సాంస్కృతిక, పర్యావరణ, అస్తిత్వ అంశాలు కేంద్ర బిందువుగా హైదరాబాద్ అంతర్జాతీయ లఘు చిత్రోత్సవాన్ని గత నెలలో నిర్వహించారు.
సంఘర్షణాత్మక ప్రాంతాలు, విస్మరణకు గురైనవారి అస్తిత్వ ప్రశ్నలు, మనుగడ, అసంపూర్ణ కలలు, మానవ భావోద్వేగాలతో పాటు ప్రాపంచిక వాస్తవాలను పెద్ద తెర మీదికి హైదరాబాద్ అంతర్జాతీయ లఘు చిత్రోత్సవం(హెచ్‌ఐఎస్‌ఎఫ్‌ఎఫ్) తీసుకువచ్చింది.
ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 19 నుంచి 21 వరకు ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో నిర్వహించారు. వాణిజ్య కథనాలు ఆధిపత్యం చెలాయిస్తున్న ప్రస్తుత శకంలో– తెలంగాణ ప్రత్యేక సాంస్కృతిక, స్వతంత్ర గొంతుకలకు ఈ వేడుక అవకాశం కల్పిస్తూ ప్రస్తుతం చిన్న తరహా సినిమాకు పునశ్చరణ కల్పించింది.
పూర్వ సాంస్కృతిక, పర్యావరణ, అస్తిత్వంతో పాటు; ప్రస్తుత అంశాల ద్వారా సాంకేతిక నైపుణ్యతను కూడా ఈ ఉత్సవం చాటి చెప్పింది. అంతేకాకుండా నిశ్శబ్దం, బలమైన కథావస్తువుల ద్వారా ప్రతివాదాలకు అవకాశమిస్తూ ప్రపంచవ్యాప్త జీవన వాస్తవాలను చిత్రీకరించింది.
స్పందనా ప్రవాహం..
గమనించాల్సిందేంటే, 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని తెలంగాణలో హెచ్‌ఐఎస్‌ఎఫ్‌ఎఫ్ నిర్వహించింది. ఇది ప్రారంభ వేడుక అయినప్పటికీ, భారీ స్పందనను ఈ వేడుక సొంతం చేసుకుంది. ఇరాన్, ఇరాక్, స్పెయిన్, ఈజిప్టు, యూఎస్ఏ, యూకే, యూఏఈ, శ్రీలంక, నెదర్లాండ్స్, దక్షిణ కొరియావంటి దేశాలను కలుపుకోని మొత్తం 705 ఎంట్రీలు స్వీకరించబడ్డాయి.

ఈ మొత్తం ఎంట్రీలలో 60 లఘుచిత్రాలను అధికారిక ఎంట్రీలుగా 25 మంది సభ్యుల జ్యూరీ ఖరారు చేసింది. దీంతో పాటు 11 లఘుచిత్రాలను ఐదుగురు సభ్యుల ప్రధాన జ్యూరీ విజేతలుగా ఎంపిక చేసిది. సినిమా విమర్శకురాలు, రచయిత మైథిలి రావు; నటుడు- చిత్రనిర్మాత నాజర్, ప్రముఖ దర్శకులు- చిత్రకథా రచయిత నాగేష్ కుకునూర్, అస్సామీ చిత్రనిర్మాత ఉత్పల్ బోర్పూజారితోపాటు డాక్యుమెంటరీ చిత్రనిర్మాత- కంటెంట్ వ్యూహకర్త ఆరతి శ్రీవాస్తవలు ప్రధాన జ్యూరీ సభ్యులుగా ఉన్నారు.
యాసర్ తలేబి దర్శకత్వం వహించిన ఇరాన్ సర్న్వెష్ట్- అత్యున్నత గౌరవ పురస్కారాన్ని దక్కించుకుంది. ఈశాన్య భారత్ నుంచి, పరుశురాం తింగమ్– టాయిగన్ రెండవ బహుమతిని గెలుచుకుంది. ప్రతిక్ రాజేంద్ర శ్రీవాస్తవ దర్శకత్వం వహించిన భారతదేశ మై ఫాదర్ ఇజ్ అఫ్రేడ్ ఆఫ్ వాటర్– మూడవ బహుమతిని కైవసం చేసుకుంది.
