014లో ఇద్దరు మహిళలు ఎంపీలుగా ఎన్నుకోబడ్డారు. 1996లో గయా నుంచి భగవతీ దేవీ ఎన్నుకోబడ్డారు. ఈరోజు తన లోక్‌సభ ప్రసంగాల వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి.
రాజకీయ కుటుంబాలతో ముడిపడిన మహిళలు..
అయినప్పటికీ, భగవతీ దేవిలాంటి మహిళల స్వరం ప్రస్తుతం తగ్గుతోంది. వాళ్లు తమ స్వంతబలం మీద రాజకీయాలలోకి వచ్చారు. అంతేకాకుండా, అణివేతకు గురవుతున్న పార్లమెంట్లో బాధితుల హక్కుల గురించి మాట్లాడారు. అయితే ఏ మహిళ అభ్యర్థిగా ఎన్నికలలో దిగుతారో, వారు మందు నుంచే రాజకీయ కుటుంబానికి చెందినవారై ఉంటారు. దీనికి ఒక పెద్ద ఉదాహరణగా ప్రస్తుతం బీహార్‌లో ఎంపీలైన 5మంది మహిళలు కనబడతారు.
బీహార్ ప్రభుత్వంలో మంత్రి అశోక్ చౌధరి కూతురు- సమస్తీపూర్ ఎంపీ శాంభవీ చౌధరి. ఎంపీ మీసా భారతీ తను లాలూ యాదవ్ కూతురు. మిగితా ముగ్గురు ఎంపీలు కూడా కుటుంబ రాజకీయాలతో గాఢమైన సంబంధాలున్నాయి. పేద- మధ్యతరగతి మహిళలు రాజకీయాలలో భాగస్వామ్యం కావడం లేదని దీంతో స్పష్టమవుతుంది. ఏ మహిళలైతే ఎన్నికలలో గెలుస్తున్నారో, వారి వెనుక తండ్రి లేదా భర్త ఉన్నారు. ఇదంతా పరిశీలిస్తే దీని వెనుక కూడా పురుషాధిక్యత కనబడుతుంది.
వస్తున్న 80% మహిళా అభ్యర్థులు- బాధితులలో నుంచి రావడం లేదని స్పష్టమవుతుంది. దీంతో కుటుంబ రాజకీయాలు, పెట్టుబడీదారీ, పితృస్వామ్యం బీహార్ రాజకీయాలను కబళిస్తున్నాయని అర్థమవుతోంది.
2020లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో మహిళల ఓటు శాతం 59.7గా ఉంది. ఇది పురుషుల కంటే కూడా ఎక్కువ. ప్రభుత్వం ఏర్పాటులో అన్నిటి కంటే ఎక్కువగా మహిళల భాగస్వామ్యం ఉందని ఈ గణంకాలు తెలుపుతున్నాయి. కానీ అన్ని పార్టీలూ కూడా కళ్లు మూసుకున్నాయి.
2025 ఎన్నికలలో ఆర్జేడీ 143 నుంచి కేవలం 24 సీట్లు; అదే బీజేపీ- జేడీయూ కూటమి 202 సీట్లలో 26 సీట్లు; కాంగ్రెస్ 61లో 5 సీట్లు; జన్ సూరజ్ పార్టీ 243 సీట్లలో కేవలం 40 సీట్లను మహిళలకు కేటాయించి, ఎన్నికల బరిలో దించింది. సగం జనాభాకు ఏ పార్టీ కూడా 25% సీట్లను కేటాయించలేదు.
బీహార్ రాజకీయ వ్యవస్థ పూర్తిగా పురుషుల చేతిలో ఉందని, సగం జనాభాను తమ ఓటు బ్యాంకు కంటే ఎక్కువగా భావించడంలేదని అర్థమవుతుంది. పరిస్థితి కూడా సరిగ్గా అలానే ఉంది.
ఇద్దరు మహిళలకు ముఖ్యమంత్రులుగా బీహార్ రెండు పొరుగు రాష్ట్రాలు పట్టంకట్టాయి. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి, బెంగాల్లో మమతా బెనర్జీ. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. అయినప్పటికీ రాజకీయ కౌశల్యాన్ని చూసి ఇతర పార్టీలు భయపడేలా, ప్రతిపక్షాలు గౌరవించేలా ఒక్క మహిళ కూడా బీహార్‌కు ముఖ్యమంత్రిగా ఎందుకు కాలేకపోయింది?
అక్షరాస్యతా రేటు జాతీయ సగటు రేటు కంటే కూడా తక్కువ..
జాతీయ నమూనా సర్వే కార్యాలయం గణంకాల ప్రకారం, బీహార్ మహిళా అక్షరాస్యత రేటు 66.1%గా ఉంది. ఇది రాష్ట్ర సగటు కంటే కూడా తక్కువ. స్కూల్లో బాలికలు పన్నెండవ తరగతి ఉత్తీర్ణులైతే, వారికి ఉచితంగా సైకిల్ ఇవ్వడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి బయటకు వెళ్లి పట్టణాలలో చదివేలా ఈ పథకం బాలికలను ప్రోత్సహిస్తోంది.
