గత ఏడు నెలలుగా తాను నిరంతరం అవమానాలను, బెదిరింపులను ఎదురుకుంటూ మానసిక వేదనకు గురయ్యానని బాధిత మహిళ తెలియజేసింది.
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లోని శివపురికి చెందిన భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నేత కొడుకు తనను అత్యాచారం చేశాడని గతంలో ఆరోపించిన మహిళ నిద్రమాత్రలను, ఎలుకల మందును తీసుకున్నది. ఈ క్రమంలో తన పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.
బీజేపీ నేత శివపురి మున్సిపల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గాయత్రి శర్మ కొడుకు రజత్ శర్మకు వ్యతిరేకంగా 2025 ఏప్రిల్ 30న ఏ మహిళయితే ఫిర్యాదు చేసిందో- తన పరిస్థితి వేగంగా క్షీణించడంతో ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలియజేసినట్టుగా ఎన్డీటీవీ కథనం పేర్కొన్నది.
విషం తీసుకునే కంటేముందు ఆరు పేజీల మరణవాంగ్మూళాన్ని బాధిత మహిళ రాసింది. అందులో గత ఏడు నెలలుగా మానసిక హింసకు, బెదిరింపులకు తాను గురవుతున్నట్టుగా తెలియజేసింది.
“నేను చాలా స్పృహతో మరణవాంగ్మూళాన్ని రాస్తున్నాను. శివపురి మున్సిపల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ గాయత్రి శర్మ, ఆమె భర్త సంజయ్ శర్మ నా చావుకు కారణం. వాళ్ల కొడు రజత్ శర్మతో నాకున్న సంబంధం గురించి వాళ్లకు ముందే తెలుసు. ఇంతకు ముందు పెళ్లి విషయంలో తనకు ఎటువంటి అభ్యంతరం లేదని, దీని గురించి మాట్లాడదామని గాయత్రి శర్మ నాతో చెప్పారు”అని లేఖలో బాధితురాలు పేర్కొన్నది.
పెళ్లి చేసుకుంటానని రజత్ శర్మ తనతో చెప్పినప్పటికీ, మరోవైపు 2025 ఏప్రిల్ 14న అతని కుటుంబం వేరేచోట నిశ్చితార్థానికి నిర్ణయించిందని ఆమె ఆరోపించారు.
త్యాగాన్ని- సమర్పణను నేర్చుకోమని రజత్ శర్మ తల్లి, బీజేపీ నేత గాయత్రి శర్మ ద్వారా బెదిరింపులకు గురైయ్యానని కూడా బాధితురాలు తెలియజేసింది.
“తన కొడుకు ముందే నన్ను తిట్టింది”అని బాధితురాలు లేఖలో ప్రస్తావించినట్టుగా ఎన్డీటీవీ కథనం పేర్కొన్నది.
ఏప్రిల్ 14న బాధితురాలు ఎప్పుడైతే పోలీసు స్టేషన్‌కు వెళ్లిందో, అదే రోజు రజత్ శర్మ నిశ్చితార్థం జరుగుతోంది. ఆరోజు పోలీసుస్టేషన్లో ఐదు గంటలు ఎదురు చూసినప్పటికీ బాధితురాలి ఫిర్యాదును పోలీసులు నమోదు చేయలేదు. ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని తన మీద రాజకీయ ఒత్తిడి చేశారని కూడా బాధితురాలు తెలియజేసింది.
“ఎప్పుడైతే కేసుకు సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయో- అప్పటి నుంచి రాజకీయ నాయకులు, పదవీవిరమణ పొందిన అధికారులు, పోలీసు అధికారులతో ఒత్తిడికి, బెదిరింపులకు గురిచేశారు. అంతేకాకుండా, 50 లక్షలను అందిస్తామని ప్రలోభ పెట్టారు”అని ఆమె మరణవాంగ్మూళంలో పేర్కొన్నది.
గత ఏడు నెలల నుంచి నిరంతరం తను అవమానించబడ్డానని, బెదిరింపులకు గురైయ్యానని ఆమె తెలియజేసింది. ఈ క్రమంలో మానసికంగా తీవ్రంగా క్రుంగిపోయానని ఆవేదనను వ్యక్తం చేసింది.
తనకు న్యాయం చేయాలని ప్రధాని మోడీ, రాష్ట్ర సీఎం మోహన్ యాదవ్, కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు తను విన్నవించుకుంది.
మహిళ ఫిర్యాదు, దాఖలు చేసిన ఛార్జ్‌షీట్ ఆధారంగా భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) సెక్షన్ 69 కింద ఏప్రిల్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేయబడిందని శివపురి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు అమన్ సింగ్ రాథోర్ ఎన్డీటీవీకి తెలియజేశారు.
“కోర్టులో కేసు పెండింగ్‌లో ఉంది. మరణవాంగ్మూళాన్ని స్వాధీనం చేసుకున్నాము. బాధితురాలి ఆరోగ్యస్థితి కుదుటపడిన తర్వాత ఆమె స్టేట్మెంట్ను రికార్డ్ చేసి చట్టపరమైన చర్యలకు దిగుతాము”అని రాథోర్ చెప్పారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