ఇరాన్‌కు చెందిన దర్శకులు ఇరాజ్ అఫ్స్హరి అస్ల్ దర్శకత్వం వహించిన ది విజిల్, భారత దర్శకులు లిటన్ పాల్ దర్శకత్వం వహించిన నింగ్మాతో పాటు; డీపీఎస్ఎఫ్ఎస్ ఆశాజనకమైన తెలుగు ఫిలీం అవార్డును ఏ నైట్ ఆన్ ది ఫుట్‌పాత్‌లకు ప్రత్యేక జ్యూరీ అవార్డులను ప్రదానం చేశారు. ఎల్జీబీటీక్యూఐఏ+కు మీద దృష్టిపెట్టినఏకైక చిత్రంగా భరత్ దువ్వాడ దర్శకత్వం వహించిన ఏ నైట్ ఆన్ ది ఫుట్‌పాత్ నిలుస్తుంది. తమ మనుగడ, గౌరవం కోసం హిజ్రాలు రాత్రిపూట పడే కష్టాలను వారి సంఘర్షణను ఈ లఘుచిత్రం తెలియజేస్తుంది.
వీటితో పాటు, మయూర్ ప్రకాశ్ కుల్కర్ణి దర్శకత్వం వహించిన భారత లఘుచిత్రం స్వీట్ మూన్; ఇస్మాయిల్ రమేజాని, మర్జీయేహ్ బాని అలీ దర్శకత్వం వహించిన ఇరాన్– హోలి వాటర్; మారిస్ కోర్నొత్తో దర్శకత్వం వహించిన స్పెయిన్– కాలేజ్ ఫ్రం స్పెయిన్; విఘ్నేశ్ పరమశివం దర్శకత్వం వహించిన భారత లఘుచిత్రం తునాయి; సౌరవ్ బ్రహ్మ దర్శకత్వంలో రూపొందిన భారత లఘుచిత్రం “బాడీ డ్యా బాడీ”- ఈ ఐదు చిత్రాలు మెరిట్ సర్టిఫికెట్లను పొందాయి.
ఇరానియన్ విజేతల తరఫున హైదరాబాద్ నగరంలోని వైస్ కాన్సిల్ ఆఫ్ ది ఇరానియన్ కాన్సలేట్– మొహ్సెన్ మోఘద్దామి అవార్డులను స్వీకరించారు.
విశ్వ ప్రదర్శనలో స్థానిక సంస్కృతులు
సమకాలీన సినిమాలో ప్రయోగాలు, చర్చలను ప్రతిబింబించే అరుదైన అవకాశాన్ని హెచ్‌ఐఎస్‌ఎఫ్‌ఎఫ్ కల్పించింది.
ప్రధాన జ్యూరీ సభ్యులతో పాటు ప్రత్యేక అతిథులు కెనడియన్ చిత్ర విమర్శకుడు జూడీ గ్లాడ్‌స్టోన్, నటి లీమాదాస్, మణిపూరి దర్శకులు సుంజు బచస్పతిమయుం, ఫిలిం సోసైటీ ప్రతినిధులు అలెగ్జాండర్ లియో పౌ క్రిస్టొఫర్ డాల్టన్, బాలాజి అయికా చిత్రోత్సవంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలలో పాల్గొని రెండు రోజుల పాటు విస్తృతంగా చర్చించారు.
మారుతున్న సాంకేతికతకు సరిసమానంగా సినిమాను ఎలా భాగస్వామ్యం చేయాలనే దానిపై వక్తలు సంభాషించారు.
ప్రత్యామ్నాయ సినిమా, వాస్తవికత, సంస్కృతితో ఇమిడి ఉన్న సినిమాలను ప్రోత్సహించడంలో జాతీయ చలనచిత్ర అభివృద్ధి సంస్థ(ఎన్ఎఫ్డీసీ)పాత్ర; ప్రత్యమ్నాయ గొంతుకలను పెంచడానికి చలన చిత్రోత్సవాల ఆవశ్యకత; ప్రపంచ సినిమా, ప్రేక్షకుల అంచనాలు, పెరుగుతున్న “మసాలా” సినిమాల ప్రభావంపై కూడా దృష్టి పెట్టారు.