అయితే, కళాశాల పరిస్థితులు పూర్తిగా బాగోలేవు. అందులో సమయానికి పరీక్షలు జరగవు. అంతేకాకుండా, డిగ్రీ పట్టాకూడా లభించదు. మగధ యూనివర్సిటీ(గయా), జయప్రకాశ్ నారాయణ్ యూనివర్సిటీ(ఛప్రా) ఇటువంటి రెండు విశ్వవిద్యాలయాలు ఉదాహరణ.
ఇది విద్యార్థుల ఉద్యోగ పరీక్షలపై ప్రభావం చూపి, వారు అర్హతను సాధించకుండా చేస్తుంది. ఎందుకంటే, డిగ్రీ ఐదు సంవత్సరాల తర్వాత లభిస్తుంది. అది తమ వయసుకు అడ్డంకిగా మారుతుంది. అందుకే ఎందిరికో ఈ వ్యవధిలోనే పెళ్లి చేసేస్తారు. రాజకీయ స్పృహ లేకపోవడానికి విద్య లేమి కారణమవుతుంది. మహిళలు చదువుకుంటే రాజకీయంగా చైతన్యవంతులయ్యే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వ ఉద్యోగంలో బాలికలకు 35శాతం రిజర్వేషన్‌ను మహిళా సాధికరత కోసం ప్రభుత్వం కల్పిస్తుంది. కానీ బీహార్‌లోని పూర్తి జనాభాలో కేవలం 6.11శాతం మాత్రమే పట్టభద్రులైనట్టుగా బీహార్ ప్రభుత్వ కులగణన సర్వే నివేదిక తెలియజేస్తుంది. ఇందులో బాలికల భాగస్వామ్యం ఏమై ఉంటుంది? ఒకవేళ వాళ్లకు చదవడం, రాయడం రాకపోతే ప్రభుత్వ ఉద్యోగాలలో ఎలా భర్తీ అవుతున్నారు?
“వెళ్లండి.. విద్యను ఆర్జించండి, స్వావలంబనను సాధించండ”ని సావిత్రిబాయి ఫూలే అన్నారు.
విద్యను, పాఠశాలలను, విశ్వవిద్యాలయాలను బలోపేతం చేసే కంటే ఉద్యోగం కల్పించడాన్నే మహిళా సాధికారతకు రహదారిగా పాలకులు భావిస్తున్నారు.
జీవికా దీదీ పథకంతో మహిళలకు 10 వేల రూపాయలను అందించారు. దీంతో దాదాపు 1.40 కోట్ల మహిళలకు లాభం చేకూరింది. ఎన్నికల సమయంలోనే ఇదంతా ఎందుకని పశ్న?
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రతీ సంవత్సరం 2,500 ఆర్థిక సహాయం మహిళలకు అందిస్తామని మహాకూటమి కూడా తమ మ్యానిఫెస్టోలో తెలియజేసింది. ఈ ఆర్థిక సహాయం సంవత్సరానికి 30వేలవుతుంది.
బీహార్‌లో ఎక్కువగా మహిళా ఓటర్లు..
బీహార్ నుంచి ఎక్కువ మంది పురుషులు వివిధ రాష్ట్రాలకు వలస వెళ్తుంటారని ఒక అధ్యయనంలో తేలింది. ఈ అధ్యయనం ప్రకారం, వీళ్లు ఆర్థిక సమస్యల వల్ల ఎన్నికల సమయంలో ఓటు వేయడానికి రాలేకపోతారు. దీంతో మహిళల ఓటుశాతం పురుషుల కంటే ఎక్కువగా నమోదవుతుంది. మహిళల ఓటు శాతం ఎక్కువ ఉండడం వల్ల, ఓట్ల కోసం వివిధ పార్టీలు మహిళలను ప్రలోభాలకు గురిచేస్తున్నాయి. అంతేకాకుండా తమ 5 ఏళ్ల దారిని సాఫీగా చేసుకుంటున్నాయి. ఇక్కడ లింగవ్యత్యాసం కీలక భూమికను పోషిస్తుంది.
సర్పంచ్ ఎన్నికలలో 50శాతం రిజర్వేషన్ మహిళలకు లభించింది. దీంతో ప్రభుత్వం మహిళలను నేల మీదైతే నిలబెట్టాలని అనుకుంటుంది. కానీ అధికారానికి సంబంధించిన ఉన్నతమైన నిచ్చెన ఎక్కకూడదని అనుకుంటుంది. చిన్న స్థానాలలో మహిళల భాగస్వామ్యం సురక్షితం చేసే ప్రభుత్వం మహిళలు నిర్ణయం తీసుకునే పదవుల మీద దృష్టిసారించడానికి ఇష్టపడడం లేదని స్పష్టమవుతుంది.
ఇదంతా గమనిస్తే, బీహార్ రాజనీతి పురుషాధిక్య మసితో పూతపూయబడింది. అక్కడ ఏ మహిళ కూడా లేవాలని అనుకుంటే లేవలేదు.
(వ్యాస రచయిత సిద్ధార్థ్ గౌతమ్ జామియా మిలియా ఇస్లామియాలో ఎంఏ సోషియోలాజీ విద్యార్థి)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
