
ఢిల్లీ హైకోర్టు సైన్స్-హబ్, లిబ్జెన్లను నిషేధించింది. దీంతో భారతీయ విద్యార్థులకు, మొదటితరం స్వతంత్ర రచయితలకు ప్రాణాధారమైన జీవన రేఖలను ఈ చర్య కత్తిరించింది.
2025 ఆగస్టు 19న ఢిల్లీ హైకోర్టు సైన్స్-హబ్, లిబ్జెన్లను నిషేధిస్తూ ఆదేశాలు జారీచేసింది. చాలామందికి ఉపయోగపడే ఒక గ్రంథాలయాన్ని ఈ చర్య మూసివేసినట్టే.
అమెరికన్ రివ్యూలో వచ్చిన ఒక వ్యాసం గురించి యధాలాపంగా ఒక టీచరు చెప్పిన తర్వాత, హైస్కూలులో ఉన్నప్పుడు తొలిసారి సైన్స్-హబ్ గురించి నేను తెలుసుకున్నాను. ఆ ఒక్క వ్యాసానికి నాకు ఒక నెల రుసుంకంటే ఎక్కువ ఖర్చయింది. చెల్లించే బిల్లును నమ్మశక్యంకాక తేరిపార చూడటం ఇంకా నాకు గుర్తుంది. మంచి విషయాలన్నింటిలానే, ఒక రెడ్డిట్ పోస్టు ద్వారా నేను స్కిహబ్ను కనిపెట్టా- అదే నన్ను ఈ వ్యాసాన్ని రాసేలాజేసింది. ఆ రాత్రి నేనెప్పుడూ మామూలుగా అయితే ప్రవేశించని కుందేలు కలుగులోకి వెళ్లాను.
అవే నా ఆలోచనకు రూపానిచ్చాయి..
ప్రస్తుతం హోంగ్రోన్ డిజిటల్ వార్తా సంస్థ సంస్కృతి, కళలు, ఉద్యమాల గురించిన విశ్లేషణలు– వ్యాఖ్యానాలు ప్రచురిస్తోంది. ఈ సంస్థ కోసం రాస్తున్నప్పుడు ఆ రాత్రులనాటి నా కుతూహలం గుర్తుకొస్తుంది. మా కాలేజీ లైబ్రరీలో పాత సామాజిక శాస్త్ర పుస్తకాలే ఉన్నప్పుడు ఈ ప్రత్యామ్నాయ గ్రంథాలయాలు నాకు తత్త్వశాస్త్రాన్ని పరిచయం చేశాయి. మానవ శాస్త్రం, మీడియా సిద్ధాంతం, పర్యావరణ అధ్యయనం వంటి వాటి గురించి విమర్శనాత్మకంగా ఆలోచించడం నేర్పాయి. ఈ అంశాలే నేను రాస్తున్న తరహా వ్యాసాలకు రూపకల్పన చేశాయి. లేకుంటే దశాబ్దాల క్రిందట ఘనీభవించిపోయిన పాఠ్యాంశాలతో నేను ఆగిపోయిండేదాన్ని.

మా బృందంలోని మొదటి తరం చదువరులకు ఈ వైబ్సైట్లు ఊపిరి పోసే సంచులు. మా గ్రంధాలయంలో ఒకే ఒక్క పాఠ్యపుస్తక ప్రతి ఉండేది. అది అప్పటికీ కాగితాలు ఊడుతుండేది. ఇంకా ఘోరం ఏంటంటే, ఒక సెమిస్టర్ కాలానికి దానిని ఎవరో తీసుకొని వెళ్లిపోయారు.
సైన్స్-హబ్, లిబ్జెన్లు సమాన అవకాశాలు కల్పించేవిగా మారాయి. ఆండ్రాయిడ్ ఫోన్, ఇంటర్నెట్ ఉన్నవారెవరయినా సరే అత్యుత్తమ గ్రంథాలయాలలోని పుస్తకాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఒక మిత్రురాలు జీఆర్ఈకి తయారవుతూ తన మొత్తం అధ్యయన ప్రణాళికను అక్కడ లభించిన ఒక ప్రతిపై ఆధారపడి తయారవడం నాకు గుర్తుంది. రెండవ స్థాయి కాలేజీలో చదువుతున్న మరో మిత్రుడు అతని లైబ్రరీ బడ్జెట్టు 1990ల నుంచి మారలేదు. తన పరిశోధక వ్యాసం మొత్తాన్ని లిబ్జెన్ ద్వారానే సమకూర్చుకున్నాడు. ఇక మాకు ఇంటర్నెట్లోని ఈ చీకటి మూలలు ఒక్కటే ఆధారం.