ప్రేక్షకుల మధ్య పెరుగుతున్న చీలికలను కుకునూర్ ప్రస్థావిస్తూ, సినిమాను ప్రారంభించక ముందే వారు దృష్టిపెట్టిన ప్రేక్షకుల గురించి చిత్రనిర్మాతలు స్పష్టంగా అర్ధం చేసుకోవలసిన అవసరముందని నొక్కి చెప్పారు. తాను స్వయంగా ఎదుర్కొన్న వృత్తిపరమైన అనుభవాలను కొన్నింటిని ఉదహరించారు.
ఒలంపిక్స్ కోసం సంభాషణలు లేకుండా తాను ఎలా లఘుచిత్రాన్ని తయారు చేశారో అనే విషయాన్ని గ్లాడ్ స్టోన్ గుర్తు చేస్తూ– దృశ్యం ద్వారా చెప్పిన కథ బలంగా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో తను తెలియజేశారు.
స్థానిక సంస్కృతుల ఖచ్చితత్వాన్ని విశ్వ ప్రేక్షకులు గౌరవిస్తారనడానికి ప్రపంచవ్యాప్తంగా మలయాళ సినిమా మంజుమ్మల్ బాయ్స్ సాధించిన విజయాన్ని పరిగణలోకి తీసుకోవాలని బచస్పతిమయుం సూచించారు. తాను గమనించిన, సమకాలీన భారతీయ సినిమా సంస్కృతిని కథావస్తువుగా తీసుకొని పని చేయడం చాలా అరుదని తెలియజేశారు.
ప్రేక్షకులతో సంబంధాలను ఏర్పర్చుకోవడానికి ఈశాన్య ప్రాంత చిత్రనిర్మాతలు, నటులు ఏవిధంగా గ్రామాలలో పర్యటిస్తారనే దాని గురించి బోర్పూజారి వివరించారు. సినిమా హాళ్ల కొరత వల్ల వాణిజ్యపరమైన భారీ సినిమాల నిర్మాణానికి తమ ప్రాంతంలో అవకాశం లేదని ఉత్పల్ భోర్పూజారి తెలిపారు.
“మేము మొబైల్ థియేటర్‌ను అనుకరిస్తాము”అని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హెచ్‌ఐఎస్‌ఎఫ్‌ఎఫ్ వంటి వేదికలు తమ కళలను ప్రపంచానికి చూపించడానికి కీలకంగా మారాయని చెప్పారు.

ప్రత్యామ్నాయ సినిమా
తమ పనులలో తమ అస్తిత్వాన్ని, సంస్కృతిని ప్రతిబింబించాలని యువ చలన చిత్రనిర్మాతలకు సినిమా సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు డాల్టన్ సూచించారు. ప్రతిధ్వనించే అంశాలు ప్రేక్షకులను బలంగా ఆకర్షిస్తున్నాయని, తమకు తాము మార్కెటింగ్ చేసుకోవడంలో వెనకడుగు వేయరాదని, ఇలాంటి వాటి వల్ల విశ్వ ప్రేక్షకుల వద్దకు చేరుకోగలరని తెలియజేశారు.
వాణిజ్య సినిమా స్త్రీని ఒక వస్తువుగా చూపిస్తుందని, అదే సమాంతర సినిమా కథాంశంలో స్త్రీని కేంద్ర బిందువుగా చూపిస్తుందని మైథిలి రావు చెప్పారు. పాఠశాల, కళాశాల స్థాయిలోనే పిల్లలు– యువకులను ఫిలిం సొసైటీలలో పాలుపంచుకునే అవకాశం కల్పించినప్పుడు వారు సూత్రబద్ధమైన సినిమా ప్రభావానికి గురికారని తను నొక్కి చెప్పారు. “ఇలాంటి చొరవలు ప్రత్యామ్నాయ సినిమా పునరుద్ధరణకు ఎంతో అవసరం”అని తెలిపారు.
ప్రత్యామ్నాయ సినిమా, లఘుచిత్రాలు– ఓటీటీ వేదికపైకి రావడానికి తగిన స్థలాన్ని అంకిత భావంతో కేటాయించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ప్రోత్సాహం, మద్దత్తునివ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని దాస్ చెప్పారు.
ప్రత్యామ్నాయ సినిమా సుస్థిరత కోసం విడుదలకు ముందు సంచలనం, పౌర సంబంధాలతో పాటు నైపుణ్యత, ప్రతిభకు ప్రాముఖ్యతనివ్వాలని లియో పౌ సూచించారు.
దేశంలో 1980, 1990 దశకాల్లో ఆర్ట్ సినిమాలు– ఫిలిం సోసైటీ ఉద్యమాల పెరుగుదల విషయాన్ని ఐకా గుర్తుచేశారు. ప్రేక్షకులు క్రమంగా సినిమా హాల్స్ నుంచి టెలివిజన్‌కు మారినట్టు; ప్రస్తుతం మొబైల్ ఫోన్లు, ఓటీటీ వేదికలకు మారుతున్నట్టుగ తను గుర్తించినట్టుగా తెలియజేశారు. “ఈ మార్పును అర్థం చేసుకోవాలి. కోల్‌కతాలో ప్రేక్షకుల కోసం ఫిలిం సోసైటీ ద్వారా ఒక స్క్రీన్‌ను ఎంపిక చేసి ప్రత్యమ్నాయ సినిమాను ప్రదర్శిస్తున్నారు. ఆ తర్వాత వారిని చర్చల్లో పాల్గొనే విధంగా చేస్తున్నారు” తను తెలిపారు.
సమకాలిన సినిమా నిర్మాణంలో సవాళ్లు
చిత్రోత్సవం చివరి రోజు “ఆధునిక చిత్ర నిర్మాణంలో సవాళ్ళు”అనే అంశం మీద దృష్టి సారించారు. ఈ సెషన్లో నాజర్, రావు, శ్రీవాస్తవ, ఆసియా జర్నలిజం కళాశాల శశికుమార్ పాల్గొన్నారు.
సినిమా పరిణామక్రమం ప్రతిబింబించింది, 1980 దశకంలో సినిమా నిర్మాణం పూర్తిగా ఫిలిం నెగెటీవ్లపై ఆధారపడి ఉండేదని నాజర్ గుర్తు చేశారు.
అయితే కొత్తలో డిజిటలైజేషన్ గురించి ఇబ్బందిపడవలసి వచ్చిందని, “ఎవరైనా సాంకేతికతను ఉపయోగించుకోవచ్చు. కానీ నిరంతరంగా దానిపైనే ఆధారపడితే ప్రభావంతమైన విషయాన్ని రూపొందించడం అసలైన సవాలుగా మారుతుంది”అని అన్నారు.
పాపులర్ భారతీయ సినిమాలో కృత్రిమ మేధస్సుతో సబ్-ప్లాట్స్, హాస్యాన్ని సృష్టించలేమని; లేదా ఏఐ మానవభావోద్వేగాల ప్రతిరూపాన్ని చూపించలేదదని; అసలు “ఏఐ అనుభూతి చెందదు”అని నాజర్ అన్నారు.
సెన్సార్‌షిప్‌తో పాటు సృజనాత్మకత స్వేచ్ఛ పట్ల పెరుగుతున్న అసహనంవంటి ప్రధాన సవాళ్లను చిత్రనిర్మాతలు ఎదుర్కొంటున్నారని శశి కుమార్ గుర్తించారు.
కేరళ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో బ్యాటిల్‌షిప్ పొటెంకిన్(1925), బీఫ్‌తో సహా 19 సినిమాలను నిషేధించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
పెత్తందారి పాలనలోని ప్రాంతాల నుంచి సినిమా పుట్టుకొస్తుందని, ఆ మార్గంలోనే మనం కూడా వెళ్తున్నట్టు కనిపిస్తుందని శశికుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.