సాంస్కృతిక పాత్రను విస్మరించిన నిషేధం..
ఈ వేదికల్ని అనధికారిక నకళ్లుగా నిషేధం భావించింది. కానీ, భారతదేశంలో అవి పోషించిన సాంస్కృతిక పాత్రను విస్మరించింది. అవి నిధులులేని గ్రంధాలయాల స్థానాన్ని, చందాలు రద్దు చేసుకున్న పత్రికల స్థానాన్ని, కాలం చెల్లిన పుస్తకాల అల్మారాల స్థానాన్ని ఇవి భర్తీ చేశాయి. ఢిల్లీ విద్యార్థులకు, చిన్న పట్టణాల విద్యార్థులకు మధ్యగల పెద్ద అగాధానికి ఇవి వారధిగా పనిచేశాయి. జిజ్ఞాసకలిగిన వారందరికీ జ్ఞానం చెందుతుందనే ఆలోచనను ఇవి సజీవంగా ఉంచాయి.
హోంగ్రోన్లో సుదీర్ఘ వాస్తవిక గాధలపై పనిచేసేటప్పుడు– నేను ఇవాల్టికి కూడా ఈ వెబ్సైట్ల వల్ల నాకు ఏర్పడ్డ పరిశోధనా అలవాట్లపైనే ఆధారపడతాను. ఒక ఫుట్నోటును ఎట్లా వెంటాడాలో, ఒక నిర్ధారణను ఎట్లా పునర్లిఖించాలో, ప్రత్యక్షంగా కనబడుతున్నదాన్ని దాటి ఎట్లా చూడాలో మొదలైన నైపుణ్యాలు- నా విద్యాలయం అందించలేని పాఠాలను నేను చేరలేక పోయివుంటే ఈ నైపుణ్యాలు నాలో పాదుకునేవే కాదు.
ఇప్పుడు ఈ నిషేధంలో నేను ఒకప్పుడున్న స్థానంలో– డబ్బుల్లేక కుతూహలం ఉండి, నేర్చుకోనే ఆతురతలో ఇప్పటికీ ఉన్నవారి గురించి ఆలోచిస్తాను. ఈ నిషేధం వల్ల ఈ దీపాలు వారికి ఆరిపోయాయి. ఒక దేశం– ఒకే చందా వంటి ప్రత్యామ్నాయ పథకాలు చివరికి విశ్వవిద్యాలయాలకు చేరవచ్చు. కానీ అవి ఈనాటికీ పరీక్షలు, సంస్థాగత అందుబాటు. అధికార యంత్రాంగం వంటి వాటిలో తాళం వేసి ఉన్నాయి. అదే సమయంలో వేలాదిమంది విద్యార్థులు, రచయితలు తుక్కులో వెతుక్కునే దానికి నెట్టబడ్డారు.
భారతదేశంలో జ్ఞానం ఎప్పుడూ కూడా మెరుగైన కాలానుగుణంగా కూర్పు చేయడం ద్వారానే వ్యాపించింది. అరువు తెచ్చుకున్న పుస్తకాలు, జిరాక్సు తీసిన అధ్యాయాలు, పీజీపీ పెన్‌డ్రైవ్‌ల ద్వారానే ఆ కూర్పు జరిగింది. సైన్స్-హబ్, లిబ్జెన్లు ఈ సుసంన్న వారసత్వానికి తాజా కోణాలు. వాటిని లేకుండా చేయటం అంటే, అందుబాటు లేకుండా చేయడమే కాదు. పంచుకునే ఒక సాంస్కృతిక అలవాటును కోల్పోవడం, కుతుహలాన్ని అరుదుతనం శాసించడాన్ని నిరాకరించడం కూడా.
అనువాదం: దేవీ
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.