దేశంలో సంస్థాగత వ్యతిరేక సినిమాలు గతంలో చాలా రూపొందించబడినా, వాటికి జాతీయ చలన చిత్రాభివృద్ధి సంస్థ(ఎన్ఎఫ్డీసీ)వంటి సంస్థలు మద్దత్తునిచ్చేవని రావు గుర్తు చేశారు. ఈ రోజు అప్రకటిత సెన్సార్షిప్ పేరుతో సృజనాత్మకత స్వేచ్ఛను అణిచి వేస్తున్నారని అన్నారు.
కంటెంట్ వ్యూహకర్త శ్రీవాస్తవ తన అనుభవాన్ని తెలియజేశారు.
సోషల్ మీడియా బూమ్ ఎలా సినిమా మీద ప్రభావం చూపిందో శ్రీవాస్తవ చెప్పుకొచ్చారు.
“‘సినిమా’ అనే పదాన్ని కంటెంట్ రీప్లేస్ చేసింది.కంటెంట్‌ను రూపొందించడం ఇంకా అవసరం లేదు; అది ఖచ్చితంగా వ్యూహాత్మకంగా రూపొందించబడుతుంది. అనుసరణ ఆహ్మానించదగిన విషయమే కానీ, అర్థవంతమైన కంటెంట్ ఎప్పుడూ తన ప్రేక్షకులను వెతుక్కుంటుంది. అంతేకాకుండా మన స్థానమెంటో ప్రపంచపటంలో నిర్వచిస్తుంది”అని తెలియజేశారు.
హెచ్‌ఐఎస్‌ఎఫ్‌ఎఫ్ అంటే ఏంటి?
సాంస్కృతిక, యువజన పర్యాటక శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ చలనచిత్రాభివృద్ధి సంస్ధ(టీఎస్ఎఫ్డీసీ) ఏర్పాటు చేసిన మూడు రోజుల అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని– రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫి మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ చలన చిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్ దిల్ రాజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.
ప్రపంచ చిత్రపటంపై హెఐఎస్ఎఫ్ఎఫ్ శాశ్వతంగా నిలిచి పోగలదని ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
హెచ్‌ఐఎస్‌ఎఫ్‌ఎఫ్ ఆర్గనైజింగ్ ప్యాట్రన్‌గా వ్యవహరించిన తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డు జ్యూరీ కమిటీ సభ్యులు, సీనియర్ చిత్రనిర్మాత ఉమామహేశ్వర్ రావు మాట్లాడారు. భవిష్యత్తులో షార్ట్ఫిలీంను ప్రోత్సహించడంలో ఈ చొరవ ఎంతో కీలకంగా మారగలదని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
అన్సెస్సావో, జహాన్ – ది లాస్ట్ గిఫ్ట్ ప్రదర్శనతో చిత్రోత్సవం ప్రారంభమైంది.
అన్సెస్సావో 30 నిమిషాల నిడివున్న లఘుచిత్రాన్ని మంగరిష్ బందోద్కర్ దర్శకత్వం వహించారు. మానవుని జీవన ప్రయాణంలో వయసు పై పడటం, ఒంటరితనంలో ఎదురయ్యే సవాళ్లపై ఈ చిత్రం రూపొందించబడింది.
వాతావరణం మార్పు మానవుని ఉదాసీనత కేంద్రాంశంగా జహాన్- ది లాస్ట్ గిఫ్ట్ హిందీ లఘుచిత్రాన్ని రాహుల్ శెట్టి దర్శకత్వం వహించారు. పూర్తిగా కల్పితమైన ఈ లఘుచిత్రంలో నటుడు టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో నటించారు.
ఈశాన్య రాష్ట్రాల్లో బయటకు వస్తున్న నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పడానికి– ప్రత్యేకంగా ఈశాన్య పెవిలియన్‌ను ఏర్పాటు చేశారు. అందులో 11 షార్ట్ ఫిలీంలను ప్రదర్శించారు.
గతాన్ని సమీక్షించడంలో భాగంగా 5 క్లాసిక్ సినిమాలను కూడా ప్రదర్శించారు.
ఈ వ్యాసాన్ని ఆంగ్లంలో చదవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
